India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల వ్యవహారంపై ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. ఇకపై వారి సిఫారసు లేఖలను అనుమతిస్తామని తెలిపారు. ప్రతివారం(సోమవారం నుంచి గురువారం) ఏదైనా రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం, ప్రత్యేక దర్శనం కోసం రెండు లేఖలను అంగీకరిస్తామని పేర్కొన్నారు.

శ్రీహరికోటలోని షార్ నుంచి ఇస్రో ఇవాళ రాత్రి 10 గంటలకు <<15018046>>PSLV-C60<<>> ద్వారా ‘స్పేడెక్స్ మిషన్’ను నింగిలోకి పంపనుంది. స్పేడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ప్రయోగం. ఉపగ్రహాల్ని డాకింగ్, అన్ డాకింగ్ చేసేందుకు అవసరమైన టెక్నాలజీని డెవలప్ చేయడం, ప్రదర్శించడం దీని లక్ష్యాలు. అంతరిక్షంలో రెండు వ్యోమనౌకలను పక్కపక్కన చేర్చి లింక్ చేయడాన్ని స్పేస్ డాకింగ్ అని, లింకై ఉన్న వాటిని వేరు చేయడాన్ని అన్ డాకింగ్ అని అంటారు.

గంభీర్ కోచింగ్‌లో IND టెస్టుల్లో ఘోరంగా విఫలమవుతోంది. స్వదేశంలో BANపై 2-0 తేడాతో సిరీస్ గెలిచినా ఆ తర్వాత NZ చేతిలో 3-0 తేడాతో ఓడింది. ప్రస్తుతం BGTలో 2-1 తేడాతో వెనుకబడింది. WTC ఫైనల్‌కు వెళ్లే అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. దీంతో T20, ODIలకు గంభీర్‌ను కొనసాగిస్తూ టెస్టులకు స్పెషలిస్ట్ కోచ్‌ను నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై మీరేమంటారు?

సౌత్ కొరియా BTS pop బ్యాండ్ అంటే కొందరు అమ్మాయిలు పిచ్చెక్కిపోతారు. MH ధారావికి చెందిన ముగ్గురు మైనర్ బాలికలు BTS బాయ్స్‌ను కలిసేందుకు ఏకంగా కిడ్నాప్ నాటకం ఆడారు. కిడ్నాప్ అయినట్లు ఓ మహిళతో పోలీసులకు ఫేక్ కాల్ చేయించి దొరికేశారు. తాము పుణేకు వెళ్లి డబ్బు సంపాదించి కొరియాకు వెళ్లేందుకు ప్లాన్ చేశామని విచారణలో వెల్లడించారు. ముగ్గురు బాలికలను (11- 13 ఏళ్లు) పోలీసులు వారి ఫ్యామిలీలకు అప్పగించారు.

CRPF నూతన డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ వితుల్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీ అనీశ్ దయాల్ రేపు పదవీ విరమణ చేయనుండగా ఆ వెంటనే వితుల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన 1993 బ్యాచ్ యూపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ స్పెషల్ డీజీగా పనిచేస్తున్నారు.

AP: మంగళగిరి వైసీపీ నేత గంజి చిరంజీవి జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. గత ఎన్నికలకు ముందు ఈయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ (కైకలూరు) సైతం జనసేన తీర్థం పుచ్చుకున్నారు.

AP: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో ప్రధాన నిందితుడు గౌతమ్ తేజ్‌ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. పలమనేరులో అతడిని అదుపులోకి తీసుకుని చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. గౌతమ్‌కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. జులై 21న జరిగిన అగ్నిప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందని పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

దశాబ్ద కాలంలో డిఫెన్స్ ఎగుమతులు ₹2 వేల కోట్ల నుంచి ₹21 వేల కోట్లకు పెరిగాయని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆర్మీ వార్ కాలేజీలో ఆయన మాట్లాడుతూ 2029 నాటికి ₹50 వేల కోట్ల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. AI, సైబర్, స్పేస్ ఆధారిత సవాళ్లు అధికమవుతున్న నేపథ్యంలో సైన్యం వీటిని ఎదుర్కొనేందుకు సన్నద్ధమై ఉండాలన్నారు. మహూలో శిక్షణ కేంద్రాల పనితీరును రాజ్‌నాథ్ అభినందించారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు బులెటిన్ రిలీజ్ చేశారు. రెండు రోజులుగా మినిమల్ వెంటిలేటర్ సపోర్ట్‌తో వైద్యం అందిస్తున్నామని తెలిపారు. న్యూరోలాజికల్ స్టేటస్‌లో పెద్దగా మార్పు లేదన్నారు. ఎడమవైపు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గిందని, పైప్ ద్వారానే ఆహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడికి జ్వరం లేదని వివరించారు.

లద్దాక్‌లోని పాంగాంగ్ సరస్సు ఒడ్డున ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుపై తమ అభిప్రాయాలను పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ నిర్ణయం స్థానికుల్ని అసంతృప్తికి గురి చేసిందని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రత్యేక వాతావరణం-వైల్డ్‌లైఫ్‌కి విగ్రహ ఏర్పాటుకు ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడి ప్రజల్ని, ప్రకృతికిని గౌరవించే ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.