India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ ఫామ్ లేమికి కారణం ఇప్పటి వరకు ఆడిన పేలవమైన పిచ్‌లేనని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘విరాట్ సహా ఆ పిచ్‌లపై ఆడిన ఏ బ్యాటర్‌నూ తప్పుపట్టలేం. వాటిపై ఆడటం కష్టంగా కనిపించింది. అలాంటి పరిస్థితుల్లో కోహ్లీ ఫామ్‌ను అంచనా వేయకూడదు. తన నుంచి పరుగుల్ని ఆశిస్తాం కరెక్టే కానీ పరిస్థితుల్నీ చూడాలి కదా. సూపర్-8లో కోహ్లీ ఫామ్ అందుకుంటారు’ అని పేర్కొన్నారు.
TG: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై నుంచి వస్తున్న ఆయనను హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్ అల్లర్ల దృష్ట్యా రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు. రేపు మెదక్ వెళ్తానని ఆయన ఇప్పటికే ప్రకటించడంతో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
TG: హైదరాబాద్ సీసీఎస్(సైబర్ క్రైమ్ స్టేషన్) ప్రక్షాళన దిశగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. 12 మంది సీఐలు, నలుగురు ఎస్సైలపై బదిలీ వేటు వేశారు. ఇటీవల ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఇన్స్పెక్టర్ సుధాకర్ ఏసీబీకి పట్టుబడటం సహా పలు ఆరోపణలతో 14 మంది ఇన్స్పెక్టర్లను మల్టీజోన్ 2కు బదిలీ చేశారు.
TG: గురుకులాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1, గ్రేడ్-2, వెల్ఫేర్ అండ్ లేడీ సూపరింటెండెంట్ సహా పలు ఉద్యోగాల పరీక్ష తేదీలను TGPSC ఖరారు చేసింది. జూన్ 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. పరీక్షల షెడ్యూల్‌ను పైనున్న ఫొటోల్లో చూడవచ్చు. CBRT విధానంలో పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు 3 రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లు పొందవచ్చు.
ఓవర్ ప్రొటెక్టివ్ డాడీ (ఎప్పుడూ మీ వెంటే ఉండేవారు), ది కూల్ డాడీ (ఏం జరిగినా ఓ నవ్వు నవ్వేవారు), ఎమోషనల్ డాడీ (ముఖ్యమైన ఈవెంట్లలో ఏడ్చేవారు), ఫ్యాషన్ డాడీ (అస్సలు డ్రెస్ సెన్స్ లేనివారు), హ్యాపీ డాడీ (ఇంట్లో అన్ని పనులు చేసేవారు), డిజాస్టర్ డాడీ (తన కోసం కూడా వంట చేసుకోలేని వారు), యాక్సిడెంటల్ డాడీ (మీకు సహాయం చేయాలని ఉన్నా ప్రమాదానికి గురై మంచంలో ఉన్నవారు). మీ ఫాదర్ ఎలాంటి వారో కామెంట్ చేయండి.
ఒకప్పుడు నాన్నంటే మందలింపులు, దండనలు ఉండేవి. కానీ ఇప్పుడు ఓ స్నేహితుడిగా మారాడు. అన్ని విషయాల్లో దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు. ఒకప్పుడు నాన్న ఇంట్లో లేకపోతే అల్లరి. కానీ ఇప్పుడు నాన్న ఇంట్లో ఉంటేనే అల్లరి, లేదంటే నిశ్శబ్దమే. ప్రస్తుతం ప్రపంచంలో 7 రకాల నాన్నలు ఉన్నట్లు ఓ పరిశోధనలో తేలింది.
AP: అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇవాళ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ వీటి ఏర్పాటుపై సమీక్షించారు. ‘3 వారాల్లో 100 క్యాంటీన్లు తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వీటి నిర్వహణ మళ్లీ ఇస్కాన్‌కు ఇవ్వాలా? టెండర్లు పిలవాలా? అనే దానిపై అధ్యయనం చేస్తున్నాం. పేదలు, రోజువారీ కూలీల ఆకలి తీరుస్తాం. గతంలో 4 కోట్ల 60 లక్షల ప్లేట్ల ఆహారం అందించాం’ అని ఆయన వెల్లడించారు.
AP: మాజీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్(AAG) పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని మంగళగిరి పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. జగన్‌ను చంపేస్తే ఏంటని చంద్రబాబు అన్నట్లుగా పొన్నవోలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నేతలు తెలిపారు.
AP: 2019కి ముందు పోలవరంలో 72% పనులు జరిగితే 2019-24 మధ్య 4 శాతమే జరిగాయని ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. ‘2019కి ముందు రూ.11,537కోట్లు ఖర్చు చేస్తే 2019-24 మధ్య రూ.5వేల కోట్లు ఖర్చు చేశారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. కాఫర్ డ్యాం, గ్యాప్-1 ప్రధాన డ్యాంలో ఇబ్బందులు వచ్చాయి. గైడ్‌బండ్ కుంగిపోయింది. కొత్తగా ఎలాంటి DPR ఆమోదం పొందలేదు. నిర్వాసితులకు పునరావాస కేంద్రాలు కూడా నిర్మించలేదు’ అని వివరించింది.
టీ20 WCలో విరాట్ కోహ్లీ ఫామ్‌పై ఆందోళన అవసరం లేదని టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నారు. ‘కోహ్లీ బాగా రాణిస్తున్నారా లేదా అని ప్రతిసారి ప్రశ్నలు తలెత్తుతాయి. ఆయన పరుగులు చేయాలనే ఆకలితో ఉండటం మంచిదే. సూపర్-8 మ్యాచుల్లో కోహ్లీ అగ్రెసివ్నెస్ జట్టుకు సహాయపడుతుంది. నెట్స్‌లో ఆయన బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. రన్స్ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.