News December 26, 2024

సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్?

image

ట్యాక్స్ పేయర్స్‌కి ఊరట కలిగించేలా 2025 బ‌డ్జెట్‌లో కేంద్రం నిర్ణ‌యాలు ఉంటాయ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. 2020లో తెచ్చిన ప‌న్ను విధానం కింద ₹3.5 లక్షల- ₹10.50 ల‌క్ష‌ల ఆదాయానికి 5-20%, ఈ మొత్తానికి మించితే 30% ప‌న్ను చెల్లించాల్సి వ‌స్తోంది. ప్ర‌స్తుతం దేశం అర్థిక స‌వాళ్లు ఎదుర్కొంటుండడం, పెరుగుతున్న జీవ‌న వ్య‌యాల నేప‌థ్యంలో Tax Payersకి ఊర‌ట క‌లిగించేలా Budgetలో నిర్ణ‌యాలుంటాయ‌ని స‌మాచారం.

News December 26, 2024

మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్: రాహుల్ గాంధీ

image

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జ‌రిగిందంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నిక‌ల‌కు ముందు 118 నియోజ‌క‌వ‌ర్గాల్లో 72 ల‌క్ష‌ల ఓట్ల‌ను జోడించార‌ని, అందులో 102 చోట్ల BJP విజ‌యం సాధించింద‌న్నారు. LS ఎన్నిక‌ల త‌రువాత AS ఎన్నిక‌ల‌కు ముందు ఈ అక్ర‌మాలు జరిగినట్టు వివ‌రించారు. అయితే, ఏక‌ప‌క్షంగా ఓట‌ర్ల తొల‌గింపు, కొత్త ఓట‌ర్లను చేర్చ‌డం సాధ్యంకాద‌ని ఇటీవ‌ల EC వివ‌ర‌ణ ఇవ్వ‌డం తెలిసిందే.

News December 26, 2024

టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్

image

టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వన్డే ఫార్మాట్‌లోకి అడుగుపెడుతున్నారు. త్వరలో జరగబోయే విజయ్ హజారే ట్రోఫీలో ఆయన ఆడనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ఆయన అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. కాగా హార్దిక్ వన్డేలు ఆడక ఏడాది దాటిపోయింది. వన్డే వరల్డ్ కప్ 2023లో గాయపడినప్పటి నుంచి ఆయన ఈ ఫార్మాట్‌కు దూరమయ్యారు. ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో హార్దిక్ వన్డేలపై దృష్టి సారించారు.

News December 26, 2024

ప్రముఖ RJ, ఇన్‌స్టా ఫేమ్ ఆత్మహత్య

image

రేడియో జాకీ, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ సిమ్రాన్ సింగ్(25) ఆత్మహత్య చేసుకున్నారు. గురుగ్రామ్‌లో సెక్టర్-47లోని తన ఫ్లాట్‌లో ఆమె ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన సిమ్రాన్‌కు ఇన్‌స్టాలో సుమారు 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అభిమానులు ఆమెను ‘జమ్మూ కి ధడ్‌కన్’గా పిలుచుకుంటారు. సిమ్రాన్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

News December 26, 2024

తుది శ్వాస వరకూ పోరాడతాం: ఖర్గే

image

గాంధీ-నెహ్రూల వారసత్వం తమకు ఉందని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బెలగావి CWC సమావేశంలో మాట్లాడుతూ, ‘ఇక్కడి నుంచి మేం సంకల్పంతో తిరిగొస్తాం. ఐకమత్యంతో ప్రత్యర్థుల అబద్ధాల్ని తిప్పికొడతాం. ఎన్నికలు గెలిచే నైపుణ్యాన్ని పార్టీకి అందిస్తాం. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ పూర్తిగా అమలు చేస్తాం. గాంధీ-నెహ్రూ సిద్ధాంతాల కోసం, అంబేడ్కర్ గౌరవం కోసం తుదిశ్వాస వరకూ పోరాడుతాం’ అని తెలిపారు.

News December 26, 2024

CWC మీటింగ్‌లో మ్యాప్ వివాదం

image

బెళ‌గావిలో CWC మీటింగ్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన భార‌త చిత్ర‌ప‌టంలో క‌శ్మీర్‌లోని కొన్ని భాగాలు లేక‌పోవ‌డంపై వివాదం చెల‌రేగింది. దీనిపై వివరణ ఇవ్వాలని BJP డిమాండ్ చేసింది. జార్జ్ సొరోస్‌తో క‌ల‌సి దేశాన్ని అస్థిర‌ప‌రిచేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు సిగ్గుచేట‌ని విమ‌ర్శించింది. అయితే ఆ ఫ్లెక్సీని పార్టీ కాకుండా స్థానిక శ్రేణులు ఎవ‌రో ఏర్పాటు చేసిన‌ట్టు కాంగ్రెస్ వివ‌ర‌ణ ఇచ్చింది.

News December 26, 2024

70 గంటలుగా బోరుబావిలో.. చిట్టి తల్లికి నరకం

image

రాజస్థాన్‌లోని కోఠ్‌పుత్లీ జిల్లాలో 3ఏళ్ల చిన్నారి 700 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది. 70 గంటల క్రితం ఆమె పడిపోగా అప్పటి నుంచీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాట్ హోల్ మైనింగ్ ద్వారా బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. బాలిక ప్రస్తుతం 150 అడుగుల వద్ద ఉందన్నారు. పైపుతో ఆక్సిజన్ పంపిస్తున్నామని తెలిపారు. చిట్టితల్లి క్షేమంగా బయటపడాలని అందరూ ప్రార్థిస్తున్నారు.

News December 26, 2024

ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు బెయిల్

image

TG: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆయనను ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం రూ.5వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది.

News December 26, 2024

ఇండియాలో లక్షలో 96 మందికి క్యాన్సర్

image

మారిన జీవనశైలితో వేలాది మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా డెన్మార్క్ దేశంలో క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నారు. లక్ష మందిలో 335 మందికి క్యాన్సర్ సోకుతోంది. దీని తర్వాత ఐర్లాండ్(326), బెల్జియం(322), హంగేరీ(321), ఫ్రాన్స్(320), నెదర్లాండ్స్(315), ఆస్ట్రేలియా(312), నార్వే(312), స్లోవేనియా(300), అమెరికా(297) ఉన్నాయి. ఇక లక్షలో 96 మంది క్యాన్సర్ బాధితులతో ఇండియా 163వ స్థానంలో ఉంది. SHARE IT

News December 26, 2024

సోనియా గాంధీకి అస్వస్థత?

image

ఏఐసీసీ అగ్ర నేత సోనియా గాంధీ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. బెలగావిలో జరుగుతున్న సీడబ్ల్యూసీ మీటింగ్‌లో సోనియా పాల్గొనాల్సి ఉంది. కానీ అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఆమెతోపాటు ప్రియాంకా గాంధీ కూడా అక్కడే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సీడబ్ల్యూసీ సమావేశాల్లో రాహుల్ గాంధీ మాత్రమే పాల్గొన్నారు.