News October 4, 2024

మంత్రి అలా మాట్లాడటం సిగ్గుచేటు: అశ్విని వైష్ణవ్

image

మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ మహిళా వ్యతిరేక ఆలోచనను సూచిస్తున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ‘ఒక మంత్రి ఇలా సినీ ప్రముఖుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటు. ఫిల్మ్ ఇండస్ట్రీని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుందనే దానికి ఇదే నిదర్శనం. దీనిపై రాహుల్ గాంధీ, పార్టీ అధిష్ఠానం మౌనంగా ఉండటం చూస్తుంటే వారు ఈ వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లు అర్థం అవుతోంది’ అని ట్వీట్ చేశారు.

News October 4, 2024

తొలి కృత్రిమ ఉపగ్రహం ‘స్పుత్నిక్-1’

image

ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1ను సోవియట్ యూనియన్ 1957లో సరిగ్గా ఇదే రోజున ప్రయోగించింది. భూమిచుట్టూ పరిభ్రమించిన ఈ శాటిలైట్ ప్రతి గంటకు 29,000km ప్రయాణించి, రేడియో సిగ్నల్స్‌ను ప్రసారం చేసింది. 22 రోజులు నిరంతరాయంగా పని చేసిన తర్వాత OCT 26న బ్యాటరీ అయిపోవడంతో స్పుత్నిక్-1 నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయి. 1958 జనవరి 4న ఇది కాలిపోయి, తన కక్ష్యనుండి భూమి వాతావరణంపై పడిపోయింది.

News October 4, 2024

15 శాతం వృద్ధి రేటు సాధించాలి: సీఎం చంద్రబాబు

image

AP: గత ప్రభుత్వ అస్పష్ట ఆర్థిక విధానాల కారణంగా చితికిపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. 15 శాతం వృద్ధి రేటు సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవల రంగంలో సాధించాల్సిన వృద్ది రేటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. విభజన కష్టాలున్నా 2014-19లో 13.7% వృద్ధిరేటును సాధించామని, గడిచిన 5 ఏళ్లలో వృద్ధి రేటు 10.59%కి పడిపోయిందని చెప్పారు.

News October 4, 2024

‘దేవర-2’ షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: ఎన్టీఆర్

image

డైరెక్టర్ కొరటాల శివతో తన ప్రయాణం ‘బృందావనం’ సినిమాతో ప్రారంభమైందని, ఇప్పుడు ఆయన తన ఫ్యామిలీ మెంబర్‌గా మారారని ఎన్టీఆర్ తెలిపారు. ‘దేవర’ సక్సెస్ పార్టీలో ఆయన మాట్లాడారు. ‘ఈ జన్మలో నేను మీ కోసం ఎంత చేసినా అది వడ్డీ మాత్రమే. వచ్చే జన్మలో మీ రుణం తీర్చుకుంటా’ అని ఫ్యాన్స్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘దేవర-2’ షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

News October 4, 2024

పరువు నష్టం.. ఈ శిక్షలు పడొచ్చు

image

ఎవరైనా పరువుకు భంగం కలిగిస్తే దానిపై కోర్టులో <<14263146>>పరువునష్టం<<>> దావా వేయవచ్చు. నేరం రుజువైతే 2 సంవత్సరాల వరకు సాధారణ జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. IPC సెక్షన్ 500 ప్రకారం ఈ శిక్షలుంటాయి. గతంలో మోదీ పేరుపై చేసిన కామెంట్స్‌కు గానూ రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. అయితే దానిపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఇటీవల శివసేన నేత సంజయ్ రౌత్‌కు 15రోజుల జైలు శిక్ష పడింది.

News October 4, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 4, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 4:54 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:06 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:06 గంటలకు
అసర్: సాయంత్రం 4:23 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:02 గంటలకు
ఇష: రాత్రి 7.14 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 4, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 4, 2024

అక్టోబర్ 4: చరిత్రలో ఈరోజు

image

1911: సినీ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు జననం
1957: మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1ను ప్రయోగించిన సోవియట్ యూనియన్
1977: నటి సంఘవి జననం
1997: క్రికెటర్ రిషబ్ పంత్ జననం
2015: సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మరణం
* అంతర్జాతీయ జంతు దినోత్సవం

News October 4, 2024

కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రభాస్, రామ్ చరణ్ స్పందన

image

మంత్రి కొండా సురేఖ <<14254371>>వ్యాఖ్యలపై<<>> ప్రభాస్, రామ్ చరణ్ స్పందించారు. ‘కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమైనవి, నిరాధారమైనవి. ప్రజలచే ఎన్నుకోబడిన నేత నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం దిగ్భ్రాంతికరం. ఇలాంటి ప్రవర్తనను మేము సహించం’ అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. ‘రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత జీవితాలను అగౌరవపరచడం కరెక్ట్ కాదు. రాజకీయాల కంటే గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలి’ అని ప్రభాస్ పోస్ట్ చేశారు.

News October 4, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.