News March 16, 2024

ఎన్నికలకు ముందే ప్రజలు ఫలితాలు ప్రకటించారు: మోదీ

image

TG: ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇవ్వకముందే ప్రజలు ఫలితాలు ప్రకటించారని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీకి 400 సీట్లు ఇస్తామని తేల్చారని ఆయన పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో మోదీ మాట్లాడారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

News March 16, 2024

హార్దిక్‌కు స్పెషల్ రూల్స్ ఎందుకు?: మాజీ క్రికెటర్

image

హార్దిక్ పాండ్య కూడా మిగతా ఆటగాళ్లలాగే డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ‘అతను చంద్రుడి పైనుంచి దిగి వచ్చాడా? అతను కూడా దేశవాళీ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు ఆడాలి. అతని విషయంలో ప్రత్యేకంగా వేరే నిబంధనలు ఎందుకు? కేవలం వైట్‌బాల్ టోర్నీల్లోనే ఎందుకు ఆడటం? అన్ని ఫార్మాట్లలో ఆడమని బీసీసీఐ అతనికి వార్నింగ్ ఇవ్వాలి’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

News March 16, 2024

కవితను అక్రమంగా అరెస్టు చేశారు: లాయర్

image

కవిత తరఫు లాయర్ విక్రమ్ చౌదరి రౌస్ అవెన్యూ కోర్టులో కీలక వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీని ఉల్లంఘించి ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారని తెలిపారు. కవితకు సుప్రీంకోర్టు ఇచ్చిన రిలీఫ్ ఇంకా అమలులో ఉందని చెప్పారు. ఈడీ విచారణకు కవిత సహకరించారని, అయినా అక్రమంగా అరెస్టు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

News March 16, 2024

కాసేపట్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటన

image

AP: సీఎం జగన్ ఇడుపులపాయకు బయలుదేరారు. మ.12.30కు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పిస్తారు. మ.1 గంటకు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. ఒకేసారి 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే 68 అసెంబ్లీ స్థానాల్లో జగన్ మార్పులు చేశారు.

News March 16, 2024

జాబితాలో బీసీలకు అధిక ప్రాధాన్యం: సజ్జల

image

AP: చంద్రబాబు పార్టీ వెంటిలేటర్‌పై ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని గుర్తు చేశారు. చంద్రబాబు మాటలే తప్ప బీసీలకు ఏనాడు న్యాయం చేయలేదని విమర్శించారు.

News March 16, 2024

కవిత అరెస్టు: INDIA కూటమి మద్దతిస్తుందా?

image

EDని అడ్డుపెట్టుకొని కేంద్రంలోని BJP ప్రతిపక్ష నేతలను అరెస్టులతో వేధిస్తోందని ఆరోపణలున్నాయి. తాజాగా BRS ఎమ్మెల్సీ కవితను ED అరెస్ట్ చేసింది. దీంతో కేంద్రంలో BJPని వ్యతిరేకించే INDIA కూటమి KCR కుటుంబానికి మద్దతిస్తుందా? అనే చర్చ మొదలైంది. అయితే.. రాష్ట్రంలో BRS, కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్‌ తారస్థాయికి చేరింది. దీంతో INDIA కూటమి BRSకు మద్దతిచ్చే అవకాశం లేదని కొందరు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి?

News March 16, 2024

కోర్టులో వాడీవేడి వాదనలు

image

కవిత అరెస్టుపై రౌస్ అవెన్యూ కోర్టులో వాడీవేడి వాదనలు సాగుతున్నాయి. కవిత తరఫున సీనియర్ లాయర్ విక్రమ్ చౌదరి, ఈడీ తరఫున ఎన్.కె.మట్టా, హుస్సేన్ వాదనలు వినిపిస్తున్నారు. కవితను విచారించేందుకు 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాదులు కోరుతుండగా.. ఇది అక్రమ అరెస్ట్ అని, బెయిల్ ఇవ్వాలంటూ కవిత లాయర్ వాదిస్తున్నారు. కవిత మాట్లాడేందుకు న్యాయమూర్తి 5 నిమిషాల సమయం ఇచ్చారు.

News March 16, 2024

మధ్యాహ్నం సీఎం రేవంత్ ప్రెస్‌మీట్

image

TS: సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. అయితే కవిత అరెస్టుపై రేవంత్ స్పందిస్తారా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది.

News March 16, 2024

ఈ సారి ఎలక్షన్స్ ఎన్ని దశలో?

image

ఇవాళ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. గతంలో ఎలక్షన్స్‌ను దశల వారీగా నిర్వహించారు. 2004లో 4, 2009లో 5, 2014లో 9, 2019లో 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. దీంతో ఈ సారి ఎన్ని దశల్లో ఎలక్షన్స్ నిర్వహిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికలకు మార్చి 10న షెడ్యూల్ విడుదల కాగా.. ఈ సారి ఆరు రోజులు ఆలస్యంగా వస్తుండడం గమనార్హం.