India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2019 మే 31న నిర్మల తొలిసారి బాధ్యతలు చేపట్టినప్పుడు సెన్సెక్స్ 39,700 వద్ద ఉంది. అది కాస్త 93% పెరిగి 77వేల మార్క్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రెండో టర్మ్‌లోనూ మార్కెట్లు దూసుకెళ్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. FY28కు లక్ష మార్క్ దాటుతుందని జోస్యం చెబుతున్నారు.
* 2003లో రాజకీయ ప్రస్థానం మొదలు
* 2024లో తొలిసారి ఎమ్మెల్యేగా రాయచోటి నుంచి ఎన్నిక
* రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం
* తండ్రి మండిపల్లి నాగిరెడ్డి మాజీ ఎమ్మెల్యే.. రాయచోటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 1985, 1989లో గెలుపు
* సోదరుడు నారాయణ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యే (1993, 1994)
*1994లో ఎన్టీఆర్ పిలుపుతో తొలి సారి ఉరవకొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
*1994, 2004, 2009, 2019, 2024లో విజయాలు. 1999, 2014లో అపజయాలు.
*2015-19 వరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ.
*1999 మినహా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో గెలవలేదు. దీంతో ఆయనకు మంత్రిగా అవకాశం దక్కలేదు.
*మంచి సబ్జెక్టు, వాగ్ధాటితో కీలక నేతగా గుర్తింపు
* 2004, 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం
* ఉమ్మడి APలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా, సెకండరీ ఎడ్యుకేషన్ మంత్రిగా విధులు
* 2014లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి
* 2019 వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు
* 2024లో టీడీపీ నుంచి పోటీ.. అసెంబ్లీకి నాలుగోసారి ఎన్నిక
ఏపీ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. కూటమిలో బీజేపీ నుంచి మంత్రి పదవి పొందిన ఏకైక ఎమ్మెల్యే సత్య. ధర్మవరం నుంచి కేతిరెడ్డిపై గెలుపొందిన ఈయనకు ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలున్నాయి.
జమ్మూకశ్మీర్‌లోని రియాసి ఘటన మరువక ముందే మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కతువా జిల్లాలోని సార్తాల్ ప్రాంతంలోని పోలీస్ చెక్ పాయింట్ వద్ద ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోగా సైనిక బలగాల ఎదురుకాల్పుల్లో ఓ మిలిటెంట్ హతమయ్యాడు. మరోవైపు దోడా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. 72 గంటల వ్యవధిలో మూడు ఉగ్రదాడులు జరిగాయి.
AP: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మధుర క్షణాలను ఆయన భార్య అన్నా లెజినోవా తన సెల్‌ఫోన్‌లో బంధించారు. ఆమె ఓ వైపు ఫొటోలు తీస్తూనే.. మరోవైపు తన భర్త గెలుపును ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
AP: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన కుమారుడు అకీరా నందన్, ఆద్య మెరిశారు. అకీరా పంచెకట్టులో అచ్చతెలుగు కుర్రాడిలా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైనట్లు తెలుస్తోంది.
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ USAతో మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓ మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. పేలవ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తున్న ఆల్‌రౌండర్ శివమ్ దూబేను జట్టు నుంచి తప్పించాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు టాక్. కాగా T20 WCకు ఎంపికైనప్పటి నుంచి దూబే ఫామ్ కోల్పోయి పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు.
AP: బీజేపీ తరఫున సత్యకుమార్ యాదవ్‌కు రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం దక్కింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఈయన కాలేజీ రోజుల్లో ఏబీవీపీ నాయకుడు. కొంతకాలం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి పర్సనల్ సెక్రటరీగా ఉన్నారు. 2018లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం అండమాన్ నికోబార్ ఇన్‌ఛార్జ్, యూపీ సహ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
Sorry, no posts matched your criteria.