India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: కొత్త ఏడాది నుంచి నెలకు ఒక జిల్లాలో పర్యటించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని భావిస్తున్నారు. ప్రజా సమస్యలు, స్థితిగతులను నేరుగా ఆయనే తెలుసుకోనున్నారు. త్వరలోనే పర్యటన షెడ్యూల్, ఇతర వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.

సల్మాన్ ఖాన్‌తో తాను ఎప్పుడూ డేటింగ్ చేయలేదని పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా తెలిపారు. ఎక్స్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె ఇలా సమాధానమిచ్చారు. ‘సల్మాన్ నాకు మంచి స్నేహితుడు. నా భర్తకు కూడా ఆయన బెస్ట్ ఫ్రెండ్. మేమెప్పుడూ ఇలాగే ఉంటాం’ అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా వీరిద్దరూ కలిసి చోరీ చోరీ చుప్కే చుప్కే, జాన్ ఈ మన్, హర్ దిల్ జో ప్యార్ కరేగా, దిల్ నే జిసా అప్నా వంటి చిత్రాల్లో నటించారు.

మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. రాహుల్ కామెంట్స్ సిగ్గుచేటని మండిపడింది. ఆయన మరీ దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించింది. అంత్యక్రియలపైనా రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకే చెల్లిందని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ అడిగిన మెమోరియల్ నిర్మాణానికి సమయం ఉందని, దానిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది.

TG: రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులకు కేంద్రం టెండర్లు పిలిచింది. మొత్తంగా 4 భాగాలుగా విభజించి రూ.5,555 కోట్లతో పనులు చేపట్టేందుకు నిర్ణయించింది. ప్యాకేజీ-1 సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్-రెడ్డిపల్లి, ప్యాకేజీ-2 రెడ్డిపల్లి-ఇస్లాంపూర్, ప్యాకేజీ-3 ఇస్లాంపూర్-ప్రజ్ఞాపూర్, ప్యాకేజీ-4 ప్రజ్ఞాపూర్-రాయగిరి వరకు పనులకు టెండర్లు దాఖలు చేయాలని పేర్కొంది.

ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో సెంచరీతో అదరగొట్టిన భారత క్రికెటర్ నితీశ్ రెడ్డిని వైసీపీ అధినేత జగన్ అభినందించారు. ‘మెల్‌బోర్న్‌లో చిన్న వయసులోనే సెంచరీ చేసిన నితీశ్‌కు శుభాకాంక్షలు. 21 ఏళ్లలోనే ఈ ఘనత సాధించడం విశేషం. ప్రపంచస్థాయి జట్టుపై అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఆయన సాధించిన విజయం దేశం మొత్తానికి గర్వకారణం. నితీశ్ మరిన్ని విజయాలు సాధించాలి’ అని జగన్ ఆకాంక్షించారు.

కజకిస్థాన్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటన దురదృష్టకరమని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. అందుకు అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్లామ్ అలియేవ్‌కు క్షమాపణలు చెప్పారు. అజార్ బైజాన్‌లోని బాకు నుంచి రష్యా బయల్దేరిన విమానం కజకిస్థాన్‌లో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 38 మంది మరణించారు. కాగా ఉక్రెయిన్ డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు రష్యా ప్రయోగించిన క్షిపణి ఒకటి విమానాన్ని తాకినట్లు అనుమానిస్తున్నారు.

AP: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలనే డిమాండ్‌తో జనవరి 3న తమ పార్టీ నిర్వహించాల్సిన ధర్నాను వాయిదా వేస్తున్నట్లు వైసీపీ అధిష్ఠానం తెలిపింది. దీనిని అదే నెల 29న నిర్వహించనున్నట్లు పేర్కొంది. జనవరి 3న విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

TG: సంక్రాంతి నుంచి రైతుభరోసా పథకం ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సాగు చేసే భూమికే పెట్టుబడి సాయం చేస్తామన్నారు. ప్రస్తుతం వ్యవసాయ అధికారులు రైతుల పేర్లు నమోదు చేస్తున్నారని తెలిపారు. సర్వే నంబర్ల వారీగా గ్రామాల్లో సాగు వివరాలు సేకరిస్తున్నామన్నారు. రిమోట్ సెన్సింగ్ డాటా ఆధారంగా సాగు విస్తీర్ణం గుర్తించడంపై పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు.

AP: అన్నమయ్య(D) గాలివీడు MPDO కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. నిన్న జవహర్ బాబుపై దాడి ఘటనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులకు భరోసా ఇవ్వాలని ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు పవన్‌ను కోరారు. ఉద్యోగులపై దాడులు చేస్తే తీవ్ర చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.

AP: అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవోపై దాడి కేసులో వైసీపీ నేత సుదర్శన్ రెడ్డికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయనతో పాటు ఇతర నిందితులు భయ్యారెడ్డి, వెంకటరెడ్డికి కూడా రిమాండ్ విధించారు. వీరు ముగ్గురిని కడప సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. పరారీలో ఉన్న మరో 12 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న జవహర్‌బాబును డిప్యూటీ సీఎం పవన్ ఇవాళ పరామర్శించారు.
Sorry, no posts matched your criteria.