News March 28, 2024

50 ఏళ్ల వయసులో తండ్రైన CM

image

పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్‌ 50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రయ్యారు. అతడి భార్య డా.గురుప్రీత్ కౌర్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాగా మాన్‌కు గతంలో ఇందర్ ప్రీత్ కౌర్ అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. తర్వాత 2022లో సీఎం మాన్ రెండో పెళ్లి చేసుకున్నారు.

News March 28, 2024

సీజేఐను కలిసిన సీఎం రేవంత్

image

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్‌‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో ఫలక్‌నుమాలో వీరి భేటీ జరిగింది. వారి మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయన్నది తెలియాల్సి ఉంది.

News March 28, 2024

‘హార్దిక్ చెత్త కెప్టెన్’.. తాను అనలేదన్న మాజీ క్రికెటర్

image

‘ఐపీఎల్ హిస్టరీలోనే హార్దిక్ పాండ్య చెత్త కెప్టెన్’ అని తాను అన్నట్లు ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించారు. ‘వైరల్ కావడానికి ఏమైనా చేస్తారా? అబద్ధాలు ప్రచారం చేయొద్దు బ్రదర్. స్టేట్‌మెంట్ తప్పు.. నా పేరులోని స్పెల్లింగూ తప్పే. నీ సమస్య ఏంటి?’ అని రిప్లై ఇచ్చారు. హార్దిక్ కెప్టెన్సీని వదులుకోవాలని, లేదంటే MI తొలగించాలని చోప్రా చెప్పినట్లు సదరు వ్యక్తి రాసుకొచ్చాడు.

News March 28, 2024

భూమి వేగం తగ్గుతోంది.. మన టైమూ మారుతుంది

image

గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రత పెరిగి ధ్రువాల్లో మంచు కరుగుతోంది. దీంతో ద్రవ్యరాశి తగ్గి భూగమన వేగం నెమ్మదిస్తోందని ఓ అధ్యయనంలో తేలింది. దీనివల్ల 2029కి మన టైమ్ ఒక సెకన్ తగ్గిపోనుందని పేర్కొంది. దీన్ని ‘నెగెటివ్ లీప్ సెకన్’గా పిలుస్తారని వెల్లడించింది. ఇది కంప్యూటర్ నెట్‌వర్క్‌లో సమస్యను కలిగిస్తుందని, UTC(కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్)లో ముందుగానే మార్పులు చేయాల్సి ఉందని తెలిపింది.

News March 28, 2024

హీరో సిద్ధార్థ్ పెళ్లిలో బిగ్‌ ట్విస్ట్‌!

image

హీరో సిద్ధార్థ్, అతిథి రావు హైదరి పెళ్లిలో బిగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని వనపర్తి శ్రీరంగపురం టెంపుల్‌లో వీరి వివాహం జరిగినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆలయంలోని పూజారులకు ముందుగా సినిమా షూటింగ్ అని చెప్పారట. తర్వాత పెళ్లి డెకరేషన్ చేసి తమిళనాడు పూజారుల సమక్షంలో మూడు ముళ్లతో ఒక్కటైనట్లు సమాచారం. అయితే వారి పెళ్లిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News March 28, 2024

భారత్‌పై ఆరోపణల్ని కొట్టిపారేయలేం: ట్రూడో

image

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా ప్రధాని ట్రుడో మరోసారి భారత్‌పై నోరుపారేసుకున్నారు. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందన్న ఆరోపణల్ని తేలిగ్గా కొట్టిపారేయలేమని వ్యాఖ్యానించారు. విదేశీ ప్రభుత్వాల చట్టవిరుద్ధమైన చర్యల నుంచి కెనడా పౌరుల్ని కాపాడుకోవడం తమ బాధ్యతన్నారు. కేసు దర్యాప్తులో భారత్‌తో కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

News March 28, 2024

అప్పుడు బెంగళూరుకు.. ఇప్పుడు హైదరాబాద్‌కు

image

పేస్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించారు. ఈ మెగా టోర్నీ చరిత్రలో అత్యధిక స్కోర్లు సాధించిన జట్లలో అతడు భాగస్వామిగా ఉన్నారు. 2013లో ఆర్సీబీ 263 రన్స్ చేయగా అప్పుడు అతడు బెంగళూరు తరఫున ఆడారు. నిన్నటి మ్యాచ్‌లో 277 పరుగులతో ఆర్సీబీ రికార్డును బద్దలు కొట్టిన SRHకు ఉనద్కత్ ప్రాతినిధ్యం వహించారు. ఈ రెండు మ్యాచుల్లోనూ జయదేవ్ ఉనద్కత్ రెండేసి వికెట్లు తీయడం విశేషం.

News March 28, 2024

చిన్నవాడినైనా ఎన్నో పనులు చేశా: CM జగన్

image

తాను వయసులో చిన్నవాడినైనా రాష్ట్రం కోసం పని చేశానని CM జగన్ అన్నారు. బస్సు యాత్ర చేస్తున్న CM.. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ‘నా కంటే ముందు 75 ఏళ్ల ముసలాయన CMగా చేశారు. ఇంత చిన్నోడు చేసిన పనులను 14 ఏళ్ల అనుభవం చేయగలిగిందా? పార్టీలకు అతీతంగా పథకాలు అందిస్తున్నాం. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. స్కూళ్లు బాగుపడ్డాయి, వైద్య రంగం బాగుపడింది’ అని జగన్ అన్నారు.

News March 28, 2024

స్టాక్ మార్కెట్ జోరు.. 800 పాయింట్ల ఎగువకు సెన్సెక్స్

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు జోరు కనబరుస్తున్నాయి. సెన్సెక్స్ గరిష్ఠంగా 830 పాయింట్లు తాకి 73,826కు చేరింది. మరోవైపు నిఫ్టీ 246 పాయింట్ల లాభంతో 22,370కు చేరింది. రియల్టీ మినహా ఇతర ప్రధాన రంగాలన్నీ 0.5-1శాతం లాభాలతో ట్రేడవడం మార్కెట్‌కు కలిసొచ్చింది. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, హీరోమోటోకార్ప్, JSWస్టీల్ షేర్లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి.

News March 28, 2024

జర్మనీ తగ్గింది.. అమెరికా తగ్గనంటోంది!

image

ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్‌ను పారదర్శకంగా విచారిస్తారని ఆశిస్తున్నామంటూ జర్మనీ, అమెరికాలు కామెంట్ చేసి కేంద్రం నుంచి విమర్శలు ఎదుర్కొన్నాయి. ఇప్పటికే ఇరు దేశాల దౌత్యవేత్తలను పిలిచి కేంద్రం నిలదీసింది. దీంతో జర్మనీ వెనక్కి తగ్గింది. భారత రాజ్యాంగంపై తమకు నమ్మకం ఉందని పేర్కొంది. అయితే US మాత్రం గతంలో చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంది. ఈ కేసు విచారణను సమగ్రంగా పరిశీలిస్తామని మరోసారి కామెంట్ చేసింది.