News October 4, 2024

కమల తరఫున ప్రచార బరిలోకి బరాక్ ఒబామా

image

డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా మాజీ అధ్యక్షుడు ఒబామా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. క‌మ‌ల అభ్య‌ర్థిత్వ నామినేష‌న్‌కు ఒబామా, ఆయ‌న స‌తీమ‌ణి మిచెల్‌ మద్దతు పలికిన విషయం తెలిసిందే. స్వింగ్ ఓటర్లే లక్ష్యంగా Oct 10న పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో ఒబామా మొదటి ప్రచార స‌భ జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అయితే, ఈ స‌భ‌లో క‌మ‌ల కూడా పాల్గొనే విష‌య‌మై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

News October 4, 2024

వేగంగా పచ్చబడుతున్న అంటార్కిటికా!

image

తెల్ల దుప్పటి కప్పుకొని కనిపించే అంటార్కిటికా పర్యావరణ మార్పు కారణంగా పచ్చబడుతోంది. పరిశోధకులు ఈ విషయాన్ని నేచర్ జియోసైన్స్ జర్నల్‌లో తెలిపారు. గడచిన 4 దశాబ్దాల్లో అంటార్కిటికా పచ్చదనం 10 రెట్లు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. 1986లో 0.4 చదరపు మైళ్లున్న పచ్చదనం 2021 నాటికి 5 చదరపు మైళ్ల విస్తీర్ణానికి చేరిందని వెల్లడించారు. ఈ మార్పు భూ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంచనా వేశారు.

News October 4, 2024

కొండా సురేఖ కామెంట్స్‌పై RGV మరో ట్వీట్

image

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై డైరెక్టర్ RGV మరోసారి స్పందించారు. ‘సురేఖ గన్ గురిపెట్టింది కేటీఆర్‌కు. కాల్చింది మాత్రం నాగార్జున, నాగచైతన్యను. కానీ క్షమాపణ చెప్పింది సమంతకు. ఐన్‌స్టీన్ కూడా ఈ ఈక్వేషన్‌ను పరిష్కరించలేడేమోనని నాకు డౌట్’ అని సెటైరికల్ ట్వీట్ చేశారు. కాగా RGV అంతకుముందు సమంతను సురేఖ పొగిడారని <<14260907>>కామెంట్<<>> చేసిన విషయం తెలిసిందే.

News October 4, 2024

ఉప్పల్‌లో మ్యాచ్.. రేపే టికెట్లు విడుదల

image

భారత్-బంగ్లాదేశ్ మధ్య ఈనెల 12న ఉప్పల్ వేదికగా మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు HCA అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు తెలిపారు. మ.12.30 గంటల నుంచి పేటీఎం ఇన్‌సైడర్‌‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. టికెట్ల ప్రారంభ ధర రూ.750 కాగా గరిష్ఠ ధర రూ.15వేలుగా నిర్ధారించినట్లు చెప్పారు. బుక్ చేసుకున్నవారు ఈనెల 8-12 మధ్య జింఖానా స్టేడియంలో ఫిజికల్ టికెట్లు తీసుకోవాలని సూచించారు.

News October 4, 2024

రాహుల్ గాంధీకి పుణే కోర్టు సమన్లు

image

గత ఏడాది యూకే ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా వినాయక్ దామోదర్ సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌న్న ఆరోప‌ణ‌ల కేసులో రాహుల్ గాంధీకి పుణే కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ వివిధ సంద‌ర్భాల్లో ప‌దే ప‌దే సావ‌ర్క‌ర్ ప‌రువు తీస్తున్నార‌ని సావ‌ర్క‌ర్ సోద‌రుడి మ‌న‌మడు సాత్య‌కి కోర్టును ఆశ్ర‌యించారు. రాహుల్ గాంధీని చట్ట ప్రకారం విచారించి శిక్షించాల‌ని, నష్టపరిహారం విధించాలని సాత్య‌కి కోరారు.

News October 4, 2024

మీ ప్రయాణం ఇంకెక్కడిదాకా స్వామీ: అంబటి

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేత అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా మరోసారి సెటైర్ వేశారు. ‘చె గువేరాతో ప్రారంభమై.. సనాతన ధర్మం వరకూ సాగిన మీ ప్రయాణం.. ఇంకెక్కడి దాకా స్వామీ?’ అంటూ ట్వీట్ చేశారు. కాగా ‘బాబు సిట్‌ను రద్దు చేసి సుప్రీంకోర్టు సిట్ వేయడాన్ని స్వాగతిస్తున్నాం’ అంటూ ఆయన మరో ట్వీట్ చేశారు.

News October 4, 2024

టాస్ ఓడిన టీమ్ ఇండియా

image

వుమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్ ఇండియా టాస్ ఓడింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్: షఫాలీ, స్మృతి, హర్మన్‌, రోడ్రిగ్స్, రిచా, దీప్తి, వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్, అరుంధతి, రేణుకా సింగ్, ఆశా.
కివీస్: బేట్స్, ప్లిమ్మర్, అమేలియా కెర్, డివైన్(సి), హాలిడే, గ్రీన్, ఇసాబెల్లా, జెస్ కెర్, మెయిర్, ఈడెన్ కార్సన్, లీ తహుహు.

News October 4, 2024

భారీ ఎన్‌కౌంటర్.. 30 మంది మావోలు మృతి

image

మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 30 మంది మరణించారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనాస్థలంలో బలగాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి.

News October 4, 2024

తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. ప్రభుత్వం తరఫున సీఎం దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇవాళ రాత్రికి ఆయన కొండపైనే బస చేయనున్నారు. రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు.

News October 4, 2024

ఆ జిల్లా పేరు మార్చాలని సీఎంకు మంత్రి సత్యకుమార్ లేఖ

image

AP: వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ CM చంద్రబాబుకు లేఖ రాశారు. జిల్లాకు కడప అని పేరు పెట్టడం వెనుక చారిత్రక నేపథ్యం ఉందన్నారు. తిరుమలకు వెళ్లే భక్తులు ముందుగా కడపలోని వెంకటేశ్వరుడిని దర్శించుకుంటారన్నారు. అవగాహనా రాహిత్యంతో వైసీపీ ప్రభుత్వం జిల్లా పేరును మార్చిందని ఆరోపించారు. ఇదే విషయాన్ని గత అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రస్తావించినట్లు పేర్కొన్నారు.