India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రంలోని గనుల్లో కనీసం 6 బ్లాకులకు ఈ నెలాఖరులోగా వేలం నిర్వహించాలని కేంద్ర గనుల శాఖ రాష్ట్ర సర్కారుకు ఓ లేఖలో తేల్చిచెప్పింది. గడచిన తొమ్మిదేళ్లలో ఒక్క గనిని కూడా వేలం వేయలేదని తెలిపింది. ఒకవేళ ఈ ప్రక్రియలో రాష్ట్రం విఫలమైతే తామే వేలం చేపడతామని తేల్చిచెప్పింది. 2015లో మినరల్ బ్లాకుల వేలం ప్రక్రియ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా 354 మేజర్ మినరల్ బ్లాకులను వేలం వేశారు.
భారత ఎన్నికల సంఘం మరికాసేపట్లో ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ కొద్దిరోజులుగా పలు పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ సైతం ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉందంటూ ట్వీట్ చేశారు. ఈ అంశంపై ప్రెస్‌మీట్‌లో ఈసీ వివరణ ఇచ్చే అవకాశం ఉంది.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కాసేపట్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, ములుగు, కొత్తగూడెం, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ప్రకటించింది.
AP: ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆయన ఈరోజు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల ఆశీస్సులతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి శ్రీకారం చుడతానని హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని చెప్పారు.
TG: మెదక్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. నిందితులపై కఠినంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. అమాయకులపై కేసులు పెట్టొద్దంటూ బండి హెచ్చరించినట్లు సమాచారం. మెదక్‌లో గోవధకు ప్రయత్నం జరుగుతోందన్న ప్రచారంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే.
రీజినల్ రూరల్ బ్యాంకుల్లో 9,995 ఉద్యోగాల భర్తీకి IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-A ఆఫీసర్స్(స్కేల్-1,2&3), గ్రూప్ ‘B’ ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్) పోస్టులకు ఈ నెల 27 వరకు దరఖాస్తు చేయవచ్చు. ఏదైనా డిగ్రీ పూర్తైన వారు అర్హులు. ఆగస్టులో ప్రిలిమ్స్, సెప్టెంబర్/అక్టోబర్‌లో మెయిన్స్ నిర్వహిస్తారు. APలో 450, TGలో 700 పోస్టులున్నాయి. ఫీజు- PwBD, ఎస్సీ, ఎస్టీలు రూ.175, ఇతరులు రూ.850 చెల్లించాలి.
TG: మన దేశంలో పొలిటికల్ సక్సెస్‌కి నీరు, విద్యుత్, రోడ్లు, ఉద్యోగాలు, నిత్యావసర వస్తువుల ధరలు వంటి సమస్యలను పరిష్కరించగల సామర్థ్యానికి సంబంధం లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్వీట్ చేశారు. ‘కల్పిత సమస్యల సాకుతో ఎన్నికల్లో గెలిచిన పార్టీలు ఈ సమస్యలను ఎలా పరిష్కరించగలవు?’ అని ప్రశ్నించారు. ఢిల్లీలో నెలకొన్న తీవ్ర నీటి సమస్యను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తనను టార్చర్ చేయడం ఆపాలని సినీ నటి రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో పవన్ అభిమాని రేణూను ట్యాగ్ చేస్తూ ‘వదినగారూ దేవుడిని పెళ్లి చేసుకుని, ఆయన అంతరంగం తెలీకుండా వెళ్లిపోయారు. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టుంటే బాగుండేది’ అని కామెంట్ చేశారు. దీనికి ఆమె రిప్లై ఇస్తూ ‘పవన్‌ను నేను వదిలేయలేదు. ఆయనే నన్ను వదిలేసి మరో పెళ్లి చేసుకున్నారు’ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.
హైదరాబాద్‌లోని YS జగన్ ఇంటి ముందు నిర్మాణం కూల్చివేత ఘటనలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్‌పై వేటు పడింది. ఆయనను GAD(సాధారణ పరిపాలన విభాగం)కి అటాచ్ చేస్తూ GHMC ఇన్‌ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలిచ్చారు. అధికారులకు సమాచారం ఇవ్వకుండా జగన్ ఇంటి ముందు షెడ్లను కూల్చివేసినందుకు హేమంత్‌పై చర్యలు తీసుకున్నారు.
ఢిల్లీలో నీటి సరఫరా వ్యవస్థను ధ్వంసం చేసేందుకు దుండగులు యత్నిస్తున్నారని ఆప్ ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేసింది. నగరంలోని ప్రధాన పైపులైన్లలో చాలా చోట్ల బోల్టులు తొలగించి ఉన్నట్లు గుర్తించామని మంత్రి అతిశీ తెలిపారు. దీంతో లీకేజీలు ఏర్పడుతున్నాయన్నారు. ఈ క్రమంలో పైపులైన్ల వద్ద గస్తీ ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్‌ను కోరారు. కాగా యమునా నదికి ప్రవాహం తగ్గడంతో ఢిల్లీలో నీటి సంక్షోభం తలెత్తింది.
Sorry, no posts matched your criteria.