News December 30, 2024

ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు?

image

AP: సూపర్-6లో భాగంగా మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ అంశంపై ఉన్నతాధికారులు, మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డితో ఇవాళ సీఎం చంద్రబాబు చర్చించారు. పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకంపై అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

News December 30, 2024

పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్

image

AP: రేషన్ బియ్యం మిస్సింగ్ ఆరోపణల కేసులో మాజీ మంత్రి పేర్నినాని సతీమణి జయసుధకు కృష్ణా జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. జయసుధ పేరిట ఉన్న గౌడౌన్‌ను అద్దెకు ఇవ్వగా అక్కడున్న రేషన్ బియ్యం దారి మళ్లిందనే ఆరోపణలున్నాయి.

News December 30, 2024

సంక్షోభం.. పిల్లలు పుట్టడం లేదు!

image

సంతానం రేటు భారీగా తగ్గడం వియత్నాం దేశాన్ని కలవరపెడుతోంది. రికార్డు స్థాయిలో బర్త్ రేటు 1.91కి పడిపోయింది. ఈ ట్రెండ్ మరికొన్నేళ్ల పాటు కంటిన్యూ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. బర్త్ రేటు తగ్గితే వృద్ధుల సంఖ్య పెరగడంతో పాటు శ్రామికుల కొరత సమస్య ఏర్పడుతుంది. ప్రస్తుతం వియత్నాంలో 60 ఏళ్లకు పైబడ్డవారు 11.9% ఉండగా, ఇది 2050 నాటికి 25%కి మించనుంది. సంతానం రేటు పెరిగేందుకు ఆ దేశం ప్రణాళికలు రచిస్తోంది.

News December 30, 2024

హైదరాబాద్ ‘నుమాయిష్’ విశేషాలు

image

☛ జనవరి 3 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి గ్రౌండ్స్‌లో నిర్వహణ
☛ 26 ఎకరాల్లో దాదాపు 2500 స్టాల్స్ ఏర్పాటు
☛ JAN 6న మహిళలకు, JAN 31న పిల్లలకు స్పెషల్ డేలుగా కేటాయింపు
☛ ఎంట్రీ టికెట్ ధర రూ.50, పిల్లలకు ఉచితం
☛ సందర్శకులకు ఎంట్రీ ఇచ్చిన 45 నిమిషాల వరకూ ఫ్రీ వైఫై
☛ శని, ఆదివారాల్లో సా.4 నుంచి రా.11 వరకు, మిగిలిన రోజుల్లో రాత్రి 10.30 వరకు ఎగ్జిబిషన్ నిర్వహణ

News December 30, 2024

రూ.80,112 కోట్లతో తెలుగు తల్లికి జలహారతి ప్రాజెక్టు: సీఎం

image

APని కరవు రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. రూ.80,112 కోట్ల అంచనాతో తెలుగు తల్లికి జలహారతి ప్రాజెక్టు(బనకచర్ల ప్రాజెక్టు) ప్రణాళికను వివరించారు. ‘మొదట గోదావరి నుంచి కృష్ణా నదికి నీళ్లు తరలిస్తాం. అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌(అనంతపురం)కు, అటు నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు జలాలను తీసుకెళ్తాం. దీంతో 80 లక్షల మందికి తాగు, సాగు నీరు అందుతుంది’ అని తెలిపారు.

News December 30, 2024

జనవరి 1 నుంచి ఇలాంటి బ్యాంక్ అకౌంట్లు క్లోజ్

image

బ్యాంకింగ్ కార్యకలాపాల్లో లోపాలను పరిష్కరించడానికి, స్కామ్‌లను అరికట్టడానికి జనవరి 1 నుంచి ఆర్బీఐ కీలక మార్పులు చేస్తోంది. పలు రకాల బ్యాంక్ ఖాతాలను మూసివేయనుంది. అవి ఏంటంటే?
ఇనాక్టీవ్ అకౌంట్: ఏడాదిపాటు ఉపయోగంలో లేని ఖాతా.
డార్మాంట్ అకౌంట్: రెండేళ్లపాటు ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతా.
జీరో బ్యాలెన్స్ అకౌంట్: ఆయా బ్యాంకులను బట్టి ఎక్కువ కాలం జీరో బ్యాలెన్స్ కొనసాగించే ఖాతాలు.

News December 30, 2024

రాహుల్ వియత్నాం వెళ్తే BJPకి నొప్పేంటి: కాంగ్రెస్

image

రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై BJP, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దేశం సంతాప దినాలు జరుపుకుంటుంటే రాహుల్ న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్లారని BJP నేత అమిత్ మాలవీయ విమర్శించారు. ‘డైవర్షన్ పాలిటిక్స్‌ను సంఘీలెప్పుడు ఆపేస్తారు? MMS అంత్యక్రియలను యమున ఒడ్డున నిర్వహించకపోవడం సిగ్గుచేటు. అయినా రాహుల్ విదేశీ యాత్రపై మీకెందుకు బాధ? న్యూఇయర్‌లోనైనా బాగుపడండి’ అని మాణికం ఠాగూర్ అన్నారు.

News December 30, 2024

సినిమా వాళ్లతో రేవంత్ సెటిల్మెంట్ చేసుకున్నారు: కేటీఆర్

image

TG: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అల్లు అర్జున్‌ను సీఎం రేవంత్ టార్గెట్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. సినిమా వాళ్లతో సీఎం సెటిల్మెంట్ చేసుకున్నారని, అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారంపై ఏం మాట్లాడట్లేదని మీడియాతో చిట్ చాట్‌లో వ్యాఖ్యానించారు. గురుకులాల్లో చనిపోయిన విద్యార్థులకు, ఆటో డ్రైవర్లు, రైతులు, నేతన్నల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

News December 30, 2024

₹40K CR: గొడవలున్నా భారత షేర్లలో చైనా బ్యాంకు పెట్టుబడి!

image

సరిహద్దు వివాదం నెలకొన్నప్పటికీ భారత్‌లో చైనా సెంట్రల్ బ్యాంకు (PBOC) భారీ పెట్టుబడులే పెట్టింది. 2024లో రూ.40వేల కోట్ల విలువైన 35 కంపెనీల స్టాక్స్‌ను హోల్డ్ చేసింది. అత్యధికంగా ICICIలో రూ.6139CR, HDFC BANKలో రూ.5303CR, TCSలో రూ.3619CR, పవర్‌గ్రిడ్‌లో రూ.1414CR, కొటక్ బ్యాంకు, HUL, బజాజ్ ఫైనాన్స్‌లో మొత్తంగా రూ.1500CRను ఇన్వెస్ట్ చేసింది. FDIకి అనుమతి లేకపోవడంతో చైనా FPI, FIIల మార్గం ఎంచుకుంది.

News December 30, 2024

OG, హరిహరవీరమల్లు అప్డేట్స్ చెప్పిన పవన్ కళ్యాణ్

image

1980-90ల మధ్య జరిగే కథ OG(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ ‘ఎక్కడికెళ్లినా అభిమానులు ఓజీ ఓజీ అని అరుస్తుంటే అవి నాకు బెదిరింపుల్లా అనిపిస్తున్నాయి. నేను అన్ని సినిమాలకూ డేట్స్ ఇచ్చినా చిత్ర బృందాలు సద్వినియోగం చేసుకోలేదు. హరిహరవీరమల్లు 8 రోజుల షూటింగ్ ఉంది. త్వరలోనే రెండు మూవీలను పూర్తిచేస్తా’ అని తెలిపారు.