News November 5, 2024

చనిపోయినా కళ్లు చెదిరే సంపాదన!

image

లైసెన్స్, స్ట్రీమింగ్ హక్కులు, సేల్స్, ఇతర రూపాల్లో మరణానంతరం రూ.వేల కోట్లు ఆర్జిస్తున్న ప్రముఖ సెలబ్రిటీల వివరాలను ఫోర్బ్స్ విడుదల చేసింది.
మైకేల్ జాక్సన్(2009 మరణం): 600మి.డాలర్లు, ఫ్రెడ్డీ మెర్క్యురీ(1991):250మి. డా, స్యూస్(1991): 75 మి.డా, ఎల్విస్ ప్రెస్లీ(1977): 50 మి.డా,
రిక్ ఒకాసెక్(2019): 45 మి.డా, ప్రిన్స్(2016):35 మి.డా, బాబ్ మార్లే(1981): 34 మి.డా, చార్లెస్ షుల్జ్(2000): 30 మి.డాలర్లు.

News November 5, 2024

బాలికపై అత్యాచారం అంటూ వార్తలు.. స్పందించిన పోలీసులు

image

AP: తిరుపతి జిల్లా యర్రావారిపాలెంలో ఓ బాలికపై అత్యాచారం జరిగిందన్న ప్రచారంపై పోలీసులు స్పందించారు. ఫిర్యాదుపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని తెలిపారు. విచారణ పూర్తికాక ముందే కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. కాగా ఈ ఘటనపై వైసీపీ మండిపడింది. ‘ఇంకెంత మంది ఆడబిడ్డలు మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి బలవ్వాలి చంద్రబాబు, అనిత, పవన్ కళ్యాణ్, లోకేశ్?’ అని ట్వీట్ చేసింది.

News November 5, 2024

షూటింగ్‌లో హీరో విజయ్‌కు గాయం

image

షూటింగ్‌లో హీరో విజయ్ దేవరకొండ గాయపడ్డారు. తన కొత్త సినిమా ‘VD 12’ షూట్‌లో భాగంగా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఆయనకు గాయమైంది. వెంటనే చిత్ర బృందం ఆస్పత్రికి తరలించి ఫిజియోథెరపీ చేయించారు. అనంతరం విజయ్ షూటింగ్‌లో పాల్గొన్నారు.

News November 5, 2024

SBI కస్టమర్లు జాగ్రత్త!

image

స్కామర్లు ఎస్బీఐ కస్టమర్లకు మోసపూరిత సందేశాలను పంపుతున్నారని PIB తెలిపింది. SBI రివార్డును రీడీమ్ చేసుకోవడానికి యాప్ డౌన్‌లోడ్ చేయమని APK ఫైల్స్ పంపుతున్నారని పేర్కొంది. అలాంటి లింకులపై క్లిక్ చేయడం, యాప్స్ డౌన్‌లోడ్ చేయడం వంటివి చేయొద్దని హెచ్చరించింది. ఇలాంటి మోసాలకు చాలా మంది బలైపోయారని, జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది.
SHARE IT

News November 5, 2024

యురేనియం అంశాన్ని CM దృష్టికి తీసుకెళ్తాం: నిమ్మల

image

AP: కర్నూలు(D) కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలపై కొనసాగుతున్న ఆందోళనలను CM చంద్రబాబు దృష్టికి తీసుకెళతామని ఇన్‌ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కూటమి నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. త్వరలో జరగబోయే సాగునీటి సంఘాల ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు నిమ్మల పిలుపునిచ్చారు.

News November 5, 2024

లారెన్స్ బిష్ణోయ్ ఫొటోలతో టీషర్ట్‌లు.. విమర్శలు!

image

ఈకామర్స్ వెబ్‌సైట్ మీషోలో గ్యాంగ్‌స్టర్ల ఫొటోలతో టీషర్టులు అమ్మడం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన లారెన్స్ బిష్ణోయ్ ఫొటోలతో ఉన్న టీషర్టులను మీషోలో విక్రయించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. మరో గ్యాంగ్‌స్టర్ దుర్లభ్ కశ్యప్ ఫొటోలతోనూ టీషర్టులు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటితో యువతలో నేరపూరిత ఆలోచనలు పుట్టుకొస్తాయని అంటున్నారు.

News November 4, 2024

DANGER: డైలీ ఎంత ఉప్పు తింటున్నారు?

image

ఉప్పుతో ఆహారానికి రుచి. అందుకే చాలామంది తినాల్సిన దానికంటే అధికంగా ఉప్పు తింటున్నారు. అయితే ఉప్పు ఎక్కువ లేక తక్కువ తిన్నా ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏటా దాదాపు 20లక్షల మరణాలకు ఉప్పు కారణమవుతోందంటున్నారు. ఒక వ్యక్తి రోజుకు 5గ్రా.లు లేదా టీస్పూన్ ఉప్పు వాడాలని WHO చెబుతోంది. కానీ చాలామంది 11గ్రాములు తీసుకుంటున్నారు. అందుకే కొన్ని దేశాలు ఉప్పు వాడకం తగ్గించడంపై ఫోకస్ పెట్టాయి.

News November 4, 2024

పంచాయతీ కార్యదర్శులు స్థానికంగానే నివాసం ఉండాలి: మంత్రి

image

TG: గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్థానికంగానే నివాసం ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. పనిలో నిర్లక్ష్యం వహించే వారిపై వేటు వేయాలని అధికారులకు సూచించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

News November 4, 2024

రేపు సరస్వతి పవర్ భూములను పరిశీలించనున్న పవన్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు పల్నాడులో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మాచవరం మండలంలోని సరస్వతి పవర్ భూములు పరిశీలించనున్నట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది. సరస్వతి శక్తికి సంబంధించిన భూ ఉల్లంఘనలను తనిఖీ చేస్తానని పవన్ కళ్యాణ్ సైతం వెల్లడించారు. కాగా సరస్వతి భూముల విషయంలో వైసీపీ అధినేత జగన్, షర్మిల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.

News November 4, 2024

స్టిక్క‌ర్ స్కాం.. అమెజాన్‌కు ₹1.29 కోట్లు టోక‌రా పెట్టిన యువ‌కులు

image

రాజ‌స్థాన్‌కు చెందిన రాజ్‌కుమార్‌, సుభాశ్‌ అమెజాన్‌కు ₹1.29Cr టోక‌రా పెట్టి మంగళూరులో దొరికిపోయారు. వీరు అమెజాన్‌లో త‌క్కువ ధర, లక్షలు విలువైన ఐటమ్స్ ఒకేసారి ఆర్డర్ పెట్టేవారు. ఆర్డర్ వచ్చాక డెలివరీ బాయ్‌ కళ్లుగప్పి లక్షల విలువైన వస్తువుల స్టిక్కర్లను తక్కువ విలువైన వాటి స్టిక్కర్లతో మార్చేవారు. తీరా హైవాల్యూ ఐటం క్యాన్సిల్ చేసేవారు. తద్వారా లక్షల విలువైన వస్తువులను తక్కువ ధరకే కొట్టేసేవారు.