India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వైసీపీ శవ రాజకీయాలు చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. మాజీ సీఎం జగన్ తన ఇంటి గేటు దగ్గర సిబ్బందికే రూ.12 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా అమలు చేస్తున్నాం. అయినా కొన్ని నేరాలు జరుగుతుండటంతో బాధగా ఉంది. శిక్షలు అమలు చేసేందుకు ప్రత్యేక కోర్టులు కావాలి. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకుంటాం’ అని ఆమె హెచ్చరించారు.
UP <<14535006>>మదర్సా<<>> చట్టానికి అనుకూలంగా తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ఒక విషయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫాజిల్, కామిల్ కింద డిగ్రీలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఇవి UG నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తాయని వెల్లడించింది. మైనారిటీ స్టూడెంట్స్ బయటకెళ్లి గౌరవంగా బతికేలా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపింది. ఈ చట్టాన్ని 2004లో ములాయం సింగ్ యాదవ్ తెచ్చారు.
AP: Dy.CM పవన్ వ్యాఖ్యలపై తాను కామెంట్ చేయనని DGP ద్వారక తిరుమలరావు అన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో తాము పనిచేయమని స్పష్టం చేశారు. రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నామని, ఏ కేసునైనా వాస్తవ పరిస్థితుల ఆధారంగానే విచారిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగాయని, వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పోలీసులు ఉద్యోగ ధర్మం మరుస్తున్నారని నిన్న <<14527392>>పవన్<<>> వ్యాఖ్యానించారు.
ప్రైవేటు ఆస్తి ప్రజా వనరు కాదన్న సుప్రీంకోర్టు <<14535099>>తీర్పు<<>>లో కొన్ని అంశాలపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో జస్టిస్ బీవీ నాగరత్న విబేధించారు. 1978లో జస్టిస్ కృష్ణ అయ్యర్ సోషలిస్ట్ ఫిలాసఫీ ఇప్పటికి సరికాదని, వారి మైనారిటీ వ్యూ పరిగణనలోకి తీసుకోలేమని చంద్రచూడ్ అన్నారు. అప్పటి ప్రభుత్వ పాలసీల ఆధారంగా ఇచ్చిన గత జడ్జిల వైఖరిని ఇప్పుడు సరికాదన్న అభిప్రాయంతో తాను ఏకీభవించడం లేదని జస్టిస్ నాగరత్న తెలిపారు.
TG: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పత్తిలో తేమ శాతం 8-12 మధ్య ఉండేలా చూసుకోవాలన్నారు. కొనుగోళ్లకు సంబంధించిన సమాచారం కోసం వాట్సాప్ నంబర్ 8897281111ను సంప్రదించాలని చెప్పారు. పత్తి కొనుగోళ్లపై సమీక్షించిన ఆయన, నోటిఫై చేసిన ప్రతి జిన్నింగ్ మిల్లు పనిచేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
గాలి, నీరు, బొగ్గు, సూర్యరశ్మి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమే ఇప్పటివరకు చూశాం. అయితే, స్వీడన్‌లోని చాల్మర్స్ వర్సిటీ నిపుణులు సిల్క్ థ్రెడ్‌తో చేసిన వస్త్రాలతో కరెంట్ తయారుచేసే పద్ధతి కనుగొన్నారు. కండక్టివ్ ప్లాస్టిక్ మెటీరియల్ పూత ఉన్న సిల్క్ థ్రెడ్‌తో చేసిన దుస్తులు శరీరంలోని వేడిని గ్రహించి విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. ఇలా వచ్చిన విద్యుత్‌ను USB ద్వారా పోర్టబుల్ పరికరాలను ఛార్జ్ చేయొచ్చు.
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్ శైలిపై అంపైర్లు ఐసీసీకి ఫిర్యాదు చేశారు. కౌంటీల్లో సర్రే తరఫున ఆడుతున్న షకీబ్ బౌలింగ్‌పై అంపైర్లు అనుమానం వ్యక్తం చేశారు. కాగా దాదాపు 13 ఏళ్ల తర్వాత షకీబ్ కౌంటీల్లో రీఎంట్రీ ఇచ్చారు. సోమర్‌సెట్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆయన 9 వికెట్లు తీశారు.
ప్రతి ప్రైవేటు ఆస్తి ప్రజా వనరుల కిందకు రాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రైవేటు ఆస్తులు ప్రజా వనరుల కిందకే వస్తాయని, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజలకు మేలు చేయొచ్చని 1978లో జస్టిస్ కృష్ణ అయ్యర్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు చెల్లదని వివరించింది. 1960 నాటి సోషలిస్ట్ ఎకానమీ 1990ల్లో మార్కెట్ ఆధారిత ఎకానమీగా మారిందని పేర్కొంది. పాత ఫిలాసఫీ ఇప్పుడు పనికిరాదని తీర్పునిచ్చింది.
సరిగ్గా మరో నెల రోజుల్లో ‘పుష్ప-2’ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్ ఎదురుపడిన పోస్టర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ‘బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ రాబోతోంది. సిద్ధంగా ఉండండి’ అని పేర్కొంది. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేస్తామని తెలిపింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
AP: వైసీపీకి మరో షాక్ తగిలింది. కుప్పం మున్సిపల్ ఛైర్మన్ సుధీర్ టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా అంతకుముందు ఆయన వైసీపీకి, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. కాగా గత ఎన్నికల్లో కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 25 వార్డులకు గానూ వైసీపీ 19, టీడీపీ 6 చోట్ల గెలిచాయి.
Sorry, no posts matched your criteria.