India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న శ్రీవారిని 84,950 మంది భక్తులు దర్శించుకోగా, 21,098 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.8 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

TG ప్రభుత్వం నూతన ఏడాదిలో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. జనవరిలో రైతు భరోసా అమలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటికి సంబంధించి త్వరలోనే క్యాబినెట్ భేటీ నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగ నోటిఫికేషన్లపైనా ప్రకటన చేసే అవకాశముంది. దీంతో పాటు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

మండల పూజ అనంతరం DEC 26న మూసివేసిన శబరిమల ఆలయం నేడు తిరిగి తెరుచుకోనుంది. సాయంత్రం 4 గంటలకు సంప్రదాయ పూజలు నిర్వహించిన తర్వాత స్వామి దర్శనం కల్పించనున్నారు. సంక్రాంతి సందర్భంగా ఏటా జనవరి 14న భక్తులు మకర జ్యోతిని దర్శించుకుంటారు. నవంబర్ 15న ప్రారంభమైన మండల పూజల్లో డిసెంబర్ 26 వరకు దాదాపు 32 లక్షల మందికి పైగా దర్శించుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం తెలిపింది.

SBIలో 14,344 జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. JAN 7 చివరి తేది. తొలుత 13,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా, 609 బ్యాక్‌లాగ్ జాబ్‌లనూ యాడ్ చేశారు. డిగ్రీ పూర్తైన 20-28 ఏళ్లలోపు వారు అర్హులు. SC, ST, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు. మిగతా వారు రూ.750 చెల్లించాలి. FEBలో ప్రిలిమ్స్, మార్చి/ఏప్రిల్‌లో మెయిన్స్ నిర్వహిస్తారు. వివరాలకు <

MCGలో భారత్ vs ఆసీస్ మ్యాచ్‌ను 5రోజుల్లో 3,50,534 మంది వీక్షించి రికార్డ్ సృష్టించారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఓ టెస్ట్ మ్యాచుకు ఇంతమంది రావడం ఇదే తొలిసారి. 1936/37లో ఆసీస్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ అటెండెన్స్‌ను 4వ టెస్ట్ దాటేసిందని MCG ప్రకటించింది. T20 మేనియాలో టెస్ట్ క్రికెట్ అంతరించిపోతుందన్న వాదన నిజం కాదని, ఈ మ్యాచ్ నిరూపించిందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం పోలీస్ లోగోలో మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త లోగోను TG పోలీస్ ట్వీట్ చేసింది. గతంలో తెలంగాణ స్టేట్ పోలీస్ అని ఉండగా ఇప్పుడు తెలంగాణ పోలీస్ అని మార్చింది. లోగో నుంచి స్టేట్ అనే పదాన్ని తొలగించింది. అంతకుముందు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పలు ప్రభుత్వ శాఖలకు ముందు TS స్థానంలో TGగా మార్చిన సంగతి తెలిసిందే.

AP: విశాఖ సెంట్రల్ జైలు వివాదంలో 66మందిపై బదిలీ వేటు పడింది. అధికారులు ఖైదీల ఎదుట తమను దుస్తులు విప్పించి చెక్ చేశారంటూ కుటుంబీకులతో కలిసి జైలు ఎదుట వార్డర్స్, హెడ్ వార్డర్స్ ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు చర్యలకు దిగారు. 37మంది వార్డర్స్‌తో కలిపి మొత్తం 66మందిని బదిలీ చేశారు. కాగా.. తాము ఖైదీల ముందు దుస్తులు విప్పించామనడంలో నిజం లేదని జైలు అధికారులు వివరణ ఇచ్చారు.

TG: రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీకి ఆన్‌లైన్ అప్లికేషన్లు స్వీకరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీని కోసం ప్రత్యేక వెబ్‌సైట్ లేదా యాప్ తీసుకురానున్నట్లు సమాచారం. కేవలం సాగుభూములకే సాయం అందేలా ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేయనుంది. వీటి గుర్తింపునకు శాటిలైట్, ఫీల్డ్ సర్వే చేయనుంది. ఎన్ని ఎకరాల లోపు ఇవ్వాలనే విషయమై భట్టి అధ్యక్షతన సబ్ కమిటీ సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది.

AP: కుంభమేళాకు రైళ్లను మళ్లించడంతో పలు సర్వీసులను మార్చి 1 వరకు రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. తిరుపతి- కదరిదేవరపల్లి ప్యాసింజర్, గుంతకల్- తిరుపతి ప్యాసింజర్, తిరుపతి- హుబ్లీ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌పెస్‌లను 2 నెలలు నిలిపేశారు. వీటితో పాటు తిరుపతి- కడప మీదుగా ధర్మవరం మార్గంలో నడిచే 6 రైళ్లను రద్దు చేశారని, రైల్వే బోర్డు ప్రత్యామ్నాయం చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

TG: దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించేందుకు రాష్ట్ర శాసనసభ ఈరోజు ప్రత్యేకంగా సమావేశమవనుంది. ఉదయం పదింటికి సభ ప్రారంభం కాగానే సీఎం రేవంత్ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో మన్మోహన్ కృషిని సభ్యులు గుర్తుచేసుకోనున్నారు. కాగా.. మన్మోహన్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చే అవకాశం ఉందా అన్నది ఆసక్తికరంగా మారింది.
Sorry, no posts matched your criteria.