News March 24, 2024

EVMలను సీతతో పోల్చిన కమల్‌హాసన్‌

image

ఎన్నికల్లో EVMల వినియోగంపై MNM అధినేత, నటుడు కమల్‌హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘EVMను నిందించలేం. ప్రమాదం జరిగితే డ్రైవర్‌దే తప్పు కానీ.. కారుది కాదు. రాముడు కూడా సీతకు అగ్నిపరీక్ష పెట్టాడు కదా? కాబట్టి మనం ఈ EVMలను టెస్ట్ చేయాలి. నేను ఎవరినీ ఎగతాళి చేయడం లేదు’ అని అన్నారు. కాగా ఎన్నికల్లో EVMల వినియోగంపై కొందరు ప్రతిపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

News March 24, 2024

IPL: మ్యాచ్‌ను నిలిపివేసిన స్పైడర్ క్యామ్

image

రాజస్థాన్ రాయల్స్, లక్నో మధ్య జరుగుతున్న మ్యాచును స్పైడర్ క్యామ్ నిలిపివేసింది. గ్రౌండ్ మధ్యలో పైనుంచి విజువల్స్ తీసే కెమెరా వైర్ తెగిపోయింది. ఆ వైర్ గ్రౌండ్‌లో పడిపోవడంతో తొలి ఓవర్ 2వ బంతి వద్ద మ్యాచ్ ఆగిపోయింది. కొద్దిసేపటి తర్వాత గ్రౌండ్ సిబ్బంది మ్యాచ్ జరిగేలా ఏర్పాట్లు చేశారు.

News March 24, 2024

కాసేపట్లో మద్యం దుకాణాలు బంద్

image

TG: హోలీ సందర్భంగా హైదరాబాద్‌లో వైన్ షాపులు మూతపడనున్నాయి. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయించినా, ఎవరైనా మద్యం సేవించి గొడవలు సృష్టించినా.. కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. నగరంలో తిరిగే వాహనాలపై కానీ, జనాలపై కానీ రంగులు చల్లకూడదని సూచించారు.

News March 24, 2024

డీఎస్సీ నిర్వహణపై రాని క్లారిటీ

image

AP: 6,100 టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించాల్సిన డీఎస్సీ పరీక్షలపై ఇంకా క్లారిటీ రాలేదు. మార్చి 30 నుంచి షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారా? వాయిదా వేస్తారా? అనే దానిపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో పరీక్షల నిర్వహణపై ఈసీ అనుమతి కోసం ఎదురుచూస్తున్న విద్యాశాఖ.. పరీక్ష కేంద్రాల ఎంపిక, హాల్‌టికెట్ల డౌన్‌లోడ్, టెట్ ఫలితాల వెల్లడిపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

News March 24, 2024

IPL: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

image

లక్నోతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
RR: జైస్వాల్, బట్లర్, శాంసన్(C), పరాగ్, హెట్మేర్, జురేల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్, సందీప్, చాహల్.
LSG: KL.రాహుల్(C), డికాక్, పడిక్కల్, బదోని, స్టోయినిస్, పూరన్, కృనాల్ పాండ్యా, బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, నవీన్ ఉల్ హక్, యశ్ ఠాకూర్.

News March 24, 2024

సాయం కోరిన జనసైనికుడు.. స్పందించిన ప్రభుత్వం

image

AP: చంద్రశేఖర్ అనే జనసైనికుడు అనారోగ్యంతో బాధపడుతున్నారని, చికిత్సకు సాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్ అభిమాని Xలో ట్వీట్ చేశారు. దీనికి సీఎం జగన్ స్పెషల్ సెక్రటరీ, ఆరోగ్యశ్రీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ హరికృష్ణ స్పందించారు. ‘బాధితుడికి వైజాగ్ KGHలో చికిత్స అందిస్తున్నాం. మా టీమ్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడింది. చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చు CMRF కింద చెల్లిస్తాం’ అని పేర్కొన్నారు.

News March 24, 2024

నేను నా తండ్రిని ఒక్కసారే కలిశాను: వీరప్పన్ కూతురు

image

వీరప్పన్‌ను తాను మూడో తరగతి చదువుతున్నప్పుడు కలిశానని అతని కూతురు విద్యారాణి తెలిపారు. ఆయనను కలవడం అదే తొలి, చివరిసారి అని చెప్పారు. మెడిసిన్ చదివి ప్రజలకు సేవ చేయాలని ఆయన తనకు చెప్పారని, ఆ మాటలు ఇంకా తనకు గుర్తున్నాయని పేర్కొన్నారు. తన తండ్రి చెప్పిన మాటలే తాను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. న్యాయవాది అయిన ఆమె కృష్ణగిరిలో ఒక స్కూల్‌ను కూడా నడుపుతున్నారు.

News March 24, 2024

ఘోరం.. మొబైల్ పేలిపోయి నలుగురు చిన్నారుల మృతి

image

యూపీలోని మీరట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొబైల్ ఫోన్ పేలిపోయింది. మంటలు చెలరేగి మంచానికి అంటుకోవడంతో నలుగురు చిన్నారులు సారిక(12), నిహారిక(8), గోలు(6), కల్లు(5) తీవ్ర గాయాలపాలయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తండ్రి జానీ(39) పరిస్థితి విషమంగా ఉండగా, తల్లి బబిత(35)కు 60 శాతం గాయాలయ్యాయి. ఆమెను ఢిల్లీ AIIMSకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

News March 24, 2024

గత 11 ఏళ్లలో ఇదే తొలిసారి

image

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించడంతో రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్‌లో ప్లేయర్‌గా మాత్రమే ఆడనున్నారు. IPLలో కెప్టెన్‌గా కాకుండా ప్లేయర్‌గా అతను ఆడటం గత 11 ఏళ్లలో ఇదే తొలిసారి. 2013లో MI కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న హిట్‌మ్యాన్ 5 ట్రోఫీలు (2013, 2015, 2017, 2019, 2020) అందించారు. ఇప్పుడు హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో ఆడనున్నారు. ఈసారి ఈ పుల్‌షాట్ మాస్టర్ బ్యాట్‌తో ఎలా చెలరేగుతారో చూడాలి.

News March 24, 2024

నేడు ఏపీ బీజేపీ అభ్యర్థుల ప్రకటన

image

ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల్ని ఇవాళ బీజేపీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులపై ఏపీ బీజేపీ చీఫ్ పురందీశ్వరి, సోము వీర్రాజు ఢిల్లీలో అధిష్ఠానం పెద్దలతో చర్చలు జరిపారు. ఎచ్చెర్ల, విజయవాడ వెస్ట్, బద్వేల్, పాడేరు, ధర్మవరం, జమ్మలమడుగు, కైకలూరు, వైజాగ్ నార్త్, ఆదోని లేదా అనంతపురంలో పోటీ చేయాలని నిర్ణయించగా.. అభ్యర్థుల్ని సైతం ప్రకటించనున్నట్లు సమాచారం.