India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై తమకు నమ్మకం ఉందని కేంద్రం తరఫున వాదిస్తున్న తుషార్ మెహతా అన్నారు. అయితే విచారణపై కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సిట్ సభ్యులపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని తెలిపారు. సుప్రీం ఏం చెబుతుందో వేచి చూడాలి.
AP: తనను యూట్యూబర్ హర్షసాయి మోసం చేశాడని ఫిర్యాదు చేసిన యువతి మరోసారి నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. హర్షసాయి తనపై సోషల్ మీడియాలో కావాలని ట్రోలింగ్ చేయిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను పోలీసులకు సమర్పించారు. ట్రోలింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఇప్పటికే హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైంది. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పురుషాధిక్యం, లింగ సమానత్వానికి సంబంధించిన కథాంశంతో శ్రీవిష్ణు హీరోగా ‘స్వాగ్’ మూవీ రూపొందింది. రాజరాజ చోర ఫేమ్ హసిత్ గోలీ తెరకెక్కించిన ఈ సినిమాలో కామెడీ సీక్వెన్స్ బాగున్నాయి. 4 విభిన్న పాత్రల్లో హీరో యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. రీతూవర్మ, మీరాజాస్మిన్, సునీల్ తమ పరిధి మేరకు బాగా నటించారు. గందరగోళంగా ఉన్న ఫస్టాఫ్, క్లైమాక్స్, స్క్రీన్‌ప్లే మైనస్.
*రేటింగ్: 2.25/5
పాకిస్థాన్ క్రికెట్ తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. బంగ్లా చేతిలో ఓటమి, కెప్టెన్సీ నుంచి బాబర్ వైదొలగడం, బోర్డులో మార్పులతో గందరగోళం కొనసాగుతోంది. 4 నెలలుగా ఉమెన్స్, మెన్స్ ప్లేయర్లకూ జీతాలు అందడం లేదనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 25 మంది సెంట్రల్ కాంట్రాక్ట్ 2026 వరకు ఉండగా, త్వరలోనే సమీక్షించనున్నట్లు సమాచారం. జెర్సీలపై లోగో స్పాన్సర్‌షిప్ పేమెంట్లూ రావట్లేదని తెలుస్తోంది.
TG: 563 గ్రూప్-1 ఉద్యోగాలకు జూన్‌లో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షల కీపై అభ్యంతరాలు స్వీకరించామని TGPSC హైకోర్టుకు తెలిపింది. 7వేలకు పైగా అభ్యంతరాలను నిపుణుల కమిటీకి పంపామని, వారు ఆమోదించిన తర్వాతే ఫలితాలు విడుదల చేస్తామని నివేదించింది. 2022లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా కొత్తది విడుదల చేయడం చెల్లదని, కీపై అభ్యంతరాలను పట్టించుకోవట్లేదని పలువురు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
AP: దసరా ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై రెండవ రోజు గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి దుర్గమ్మ దర్శనార్థం భక్తులు తరలివస్తున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి రోజు బాలాత్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.
వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్యమంత్రివన్నీ డొల్లమాటలేనని కేటీఆర్ విమర్శించారు. ‘20 లక్షల మందికి రుణమాఫీ కాలేదన్న వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం బండారం మరోసారి బట్టబయలైంది. ఓవైపు DEC 9న ఏకకాలంలో చేస్తామని దగా. మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మోసం. అనధికారికంగా ఇంకా రుణమాఫీ కాని రైతులెందరో? సీజన్ ముగిసినా రైతుబంధు ఇవ్వలేదు. రాబందుల ప్రభుత్వంతో రైతులకేం లాభం’అని ట్వీట్ చేశారు.
మంత్రి సురేఖను వదిలేది లేదని నటుడు అఖిల్ వార్నింగ్ ఇచ్చారు. ‘కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధారం, హాస్యాస్పదం, అసభ్యకరం, జుగుప్సాకరం. సామాజిక విలువలు, సంక్షేమాన్ని మరచిపోవాలని నిర్ణయించుకుంది. ఆమె ప్రవర్తన సిగ్గుచేటు, క్షమించరానిది. అమాయకులపై సిగ్గు లేకుండా దాడి చేసి బలిపశువులను చేసింది. బాధిత కుటుంబ సభ్యుడిగా నేను మౌనంగా ఉండను. ఈ సమాజంలో అలాంటి వాళ్లకు స్థానం లేదు’ అని అఖిల్ ట్వీట్ చేశారు.
స్టాక్ మార్కెట్లు రేంజుబౌండ్లో ట్రేడవుతున్నాయి. నిన్నటి క్రాష్‌తో పోలిస్తే నేడు మోస్తరు నష్టాల్లోనే సూచీలు ఆరంభమయ్యాయి. విలువైన షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. BSE సెన్సెక్స్ 82,479 (-17), NSE నిఫ్టీ 25,237 (-12) వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీలో 24 కంపెనీలు లాభాల్లో, 25 నష్టాల్లో ఉన్నాయి. మారుతీ, ONGC, టైటాన్, SBI లైఫ్, BEL టాప్ గెయినర్స్.
TG: ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ‘అలయ్ బలయ్’ నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వహణ కమిటీ ఛైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. CMలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డితోపాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రమంత్రులు, అన్ని పార్టీల నేతలను ఆహ్వానించినట్లు ఆమె చెప్పారు. హరియాణా గవర్నర్ దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.