News December 28, 2024

నితీశ్ కోసం ప్రభుత్వ ఉద్యోగం వదులుకున్న తండ్రి❤️

image

ఆస్ట్రేలియాపై నితీశ్ సెంచరీ శ్రమ వెనుక ఆయన తండ్రి ముత్యాల రెడ్డి కష్టం ఎంతో ఉంది. విశాఖలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ హిందూస్థాన్ జింక్ లో ఆయన ఉద్యోగం చేసేవారు. ఆ సమయంలోనే ఉదయ్‌పూర్‌కు బదిలీ కాగా నితీశ్ క్రికెటర్ కావాలన్న కల నెరవేరదనే ఆలోచనతో మరో ఐదేళ్ల సర్వీస్ ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వచ్చిన డబ్బులను నితీశ్ కోచింగ్ కు వెచ్చించారు. ఈక్రమంలోనే ఎన్నో ఇబ్బందులు సైతం ఎదుర్కొన్నారు.

News December 28, 2024

ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం: బొత్స

image

AP: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై రూ.15,000 కోట్ల భారం మోపుతోందని YCP నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని సర్కార్ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘ ప్రభుత్వం 7 నెలల్లోనే రూ.74 వేల కోట్ల అప్పు చేసింది. వరల్డ్ బ్యాంక్ నుంచి రూ.15 వేల కోట్లతో కలిపి రూ.లక్ష కోట్ల అప్పు చేసింది. ఎన్నికల హామీలు ఎప్పుడు అమలు చేస్తారు?’ అని ఆయన నిలదీశారు.

News December 28, 2024

BREAKING: 108 సిబ్బందికి అదనంగా రూ.4,000

image

AP: 108, 104 సేవలకు ఇకపై సింగిల్ సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంపిక చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. 190 కొత్త 108 వాహనాలు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. 108 అంబులెన్స్ సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా రూ.4వేలు ఇవ్వాలని సూచించారు. దీంతో పాటు 58 మహాప్రస్థానం వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని, ప్రతి మండలంలో జనఔషధి స్టోర్స్ ఏర్పాటు చేయాలని వైద్య శాఖపై సమీక్షలో వెల్లడించారు.

News December 28, 2024

మన్మోహన్ సింగ్‌కు రుణపడి ఉంటాం: నారా లోకేశ్

image

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. కష్టకాలంలో ఆయన తమ కుటుంబాన్ని ఆదుకున్నారని తెలిపారు. ‘అలిపిరి ఘటన తర్వాత మా పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుకు భద్రత తగ్గించింది. ఈ విషయాన్ని మన్మోహన్ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన విశాల హృదయంతో ఆలోచించి బాబుకు పూర్తి భద్రత కేటాయించాలని ఆదేశించారు’ అని ఆయన గుర్తు చేసుకున్నారు.

News December 28, 2024

తప్పు చేస్తే ఎవరైనా ఒకటే: మంత్రి కొల్లు రవీంద్ర

image

AP: తప్పు చేస్తే ఎవరైనా ఒకటేనని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ఎవరిపైనైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘పేర్ని నాని తప్పు చేయకపోతే నెలరోజులు ఎక్కడికి పారిపోయారు. భార్యను అడ్డుపెట్టుకుని ఆయన రాజకీయాలు చేస్తున్నారు. నాని తప్పు చేయనిది హైకోర్టుకు ఎందుకు వెళ్లారు? ఆయన మేనేజర్ ఎక్కడికి పారిపోయారు’ అని మంత్రి ఫైర్ అయ్యారు.

News December 28, 2024

నితీశ్ సెంచరీ.. ఏడ్చేసిన రవిశాస్త్రి

image

మెల్‌బోర్న్ టెస్టులో టీమ్ ఇండియా క్రికెటర్ నితీశ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. నితీశ్ శతకం బాదగానే కామెంట్రీ బాక్సులో ప్రముఖ కామెంటేటర్ రవి శాస్త్రి భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు కారుస్తూనే ఆయన కామెంట్రీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రవి శాస్త్రిని అభినందిస్తున్నారు. యంగ్ ప్లేయర్లను ఆయన ఎంతో ప్రోత్సహిస్తారని అంటున్నారు.

News December 28, 2024

EMI ఆలస్యమవుతోందా.. ఇలా చేయండి..!

image

కొన్ని సార్లు తీసుకున్న లోన్‌కు EMI కట్టడం ఆలస్యం అవుతుంటుంది. అలాంటి సమయంలో కొన్ని మార్గాలు పాటించాలి. సరైన సమయానికి లోన్ చెల్లించలేకపోతే వెంటనే బ్యాంకుకు తెలపాలి. కస్టమర్ కేర్‌కు కాల్ చేసి మీ పరిస్థితి చెప్పాలి. EMI తగ్గించుకోవడం, చెల్లింపు వ్యవధిని పెంచుకోవాలి. పెనాల్టీ పడితే దానిని మాఫీ చేయమని బ్యాంకును కోరాలి. మరో లోన్ తీసుకుని బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేయాలి. లోన్ సెటిల్‌మెంట్ చేసుకోవచ్చు.

News December 28, 2024

గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా: అభిమాని

image

రామ్ చరణ్ వీరాభిమాని సూసైడ్ లెటర్ రాయడం కలకలం రేపింది. త్వరలో గేమ్ ఛేంజర్ ట్రైలర్ విడుదల చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని అందులో పేర్కొన్నాడు. ‘సినిమాకు ఇంకా 13రోజులే ఉంది. అభిమానుల ఎమోషన్స్‌ను పట్టించుకోవడం లేదు. ఈనెలాఖరు లేదా JAN 1 వరకు రిలీజ్ చేయకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడతాను’ అని రాసుకొచ్చాడు. కాగా దీనిపై స్పందించిన మేకర్స్ ప్రోగ్రామ్స్ ప్లాన్ ప్రకారం జరుగుతాయని చెప్పినట్లు సమాచారం.

News December 28, 2024

నటి కారు బీభత్సం.. ఒకరు మృతి

image

మరాఠి నటి ఊర్మిల కోఠారె ప్రయాణిస్తున్న కారు ముంబైలో బీభత్సం సృష్టించింది. మెట్రో పనులు చేస్తున్న ఇద్దరు కార్మికులపైకి ఆమె కారు దూసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్, నటి ఊర్మిలకు కూడా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు.

News December 28, 2024

రోహిత్ ఓ విఫల కెప్టెన్, బ్యాటర్: MSK ప్రసాద్

image

టీమ్ ఇండియా కెప్టెన్ ఆస్ట్రేలియా పర్యటనలో పూర్తిగా నిరాశపరుస్తున్నారని బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ విమర్శించారు. ఇటు బ్యాటింగ్, అటు కెప్టెన్సీలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ‘రోహిత్ ఆడిన మూడు టెస్టుల్లోనూ పరుగులు రాబట్టలేకపోయారు. ఫామ్‌ లేమితో ఆయన సతమతమవుతున్నారు. మరోవైపు కెప్టెన్సీలోనూ బౌలర్లను ఉపయోగించడంలో అంతగా ఆకట్టుకోవడం లేదు’ అని ఆయన విమర్శించారు.