News October 2, 2024

ఈ నెల 10న క్యాబినెట్ భేటీ

image

AP: ఈ నెల 10న అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకీ సంబంధించిన బిల్లును ఆమోదిస్తారని సమాచారం. చెత్త పన్ను రద్దుకు ఆమోదం, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయి ఏర్పాటు, అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

News October 2, 2024

ALERT: కాసేపట్లో భారీ వర్షం

image

TG: రాష్ట్రంలోని నల్గొండ, సూర్యాపేట, జనగామ, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో రానున్న 2 గంటల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సంగారెడ్డి, హన్మకొండ, సిద్దిపేట, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

News October 2, 2024

పార్టీ శ్రేణులకు జగన్ కీలక సూచనలు

image

AP: పార్టీ బాగుంటేనే అందరూ బాగుంటారని YCP చీఫ్ జగన్ అన్నారు. ‘పార్టీ మనందరిదీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేను మీ ప్రతినిధిని మాత్రమే. కష్టపడి పనిచేసి, నష్టపోయినవారికి అండగా ఉంటాం. దేశంలో అత్యంత బలమైన పార్టీగా YCPని తీర్చిదిద్దే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. పార్టీ పిలుపునిస్తే పైస్థాయి నుంచి కిందివరకు అంతా కదలిరావాలి. ప్రజల తరఫున పోరాటాల్లో చురుగ్గా ఉండాలి’ అని సూచించారు.

News October 2, 2024

12 నిమిషాల్లోనే 2,000 కి.మీ: ఇరాన్ స్పెషల్ మిస్సైల్

image

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాదాపు 180 బాలిస్టిక్ క్షిపణులు వదిలింది. ఈ దాడులకు ఇరాన్ షాహబ్-2 మిస్సైళ్లను ఎంచుకున్నట్లు సమాచారం. ఇవి దాదాపు 2,000 కి.మీ దూరాన ఉన్న టార్గెట్‌ను హిట్ చేస్తాయి. ఈ మిస్సైళ్లకు వేగం ఎక్కువగా ఉండటంతో వీటిని అడ్డుకోవడం అతి కష్టం. ఇజ్రాయెల్‌కు చేరుకున్న కొన్ని క్షిపణులను అమెరికా కూడా అడ్డుకోలేకపోయింది. ఇదే కాక 17,000 కి.మీ దూరం ప్రయాణించే సెజిల్ మిస్సైల్ ఇరాన్ అమ్ములపొదిలో ఉంది.

News October 2, 2024

వివాదంపై స్పందించిన త్రిప్తి దిమ్రీ

image

డబ్బు తీసుకొని ఈవెంట్‌కు గైర్హాజరయ్యారంటూ తనపై వస్తున్న <<14249459>>ఆరోపణలపై<<>> బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రీ స్పందించారు. జైపూర్‌లో తాను ఏ ఈవెంట్‌ మిస్ కాలేదని, అసలు తాను డబ్బే తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆమెపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ త్రిప్తి టీమ్ ఈమేరకు ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆమె ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’ మూవీ ప్రమోషన్స్‌ కోసం అన్ని ఈవెంట్లకు హాజరవుతున్నట్లు పేర్కొంది.

News October 2, 2024

మంత్రి కొండా సురేఖకు ప్రకాశ్ రాజ్ కౌంటర్

image

TG: మంత్రి కొండా సురేఖకు నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ‘ఏంటీ సిగ్గులేని రాజకీయాలు? సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే అంత చిన్న చూపా? జస్ట్ ఆస్కింగ్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. సురేఖ మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేశారు. కాగా నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆరే కారణమని సురేఖ ఆరోపించిన విషయం తెలిసిందే. అలాగే చాలామంది హీరోయిన్లకు ఆయన డ్రగ్స్ అలవాటు చేశారని ఆమె వ్యాఖ్యానించారు.

News October 2, 2024

గాజాతో CEASE FIRE ఔట్ ఆఫ్ క్వశ్చన్: డిఫెన్స్ ఎక్స్‌పర్ట్

image

వెస్ట్ ఏషియాలో యుద్ధం బహుముఖంగా మారిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఎక్స్‌పర్ట్ యోసి కుపర్‌వాసర్ అన్నారు. ఈ టైమ్‌లో గాజాతో సీజ్ ఫైర్, టూ స్టేట్ సొల్యూషన్‌పై చర్చలు జరిగే ప్రసక్తే లేదన్నారు. ప్రస్తుతం గాజా, లెబనాన్‌లో నాయకత్వ మార్పు పైనే ఇజ్రాయెల్ దృష్టి సారించిందని తెలిపారు. ఈ వివాదానికి అసలైన పరిష్కారం కోసం ఇరాన్‌ను తిరిగి రియలిస్టిక్ సైజుకు తీసుకురావడం, ఆ ప్రజల లివింగ్ స్టాండర్ట్స్ పెంచాల్సి ఉందన్నారు.

News October 2, 2024

రైల్వేట్రాక్‌ను పేల్చేసిన దుండగులు

image

ఝార్ఖండ్‌లో దుండగులు రెచ్చిపోయారు. సాహిబ్‌గంజ్ జిల్లా రంగాగుట్టు గ్రామం వద్ద రైల్వేట్రాక్‌పై పేలుడు పదార్థాలు అమర్చి పేల్చేశారు. దీంతో ట్రాక్‌పై మూడడుగుల గొయ్యి పడింది. ట్రాక్ పరికరాలు సుమారు 40 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News October 2, 2024

ఇరాన్-ఇజ్రాయెల్ ఒకప్పుడు మిత్రులే!

image

ఇరాన్-ఇజ్రాయెల్ ఒకప్పుడు మిత్ర దేశాలే. ఈ రెండూ కలిసి మరో దేశంపై యుద్ధం కూడా చేశాయి. ఇరాక్‌పై దాదాపు దశాబ్దంపాటు కలిసి పోరాటం చేశాయి. 1958 నుంచి 1990 వరకు ఈ రెండు దేశాలు కవలలుగా కొనసాగాయి. అమెరికా హెచ్చరిస్తున్నా ఇరాన్‌కు రహస్యంగా యుద్ధ విమానాల టైర్లను ఇజ్రాయెల్ సరఫరా చేసింది. కానీ 1990 తర్వాత ఇరాక్ ముప్పు తొలగటం, అరబ్ సోషలిజం రావడం, హెజ్బొల్లా, హమాస్‌తో గొడవల వల్ల బద్ధ శత్రువులుగా మారాయి.

News October 2, 2024

రూ.83వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన

image

ఝార్ఖండ్‌లోని హజరీభాగ్‌లో రూ.83,300కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. కాగా గత 17 రోజుల్లో ప్రధాని మోదీ ఝార్ఖండ్‌ను సందర్శించడం ఇది రెండోసారి. సెప్టెంబర్ 15న జంషెడ్‌పూర్‌లో ఆయన పర్యటించారు. అప్పుడు కూడా రూ.వందల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. PM ఆవాస్ యోజన కింద వేలాది మంది పేదలు పక్కా ఇళ్లు పొందగలిగారని ప్రధాని అన్నారు.