News March 27, 2024

సాంకేతిక లోపంతో నిలిచిన మెట్రో

image

TG: హైదరాబాద్ మెట్రో రైళ్లు కాసేపు నిలిచిపోయాయి. సాంకేతిక లోపంతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్లో ఆగాయి. దీంతో 15 నిమిషాల పాటు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకొని రంగంలోకి దిగిన టెక్నికల్ సిబ్బంది సమస్యను పరిష్కరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 27, 2024

భారీగా స్కాలర్షిప్స్‌ పెండింగ్.. RTIలో వెల్లడి!

image

TG: ఇంటర్, డిగ్రీ విద్యార్థులు స్కాలర్షిప్స్ అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ద్వారా 2020 నుంచి నిలిచిపోయిన స్కాలర్షిప్స్ వివరాలు తెలపాలని ఓ RTI కార్యకర్త కోరారు. దీనిపై సంబంధిత శాఖ స్పందించింది. వివిధ కారణాలతో భారీ సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించింది. 2020-21లో రూ. 96 లక్షలు, 2021-22లో రూ.1.9కోట్లు, 2022-23లో రూ.17.52 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపింది.

News March 27, 2024

మళ్లీ కెప్టెన్‌గా బాబర్!

image

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్‌లో జరగనున్న T20WCకు అతడి నాయకత్వంలోనే పాక్ బరిలోకి దిగనున్నట్లు వార్తలొస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్-2023లో పాక్ పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ గతేడాది NOV 15న బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో బాబర్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని PCB నిర్ణయించుకున్నట్లు సమాచారం.

News March 27, 2024

పాపులేషన్ ఎఫెక్ట్.. బేబీ డైపర్స్ ఉత్పత్తిని ఆపేసిన జపాన్ సంస్థ

image

జపాన్‌లో జనాభా రేటు ఆందోళనకర స్థాయిలో పడిపోతుందనడానికి ఓ డైపర్ల కంపెనీ పరిస్థితి ఉదాహరణగా నిలుస్తోంది. డిమాండ్ తగ్గడంతో ఇకపై పిల్లల డైపర్ల తయారీని నిలిపివేస్తున్నామని ఆ స్థానంలో అడల్ట్ డైపర్ల ఉత్పత్తి పెంచనున్నట్లు ఓజీ హోల్డింగ్స్ సంస్థ ప్రకటించింది. గత పదేళ్లలో అడల్ట్ డైపర్లకు డిమాండ్ పెరగడం గమనార్హం. కాగా ప్రస్తుతం 125 మిలియన్లుగా ఉన్న జపాన్ జనాభా 2065కి 88 మిలియన్లకు క్షీణిస్తుందని అంచనా.

News March 27, 2024

‘వివేకం’ సినిమాపై ఈసీ కీలక ఆదేశాలు

image

AP: రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన ‘వివేకం’ సినిమా ప్రదర్శనపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మూవీ స్ట్రీమింగ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కాగా ఈ మూవీ హింసను ప్రేరేపించేదిగా, ప్రజలను రెచ్చగొట్టేదిగా ఉందని ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. దీంతో ఈసీ చర్యలకు దిగింది.

News March 27, 2024

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. లోక్‌సభ అభ్యర్థుల తుది జాబితాపై ఆయన కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలు జరపనున్నారు. ఇవాళ జరగనున్న సీఈసీ భేటీలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో దీపాదాస్ మున్షీ, భట్టి, ఉత్తమ్ సహా కీలక నేతలతో సీఎం సమావేశం నిర్వహించి, అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఇప్పటివరకు 9మంది అభ్యర్థులను ప్రకటించింది.

News March 27, 2024

సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్.. హరీశ్ రావు క్యాంప్ ఆఫీస్ ఉద్యోగి అరెస్ట్!

image

మాజీ మంత్రి హరీశ్ రావు క్యాంప్ ఆఫీసులో పనిచేసే నరేష్‌తో పాటు మరో ముగ్గురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గోల్ మాల్ కేసులో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వీరిపై 417, 419, 420, 120b r/w 34IPC, 66(B), 66(C) ITA 2000-2008 కింద కేసులు నమోదు చేశారు.

News March 27, 2024

వర్షపాతంపై బీఆర్ఎస్ రాజకీయం: మంత్రి పొన్నం

image

TG: వర్షపాతంపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు. BRS హయాంలోనే వర్షాకాలం పూర్తయిందని అన్నారు. కాంగ్రెస్ వచ్చాక కరువు వచ్చిందని హరీశ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 27, 2024

IPL: SRHకు బ్యాడ్‌న్యూస్

image

సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక స్పిన్నర్ వనిందు హసరంగా ఇప్పట్లో జట్టులో చేరేలా కనిపించడంలేదు. మడమ నొప్పి కారణంగా తొలి మ్యాచుకు అందుబాటులో లేకుండాపోయిన అతడు.. ఇవాళ ముంబైతో జరగనున్న మ్యాచుకూ దూరం కానున్నారు. వైద్యుల ధ్రువీకరణ తర్వాతే హసరంగా మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. అందుకు మరో వారం పట్టనుంది. అయితే మడమ నొప్పి తగ్గకపోతే అతడు టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉంది.

News March 27, 2024

గుజరాత్ మోడల్ అంటే అదేనా?: కేటీఆర్

image

TG: గుజరాత్ మోడల్ అంటే హిందూ, ముస్లిం మధ్య గొడవలు తీసుకొస్తారా అని సీఎం రేవంత్‌ను బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రశ్నించారు. ‘రేవంత్.. నువ్వు కాంగ్రెస్ మనిషివా? బీజేపీ మనిషివా? గుజరాత్ మోడల్ ఫేక్ అని రాహుల్ అంటారు. రేవంత్ ఏమో సూపర్బ్ అని అంటారు. లిక్కర్ స్కామ్ లేదని రాహుల్ అంటే, ఉందని సీఎం అంటారు. రాబోయే ఎన్నికల్లో ఒక్క ఓటు రేవంత్‌కు వేసినా అది బీజేపీకే లాభం’ అని అన్నారు.