News March 18, 2024

అమ్మ దగ్గర వాపోయి ఆయన పార్టీ వీడారు: రాహుల్ గాంధీ

image

ముంబైలో భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ ఏజెన్సీల ఒత్తిడికి తట్టుకోలేకే ఓ సీనియర్ నేత కాంగ్రెస్‌ను వీడారన్నారు. ‘సోనియా జీ.. నాకు వీళ్లతో పోరాడే శక్తి లేదు. జైలుకు వెళ్లాలని లేదు అంటూ ఓ సీనియర్ నేత అమ్మ దగ్గర వాపోయారు’ అని రాహుల్ తెలిపారు. ఇటీవల BJPలో చేరిన అశోక్ చవాన్‌ను ఉద్దేశించి రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

News March 18, 2024

కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి: PM మోదీ

image

కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్, BRS కుమ్మక్కయ్యాయని PM మోదీ అన్నారు. ‘BRS ప్రజలను దోచుకుంది. లిక్కర్ స్కామ్‌లోనూ కమీషన్లు తీసుకుంది. ఆ పార్టీ చేసిన అవినీతిపై కాంగ్రెస్ దర్యాప్తు చేయడం లేదు. దేశాన్ని దోచుకునేందుకే కుటుంబ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. తెలంగాణను కాంగ్రెస్ ATMగా మార్చుకుంది. రాష్ట్ర ప్రజల డబ్బు ఇప్పుడు ఢిల్లీ చేరుతోంది. తెలంగాణను దోచుకున్న వారిలో ఎవరినీ వదిలిపెట్టం’ అని పేర్కొన్నారు.

News March 18, 2024

రేవంత్.. తమ ఎమ్మెల్యేలు వెళ్లిపోకుండా చూసుకోవాలి: లక్ష్మణ్

image

TG: దేశంలో ఎక్కడా లేని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అవసరమా అని బీజేపీ నేత కె.లక్ష్మణ్ అన్నారు. ‘పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి మార్గం సుగమం అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేం పడగొట్టం. ప్రభుత్వం పడిపోతే నిలబెట్టలేం. గేట్లు తెరిచానని రేవంత్ అంటున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లిపోకుండా చూసుకోవాలి’ అని జగిత్యాల సభలో వ్యాఖ్యానించారు.

News March 18, 2024

గిల్‌కు మేం అండగా ఉంటాం: గ్యారీ కిర్‌స్టెన్

image

హార్దిక్ పాండ్య ముంబైకు వెళ్లిపోవడంతో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ శుభ్‌మన్ గిల్ చేతికి వచ్చింది. అయితే, ఐపీఎల్ స్థాయిలో కెప్టెన్సీని యువ ఆటగాడైన గిల్ ఎలా నెట్టుకొస్తారన్న అనుమానాలను జీటీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ తోసిపుచ్చారు. ‘నాయకత్వ బాధ్యతల్ని గిల్ సమర్థంగా నిర్వహిస్తారన్న నమ్మకం మాకుంది. అవసరమైన సాయాన్ని అందించి అండగా నిలుస్తాం. సవాళ్లను ఎదుర్కొని నిలబడగలిగే సత్తా తనకు ఉంది’ అని పేర్కొన్నారు.

News March 18, 2024

మహిళల రక్షణ కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధం: PM

image

శక్తి (అధికారం) పైనే తమ పోరాటం అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘శక్తిని నాశనం చేయాలని విపక్ష కూటమి భావిస్తోంది. భారతదేశం మొత్తం శక్తిని ఆరాధిస్తుంది. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ 4న తెలుస్తుంది. నేను భారతమాత పూజారిని. శక్తిస్వరూపులైన మహిళల రక్షణ కోసం ప్రాణాలు అర్పించేందుకు నేను సిద్ధం’ అని వ్యాఖ్యానించారు.

News March 18, 2024

హైకోర్టులో ప్రభుత్వం అప్పీల్

image

AP: గ్రూప్-1(2018) మెయిన్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. సింగిల్ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. ఈ అప్పీల్ పిటిషన్‌పై రేపు విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా మెయిన్స్ పేపర్లను రెండు సార్లు మూల్యాంకనం చేశారని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో పరీక్షను రద్దు చేసింది.

News March 18, 2024

ఊహించని విధంగా మారిన స్టార్ హీరో

image

తమిళ స్టార్ హీరో ఆర్య తన శరీరాకృతిని ఊహించని విధంగా మార్చుకున్నారు. గతంలో అంతగా ఫిట్‌గా లేని ఆర్య.. ఇప్పుడు కండలు తిరిగిన దేహంతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మను ఆనంద్ దర్శకత్వంలో తాను నటించే MrX సినిమా కోసం ఈ లుక్‌లోకి మారినట్లు వెల్లడించారు. గతేడాది స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైందని, అప్పటి నుంచి తాను వర్కౌట్స్ చేస్తున్నట్లు ఆర్య తెలిపారు.

News March 18, 2024

బీజేపీ ప్రభంజనంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కొట్టుకుపోతాయి: మోదీ

image

తెలంగాణలో BJP ప్రభంజనంలో కాంగ్రెస్, BRS కొట్టుకుపోతాయని PM మోదీ అన్నారు. ‘రాష్ట్రంలో BJPకి ప్రజల మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. భారత్ అభివృద్ధి చెందితే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది. పదేళ్లలో రాష్ట్రానికి రూ.వేల కోట్లు కేటాయించాం. వికసిత్ భారత్ కోసం BJPకి ఓటు వేయాలి. మరోసారి మా విజయం ఖాయం. NDAకు 400కు పైగా సీట్లు ఇవ్వాలి. మే 13న రాష్ట్ర ప్రజలు చరిత్ర సృష్టించబోతున్నారు’ అని వ్యాఖ్యానించారు.

News March 18, 2024

వచ్చే వారం పిఠాపురానికి పవన్ కళ్యాణ్

image

AP: వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్.. వచ్చే వారం నియోజకవర్గంలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 3 మండలాలు, 2 మున్సిపాలిటీలకు చెందిన టీడీపీ-జనసేన-బీజేపీ నేతలతో సమావేశం కానున్నట్లు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా పలువురు కీలక నేతలు పార్టీలో చేరతారని వెల్లడించాయి. కాగా తొలిసారి పవన్ పర్యటనకు వస్తుండటంతో జనసేన శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.

News March 18, 2024

తమిళిసై పొలిటికల్ రీఎంట్రీ.. కలిసొచ్చేనా?

image

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేసి పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఈమె 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తుకూడి నుంచి BJP తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే మూడు సార్లు అసెంబ్లీ బరిలో నిలిచినా గెలుపు దక్కలేదు. ఆమె సేవలను గుర్తించిన బీజేపీ అధిష్ఠానం 2019లో గవర్నర్ పదవిని కట్టబెట్టింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈసారైనా కలిసొస్తుందేమో చూడాలి.