India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జపాన్ కొత్త PMగా రక్షణ శాఖ మాజీ మంత్రి షిగేరు ఇషిబా(67) మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేశానికి రక్షణను మరింత పటిష్ఠం చేయడమే తన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. దేశ భద్రత అత్యంత బలహీనంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతీయంగా శాంతిస్థాపనకు, చైనాను అడ్డుకునేందుకు మిత్రదేశాలతో మైత్రిని మరింత బలోపేతం చేసుకోనున్నట్లు ప్రకటించారు. 19మంది మంత్రులతో కూడిన ఆయన క్యాబినెట్ ఈరోజు కొలువుదీరింది.
ఈ-కామర్స్ సంస్థలు ప్రకటించిన ఫెస్టివల్ సేల్‌లో కొనుగోళ్లు గత ఏడాది సేల్ ప్రారంభ రోజులతో పోలిస్తే 20% పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఆఫర్‌లు, వెరైటీల కోసం ఎదురుచూస్తారు కాబట్టి ఈ సీజన్ ఉత్తేజకరంగా మారిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఫ్యాషన్, యాక్సెసరీల కొనుగోళ్లు 32% పెరిగాయి. ట్రావెల్ యాక్సెసరీలు, పిల్లల వస్తువులు, వాచ్‌లను అధికంగా కొంటున్నట్టు తేలింది.
సాధారణంగా పాస్‌పోర్టు నీలం రంగులో ఉంటుందన్న సంగతి తెలిసిందే. పౌరులందరికీ ప్రభుత్వం జారీ చేసే పాస్‌పోర్టులు ఈ రంగులో ఉంటాయి. ఇది కాక మరో 3 రంగులున్నాయి. ఒకటి ఆరెంజ్ కలర్ కాగా మిగతావి తెలుపు, మెరూన్ రంగులు. పదోక్లాస్ పూర్తి చేయని వారికి ఆరెంజ్, దౌత్యవేత్తలకు మెరూన్, భారత ప్రభుత్వ పని మీద విదేశాలకు వెళ్లే అధికారులకు తెలుపు రంగులో పాస్‌పోర్టుల్ని కేంద్రం జారీ చేస్తుంది.
ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడికి ఇరాన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం ఉందని అమెరికా తెలిపింది. అదే గనుక జరిగితే టెహ్రాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. నస్రల్లాను హతమార్చిన అనంతరం లెబనాన్‌లో ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్స్ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడి సమాచారంపై ఇజ్రాయెల్ రక్షణాత్మక వ్యూహాలకు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు అమెరికా ప్రకటించింది.
తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలకు సీనియర్ ఐఏఎస్‌లను స్పెషల్ ఆఫీసర్లుగా ప్రభుత్వం నియమించింది. ఆదిలాబాద్- ఇలంబరితి, కరీంనగర్- ఆర్‌వీ కర్ణన్, నల్గొండ- అనిత రామచంద్రన్, నిజామాబాద్- ఎ.శరత్, రంగారెడ్డి- డి.దివ్య, మహబూబ్‌నగర్- రవి, వరంగల్- టి.వి.కృష్ణారెడ్డి, మెదక్-దాసరి హరిచందన, ఖమ్మం- కె.సురేంద్రమోహన్, హైదరాబాద్-ఆమ్రపాలిలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
CM సిద్దరామయ్య భార్య పార్వతికి కేటాయించిన 14 ప్లాట్లను వెనక్కి తీసుకోవడానికి ముడా నిర్ణయించింది. వీటి సేల్ డీడ్‌ను కూడా రద్దు చేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో ED కేసు నమోదు చేశాక భూములు తిరిగిచ్చేస్తున్నట్టు పార్వతి ప్రకటించారు. స్వచ్ఛందగా భూములు తిరిగిస్తే వెనక్కి తీసుకొనే నిబంధనలు ఉన్నాయని ముడా కమిషనర్ తెలిపారు. సొత్తును తిరిగిస్తే దొంగతనం క్షమార్హమా? అని ఇప్పటికే BJP కౌంటర్ ఇచ్చింది.
TG: స్కూళ్లకు దసరా, బతుకమ్మ సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ స్కూళ్లకు సెలవులు ఉంటాయని ప్రకటించింది. అన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు సెలవులు ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
AP: గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డికి ఏసీబీ కోర్టు కస్టడీ విధించింది. ACB అధికారులు ఏడు రోజుల కస్టడీ కోరగా కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. రేపటి నుంచి ఆయనను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో గనుల శాఖలో టెండర్లు, ఇసుక తవ్వకాలకు అనుమతుల్లో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసింది.
జైలర్, లియో, దేవర వంటి బ్లాక్‌బస్టర్లతో ఫిల్మ్ మేకర్స్‌కి అనిరుధ్ రవిచందర్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారారు. తాజాగా నాని-ఓదెల శ్రీకాంత్ కాంబోలో వచ్చే మూవీకి ఆయన సైన్ చేసినట్లు తెలుస్తోంది. మూవీ టీమ్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ‘దసరా’ తర్వాత శ్రీకాంత్, నాని కాంబోలో ఈ మూవీ రెండోది. అటు నానికి ఇంతకుముందు గ్యాంగ్‌లీడర్, జెర్సీతో అనిరుధ్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చారు.
TG: హైడ్రాను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఈ నెల 15వ తేదీకి వాయిదా పడింది. జీవో నం 99పై స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరగా, ప్రభుత్వ వాదనలు వినకుండా స్టే ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. కాగా నిన్న హైడ్రా కూల్చివేతల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.