India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: విశాఖపట్నం కేంద్రంగా రూ.10 కోట్ల పెట్టుబడితో ఏడాదిలోగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మోగ్లిక్స్ సేవలు ప్రారంభించనుంది. పారిశ్రామిక సంస్థలు, MSMEలకు అవసరమైన ఉత్పత్తులను కంపెనీ సరఫరా చేయనుంది. ఇప్పటికే HYD, నోయిడాలో రెండు టెక్నాలజీ హబ్‌లు నిర్వహిస్తున్న ఈ సంస్థకు MSMEలో 5 లక్షల మంది, 700 భారీ సంస్థలు క్లయింట్లుగా ఉన్నాయి. ప్రధానంగా ఆటోమొబైల్, ఫార్మా, MSME విభాగంలో సంస్థకు క్లయింట్‌లు ఉన్నాయి.
TG: రూ.5,048.1 కోట్ల సహకార రుణాలు మాఫీ కానున్నాయని తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు వెల్లడించారు. 823 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని 7.75 లక్షల మంది చిన్న, మధ్య తరగతి రైతులకు చెందిన రుణాలు మాఫీ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామన్నారు. రూ.2లక్షల వరకు రుణాలను ఒకేసారి ప్రభుత్వం మాఫీ చేయడం చరిత్రాత్మకమన్నారు.
ఇరాన్ కొత్త అధ్యక్షుడు ఎవరో ఈనెల 30న తేలనుంది. ఈనెల 28న ఓటింగ్ జరగనుండగా, 30న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అధ్యక్ష పదవి రేసులో ఆరుగురు అభ్యర్థులు నిలిచారు. పార్లమెంట్ స్పీకర్ జనరల్ మహమ్మద్ బఖర్ గలీబాఫ్, మాజీ చీఫ్ న్యూక్లియర్ నెగోషియేటర్ సయీద్ జలిలీ, మతాధికారి ముస్తాఫా పోర్ మొహమ్మదీ, దేశ ఉపాధ్యక్షుడు ఆమిర్ హోసేన్, టెహ్రాన్ మేయర్ అలీ రజా జకానీ, సంస్కరణల వాది మసూద్ పెజెష్కియాన్ పోటీలో ఉన్నారు.
టీ20 WCలో సూపర్-8లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో మ్యాచులో ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టారు. వరుస బంతుల్లో(17.6, 19.1, 19.2) ముగ్గుర్ని ఔట్ చేసి ఈ టోర్నీలో రెండో హ్యాట్రిక్‌ను నమోదు చేశారు. 3 రోజుల క్రితం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ ఆయన హ్యాట్రిక్ తీసిన సంగతి తెలిసిందే. దీంతో టీ20 WC చరిత్రలో రెండు హ్యాట్రిక్స్ తీసిన తొలి బౌలర్‌గా కమిన్స్ రికార్డు సృష్టించారు.
దేశంలో కొత్త టెలికం చట్టం-2023 ఈనెల 26 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో ఏ నెట్‌వర్క్‌నైనా ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకునే అధికారం ఉంటుంది. ప్రజల భద్రత ప్రయోజనాల కోసం టెలికమ్యూనికేషన్ సేవల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలికంగా నియంత్రణలోకి తీసుకోవచ్చు. ప్రభుత్వాల తరఫున నియమితులైన స్పెషల్ ఆఫీసర్లకు కూడా ఈ అధికారం ఉంటుంది.
అనుమానం పెనుభూతమై కన్నతండ్రిని కర్కశుణ్ని చేసింది. అనంతపురం(D) నార్పలకు చెందిన గణేశ్.. భార్యకు వివాహేతర సంబంధముందని, కూతురు పావని(6) తనకు పుట్టలేదని అనుమానించేవాడు. జూన్ 20న పావనిని స్కూల్ నుంచి బయటకు తెచ్చి పాడుబడ్డ బావి వద్దకు తీసుకెళ్లాడు. ఈత నేర్పిస్తాంటూ దూకమన్నాడు. ఆ పాప భయమేస్తోందంటూ గుక్కపట్టి ఏడ్చింది. కనికరం చూపని గణేశ్ పాపను ఎత్తి బావిలో పడేశాడు. పోలీసు విచారణలో నేరాన్ని అంగీకరించాడు.
TG: తాండూరు-జహీరాబాద్ మధ్య 70KM దూరంతో కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. సాధ్యాసాధ్యాలపై రైల్వే శాఖ ఫైనల్ లొకేషన్ సర్వే ప్రారంభించింది. సికింద్రాబాద్-వాడి మార్గంలో ఉన్న తాండూరు, సికింద్రాబాద్-బీదర్ రూట్‌లో ఉన్న జహీరాబాద్ మధ్య రైల్వే లైన్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. వికారాబాద్ మీదుగా ఈ 2 పట్టణాలకు ప్రస్తుతం రైలు మార్గం ఉన్నా, 104KM దూరం ఉండటంతో ఎక్కువ మంది బస్సుల్లోనే వెళ్తున్నారు.
AP: పింఛను పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను MSME, సెర్ప్, NRI వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. పెంచిన పింఛను మొత్తం రూ.4 వేలతో పాటు ఏప్రిల్, మే, జూన్ బకాయిలు రూ.1000 చొప్పున మొత్తం జులై 1న రూ.7వేలు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. నూతన పాసుపుస్తకాలనూ పింఛనుతో పాటు అందించాలన్నారు. ప్రతి జిల్లాలో 10 మహిళా మార్టులు ఏర్పాటు చేయాలన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీపై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో నటించిన నటీనటులు భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ రూ.150 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు టాక్. అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణెలు తలో రూ.20 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. దిశాపటానీ రూ.5 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. రూ.250 కోట్లు రెమ్యునరేషన్లకే ఇచ్చినట్లు టాక్.
AP DGP ద్వారక తిరుమలరావు, పుదుచ్చేరి DGP శ్రీనివాస్ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరూ గుంటూరులోని కృష్ణానగర్ ప్రైమరీ స్కూల్, శ్రీ పాటిబండ్ల శీతారామయ్య హైస్కూల్లో చదువుకున్నారు. HCUలో PG పూర్తి చేశారు. ఆ తర్వాత సివిల్స్ రాసి తిరుమల రావు ఏపీ, శ్రీనివాస్ జమ్మూ కశ్మీర్ కేడర్‌కు వెళ్లారు. వీరిద్దరూ ఒకే సమయంలో రెండు రాష్ట్రాలకు DGPలుగా ఎంపిక కావడంతో వారి మిత్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
Sorry, no posts matched your criteria.