News November 4, 2024

స్మార్ట్ ఇన్సులిన్: షుగర్ బాధితులకు తీపి కబురు

image

మధుమేహ బాధితుల కోసం ‘NNC 2215’ అనే స్మార్ట్ ఇన్సులిన్‌ను UK, డెన్మార్క్ సైంటిస్టులు అభివృద్ధి చేశారు. శరీరంలో హెచ్చుతగ్గులకు లోనయ్యే చక్కెర స్థాయులకు అనుగుణంగా ఇది పనిచేస్తుంది. అంటే ఇంజెక్షన్ చేసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి ఇన్సులిన్ పని మొదలుపెడుతుంది. మనుషులపై పరీక్షలు పూర్తయి మార్కెట్‌లోకి రావడానికి మరింత సమయం పడుతుంది. కాగా ప్రపంచంలోని డయాబెటిస్ రోగుల్లో 17% మనదేశంలోనే ఉన్నారు.

News November 4, 2024

BLOOD BATH: స్టాక్ మార్కెట్లో పొద్దున్నే రూ.3.5లక్షల కోట్ల నష్టం

image

దేశీయ స్టాక్ మార్కెట్లలో బ్లడ్‌బాత్ కొనసాగుతోంది. సెక్టోరియల్ సహా బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందినా ఇన్వెస్టర్లు మాత్రం అమ్మకాలకే మొగ్గుచూపారు. నిఫ్టీ 24,073 (-230), సెన్సెక్స్ 78,996 (-740) వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు పొద్దున్నే రూ.3.5 లక్షల కోట్లు నష్టపోయారు. బజాజ్ ఆటో, సన్ ఫార్మా, హీరోమోటో, BPCL, RIL టాప్ లూజర్స్.

News November 4, 2024

రైతు భరోసా పంపిణీ ఎప్పుడంటే?

image

TG: రైతు భరోసా కింద ఎకరాకు రూ.7,500 పెట్టుబడి సాయం ఈనెలాఖరు నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని కోసం నిధులు సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు CM రేవంత్ ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఒక ఎకరా నుంచి మొదలు పెట్టి డిసెంబర్ చివరిలోగా పంపిణీ పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఎన్ని ఎకరాల వరకు(7.5 లేదా 10) ఇవ్వాలనే దానిపై త్వరలో నిర్ణయించనున్నట్లు సమాచారం.

News November 4, 2024

యాంటీ ఇండియా ఎలిమెంట్స్‌కు కెనడా అనుమతించడం బాధాకరం: భారత్

image

బ్రాంప్టన్ హిందూ సభా మందిరం వద్ద <<14524265>>ఖలిస్థానీ<<>>ల దాడులపై కెనడాలోని భారత హైకమిషన్ స్పందించింది. స్థానికులతో కలిసి చేపట్టే రెగ్యులర్ కాన్సులర్ క్యాంపులకు అవాంతరాలు కలిగించేలా యాంటీ ఇండియా ఎలిమెంట్స్‌కు అనుమతించడం తీవ్ర నిరాశపరిచిందని తెలిపింది. భారతీయులు సహా లైఫ్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసినవారి భద్రతపై ఆందోళన కలుగుతోందని వెల్లడించింది. అయినప్పటికీ 1000 సర్టిఫికెట్లు జారీచేశామని పేర్కొంది.

News November 4, 2024

పుష్ప-2 క్రేజ్ మామూలుగా లేదుగా!

image

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ మూవీ మరో నెల రోజుల్లో థియేటర్లలోకి రానుంది. కేరళలో ఇప్పటికే 50 ఫ్యాన్స్ షోలకు బుకింగ్ స్టార్ట్ అయినట్లు డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించారు. కేరళలో మొత్తం 300కు పైగా ఫ్యాన్స్ షోలు ప్రదర్శించడమే తమ టార్గెట్ అని పేర్కొన్నారు. DEC5న కేరళలో వైల్డెస్ట్ మాస్ ఫెస్టివల్ ప్రారంభం కానుందంటూ Xలో పోస్ట్ చేశారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రష్మిక, ఫహాద్ ఫాజిల్ తదితరులు నటిస్తున్నారు.

News November 4, 2024

టెన్షన్ పెడుతున్న ఇంటర్ పరీక్షలు

image

TG: ఇంటర్ పరీక్షలు అధికారులను, విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏటా అక్టోబర్‌లోనే పరీక్షల ఏర్పాట్లను ప్రారంభించాల్సి ఉండగా, ఇంకా ఎగ్జామ్ డేట్స్ ప్రకటించలేదు. మరోవైపు పలు కాలేజీలకు గుర్తింపూ ఇవ్వలేదు. అటు గెస్ట్ లెక్చరర్లను ఆలస్యంగా తీసుకోవడంతో వార్షిక పరీక్షలు సమీపిస్తున్నా సిలబస్ పూర్తికాలేదని ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు వాపోతున్నారు. పరీక్షలు ఎలా రాయాలని వారు ప్రశ్నిస్తున్నారు.

News November 4, 2024

ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం ఆపేస్తా: కమలా హారిస్

image

అమెరికా ఎన్నికల్లో గెలిస్తే గాజాలో యుద్ధం ముగించేందుకు ప్రయత్నిస్తానని కమలా హారిస్ అన్నారు. పాలస్తీనా ప్రజల హక్కుల్ని కాపాడతానని, బందీలను విడిపించి ఇజ్రాయెల్ రక్షణకు కట్టుబడి ఉంటానని హామీలు ఇచ్చారు. ‘ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుల్లో ప్రజల రక్షణ కోసం దౌత్యపరంగా పనిచేస్తాను. USలో కొత్త నాయకత్వానికి ఇదే సరైన టైమ్. ప్రెసిడెంట్‌గా దానిని అందిస్తాను. మిడిల్‌క్లాస్ బాధలు తీరుస్తాను’ అని పేర్కొన్నారు.

News November 4, 2024

గంభీర్ ముందు కఠిన పరీక్ష

image

గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత జట్టు ఆటతీరు ఆశించినంతగా లేదు. శ్రీలంక, న్యూజిలాండ్ చేతిలో సిరీస్‌లను కోల్పోయింది. దీంతో త్వరలో రానున్న టోర్నీలు గౌతీకి అగ్నిపరీక్షలే. జట్టు ఆటను మెరుగుపర్చడంతో పాటు భారత్‌ను విజయతీరాలకు చేర్చాల్సిన బాధ్యత ఆయనపై చాలా ఉంది. ఈ నెల 22 నుంచి పెర్త్ వేదికగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుండటంతో ఆయన ఎలాంటి టెక్నిక్స్ అమలు చేస్తారనే ఆసక్తి నెలకొంది

News November 4, 2024

ముచ్చుమర్రి బాలిక కుటుంబానికి వైసీపీ రూ.10 లక్షల సాయం

image

AP: నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని వైసీపీ ఆదుకుంది. పార్టీ తరఫున రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించింది. ఆ పార్టీ నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసానిచ్చారు. జులై 7న బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి చంపి ఓ కాలువలో పడేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ చిన్నారి మృతదేహం ఆచూకీ దొరకలేదు. నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు.

News November 4, 2024

నేడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన

image

AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఇవాళ, రేపు పర్యటించనున్నారు. ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న ఆయన అనంతరం గొల్లపల్లిలో మీడియాతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత జనసేన నేతలతో సమీక్ష చేస్తారు. రాత్రికి చేబ్రోలులోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోనున్న పవన్ రేపు కూడా నియోజకవర్గంలో పర్యటిస్తారు.