News June 24, 2024

Xలో కిరణ్vsజైరామ్ మాటల యుద్ధం

image

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, కాంగ్రెస్ MP జైరామ్ రమేశ్ మధ్య Xలో మాటల యుద్ధం నడుస్తోంది. 18వ లోక్‌సభకు స్వాగతిస్తూ రిజిజు ట్వీట్ చేయగా ‘మాటల కంటే చేతలు గట్టిగా మాట్లాడుతాయి. ఆచరణలో చూపండి’ అని రమేశ్ స్పందించారు. ‘కచ్చితంగా. మీరు తెలివైనవారు. మీరు సహకరించాలి’ అని రిజిజు బదులిచ్చారు. దానికి ‘మీరు నాకిచ్చిన సర్టిఫికెట్ NTA గ్రేడింగ్‌లా ఉండదని ఆశిస్తున్నా’ అని జైరామ్ అన్నారు.

News June 24, 2024

క్వాంట్ మ్యూచువల్‌ ఫండ్‌లో అవకతవకలు?

image

క్వాంట్ మ్యూచువల్ ఫండ్‌లో ఫ్రంట్ రన్నింగ్ జరిగినట్లు సెబీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై, HYDలోని ఆ సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. డీలర్లు, సంబంధిత వ్యక్తులను ప్రశ్నించినట్లు సమాచారం. సెబీ ఎంక్వైరీ చేసినట్లు సంస్థ సైతం ఇన్వెస్టర్లకు మెయిల్స్ ద్వారా తెలిపింది. మ్యూచువల్ ఫండ్ల కొనుగోళ్లు/విక్రయాల గురించి ముందస్తుగా తెలుసుకుని స్టాక్స్ క్రయవిక్రయాలు చేయడాన్ని ఫ్రంట్ రన్నింగ్ అని అంటారు.

News June 24, 2024

మంత్రిగా లోకేశ్.. తొలి సంతకం దీనిపైనే..

image

AP: విద్య, ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్ మెగా డీఎస్సీ విధివిధానాలపై తొలి సంతకం చేశారు. ఆ ఫైల్‌ను కేబినెట్‌కు పంపారు. మంత్రివర్గంలో డీఎస్సీపై చర్చించి, విధివిధానాలపై నిర్ణయం తీసుకోనున్నారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ లోపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది.

News June 24, 2024

గనులు-భూగర్భ, ఎక్సైజ్ శాఖలో త్వరలో కొత్త పాలసీలు: మంత్రి కొల్లు

image

ఏపీలో గనులు-భూగర్భ శాఖ, ఎక్సైజ్ శాఖలో త్వరలో కొత్త పాలసీలను తీసుకొస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇవాళ ఈ రెండు శాఖల మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదను గత ప్రభుత్వంలోని నాయకులు సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించారు. ఎక్సైజ్ శాఖను భ్రష్టు పట్టించారని విమర్శించారు. గత ఐదేళ్లలో జరిగిన అక్రమాలను బయటకు తీసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News June 24, 2024

విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలి: PM మోదీ

image

విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని 18వ లోక్‌సభ తొలిరోజు సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సభ్యులందరినీ కలుపుకొని ‘2047 వికసిత్ భారత్’ లక్ష్యం దిశగా సాగుతామని, ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు విపక్షాలూ సహకరించాలని కోరారు. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక మచ్చ అని, అటువంటి పొరపాటు పునరావృతం కాకూడదని ఆయన అన్నారు. రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

News June 24, 2024

తెలంగాణ అసెంబ్లీలో పెరిగిన కాంగ్రెస్ బలం

image

TG: ఐదుగురు BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రస్తుతం హస్తం పార్టీ బలం 70కి చేరింది. తెల్లం వెంకటరావు (భద్రాచలం), దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), సంజయ్ (జగిత్యాల) పార్టీ మారారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64, BRS 39 సీట్లు సాధించాయి. ఇటీవల కంటోన్మెంట్ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ గెలవడంతో దాని బలం 70కి పెరిగింది.

News June 24, 2024

ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. లోక్‌సభలో ఎంపీల ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరు కానున్నారు. అనంతరం కాంగ్రెస్ పెద్దలను కలిసి కేబినెట్, నామినేటెడ్ పోస్టులు, టీపీసీసీ చీఫ్ వంటి పలు అంశాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తారు. ఈనెల 27తో టీపీసీసీ చీఫ్‌గా ఆయన పదవీకాలం ముగియనుంది.

News June 24, 2024

ప్రొటెం స్పీకర్‌ వివాదం ఏంటి?

image

NDA ప్రభుత్వం లోక్‌సభకు స్పీకర్‌‌ ప్రొటెం స్పీకర్‌‌గా భర్తృహరిని నియమించడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తప్పుబడుతోంది. సాధారణంగా ఎక్కువసార్లు సభకు ప్రాతినిధ్యం వహించిన సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌‌‌గా ఎన్నుకుంటారు. అయితే భర్తృహరి ఏడుసార్లు MPగా గెలవగా కాంగ్రెస్ నుంచి కొడికున్నిల్ సురేశ్ 8వసారి MP అయ్యారు. ఈ కారణంగానే NDA ప్రభుత్వం సభా సంస్కృతిని పాటించడం లేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది.

News June 24, 2024

విండీస్‌కు షాక్.. సెమీస్‌కు సౌతాఫ్రికా

image

T20WC సూపర్8 మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా గెలిచింది. DLS పద్ధతిలో 17 ఓవర్లలో టార్గెట్ 123 రన్స్ చేయాల్సి ఉండగా 16.1ఓవర్లలోనే ఛేదించింది. దీంతో 6 పాయింట్లతో సెమీస్‌కు చేరింది. రెండు గ్రూపుల నుంచి రెండేసీ జట్లు సెమీస్ చేరే అవకాశం ఉండటంతో గ్రూప్2 నుంచి నిన్న ఇంగ్లండ్(4), తాజాగా సౌతాఫ్రికా సెమీస్‌లో బెర్తు ఖరారు చేసుకున్నాయి. వెస్టిండీస్(2), USA(0) ఇంటిముఖం పట్టాయి.

News June 24, 2024

అన్ని ఫోన్లకు ఒకే టైప్ ఛార్జర్.. 2025 జూన్ వరకు గడువు

image

అన్ని కంపెనీల ఫోన్లకు ఒకే టైప్ ఛార్జర్ ఉండాలనే నిబంధనను కేంద్రం తీసుకురానుంది. టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ మాత్రమే ఉండేలా కొత్త మార్గదర్శకాలు అమల్లోకి తేనుంది. దీనికి 2025 జూన్ వరకు గడువు విధించింది. ఇకపై కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను సీ టైప్ ఛార్జింగ్ పోర్టు ఉండేలా తయారు చేయాలంది. ఇప్పటికే యురోపియన్ యూనియన్‌లో ఈ రూల్ అమలవుతోంది. 2026 చివరి నుంచి ల్యాప్‌టాప్‌లకూ ఈ నిబంధనను అమలు చేయనున్నట్లు సమాచారం.