India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టీమ్ ఇండియా కెప్టెన్ ఆస్ట్రేలియా పర్యటనలో పూర్తిగా నిరాశపరుస్తున్నారని బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ విమర్శించారు. ఇటు బ్యాటింగ్, అటు కెప్టెన్సీలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ‘రోహిత్ ఆడిన మూడు టెస్టుల్లోనూ పరుగులు రాబట్టలేకపోయారు. ఫామ్ లేమితో ఆయన సతమతమవుతున్నారు. మరోవైపు కెప్టెన్సీలోనూ బౌలర్లను ఉపయోగించడంలో అంతగా ఆకట్టుకోవడం లేదు’ అని ఆయన విమర్శించారు.

అయోధ్య పర్యాటక శోభను సంతరించుకోనుంది. ఈ పది రోజుల్లో బాలరాముడిని లక్షలాది భక్తులు దర్శించుకుంటారని అంచనా. 2024 ముగింపు, 2025 ఆరంభాన్ని ఈ దివ్యధామంలో జరుపుకొనేందుకు చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. JAN 15 వరకు అయోధ్య, ఫైజాబాద్‌లో హోటళ్లన్నీ బుక్కయ్యాయి. డిమాండును బట్టి ఒక రాత్రికి రూ.10వేల వరకు ఛార్జ్ చేస్తున్నారు. టెంటులోని రామయ్య భవ్య మందిరంలో అడుగుపెట్టాక వచ్చిన తొలి CY 2025 కావడం విశేషం.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. టెక్నాలజీ చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా హీరోయిన్ సమంత బేబీ బంప్‌తో ఉన్నట్లు ఫొటోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. తొలుత ఇవి చూసి ఆమె ఫ్యాన్స్ షాక్ అయ్యారు. క్షుణ్ణంగా పరిశీలిస్తే AI ఇమేజెస్ అని తేలాయి. దీంతో వీటిని తయారుచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

భారతమాత ముద్దుబిడ్డ, తొలి సిక్కు ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ప్రస్తుత ప్రభుత్వం అవమానించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటివరకు మాజీ ప్రధానులందరి అంత్యక్రియలను అధికారిక శ్మశానవాటికలో నిర్వహించారు. కానీ మన్మోహన్ చివరి కార్యక్రమాలు నిగమ్‌బోధ్ ఘాట్‌లో జరిపి అవమానించారు’ అని మండిపడ్డారు. అలాగే సింగ్‌కు మెమోరియల్ ఏర్పాటు చేసి, ఆయనపై గౌరవాన్ని చాటుకోవాలని సూచించారు.

వలస విధానంపై ట్రంప్ కూటమిలో నిప్పు రాజుకుంది. టాప్ టాలెంట్ ఎక్కడున్నా USకు ఆహ్వానించాలని మస్క్, వివేక్ అంటున్నారు. మెరిట్ ఆధారిత ఇమ్మిగ్రేషన్ అవసరమని, భారత్‌లాంటి దేశాలకు పరిమితి విధించొద్దని సూచిస్తున్నారు. అమెరికన్ల ప్రతిభకేం తక్కువంటున్న ట్రంప్ సపోర్టర్స్ వీసాలపై పరిమితి ఉండాలని వాదిస్తున్నారు. గతంలో ‘INDIA FIRST’ అంటూ ట్వీట్ చేసిన శ్రీరామ్ కృష్ణన్ AI సలహాదారుగా ఎంపికవ్వడంతో రచ్చ మొదలైంది.

TG: హైడ్రా ఛైర్మన్‌గా CM రేవంత్ కొనసాగుతారని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇప్పటివరకు హైడ్రాకు 5,800 ఫిర్యాదులు అందాయని చెప్పారు. ‘హైడ్రా పరిధిలో 8 చెరువులు, 12 పార్కులను కాపాడాం. 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నాం. హైడ్రాతో ప్రజల్లో చైతన్యం పెరిగింది. కొత్తగా ఇల్లు, ఫ్లాట్లు కొనేవారు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం’ అని పేర్కొన్నారు.

భవ్యమందిరంలోకి అయోధ్య బాలరామయ్య అడుగుపెట్టిన వేళావిశేషం ఉత్తర్‌ప్రదేశ్ పర్యాటక రంగానికి కొత్త రెక్కలొచ్చాయి. అతి పవిత్రమైన కాశీ ఇక్కడే ఉంది. ఇక గంగా తీరంలోని శైవ, వైష్ణవ, శాక్తేయ ఆలయాలు ప్రత్యేకం. కాశీ, అయోధ్య కారిడార్ల వల్ల కోట్లాది భక్తులు ఇక్కడికి పోటెత్తుతున్నారు. 2022లో UPని 32.18 కోట్ల మంది సందర్శిస్తే 2024 తొలి ఆర్నెల్లలోనే 33 కోట్ల మంది రావడం విశేషం. దీంతో ఎకానమీకి మేలు జరుగుతోంది.

రాజస్థాన్‌లో ఆరు రోజుల క్రితం బోరుబావిలో పడిన చిన్నారి <<14987957>>చేతనను<<>> తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. NDRF, SDRF, స్థానిక పోలీసులు సంయుక్తంగా మిషన్‌లో పాల్గొంటున్నారు. పైపుతో బోరుబావిలోకి ఆక్సిజన్ పంపిస్తున్నారు. 150 అడుగుల లోతులో చిక్కుకున్న చేతనను క్లిప్పుల సాయంతో 30 అడుగుల పైకి లాగారు. అయితే ఆరు రోజులవుతున్నా ఇంకా చిన్నారిని కాపాడకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మన్మోహన్ స్మారక స్థలం కేటాయింపు అంశంలో BJPపై కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ విమర్శలు కురిపించారు. రాజ్‌ఘాట్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకానికి స్థలం ఇవ్వకపోతే మీ పార్టీ ఎలా ఫీలయ్యేదని ప్రశ్నించారు. ‘మనిషి చనిపోయిన వెంటనే శత్రుత్వాలన్నీ మన్నులో కలిసిపోతాయి. కానీ ఇక్కడా రాజకీయాలు చేస్తున్నారు. అటల్‌జీ విషయంలో ఇలాగే జరిగేతే మీకెలా ఉండేది? ఇది ఓ పార్టీ అంశం కాదు. దేశ చరిత్రది’ అని అన్నారు.

AP: మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించాలని CM చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో నిర్వహించడం తెలుగువారికి గర్వకారణమని పేర్కొన్నారు. ‘తెలుగు జాతి కోసం పొట్టిశ్రీరాములు అద్వితీయ త్యాగం చేశారు. సభల ప్రాంగణానికి ఆయన పేరు పెట్టడం అభినందనీయం. మహాసభలకు విచ్చేసిన అతిథులు, భాషాభిమానులకు ధన్యవాదాలు’ అంటూ Xలో ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.