News December 26, 2024

విరాట్ కోహ్లీకి భారీ జరిమానా

image

బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ కోన్ట్సస్‌ను విరాట్ <<14982204>>స్లెడ్జ్<<>> చేసిన ఘటనపై ICC తీవ్రంగా స్పందించింది. కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20శాతం కోత పెట్టింది. కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 కింద ఒక డీమెరిట్ పాయింట్‌ విధించింది. నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఆయన్ను తొలగిస్తారని వార్తలు రాగా ఫైన్‌తో సరిపెట్టింది.

News December 26, 2024

బాలీవుడ్, హాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు: CM రేవంత్

image

TG: సినీ ప్రముఖులతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర సినీ పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు. బాలీవుడ్, హాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతామని చెప్పారు. టాలీవుడ్‌కు బ్రాండ్ తీసుకొచ్చి, ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని వెల్లడించారు. తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ చిత్ర పరిశ్రమకు అండగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు.

News December 26, 2024

Stock Market: ఫ్లాట్‌గా ముగిశాయి

image

దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో శాంటాక్లాజ్ ర్యాలీ క‌నిపించ‌లేదు. బెంచ్ మార్క్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. Sensex 78,472 (-0.39) వ‌ద్ద‌, Nifty 23,750(+22) వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. ఆటో, ఫార్మా, హెల్త్ కేర్ ఇండెక్స్‌, క‌న్జూమ‌ర్ డ్యూర‌బుల్స్‌, పీఎస్‌యూ బ్యాంక్స్ కొంత‌మేర రాణించాయి. అధిక వెయిటేజీ రంగాలు రెడ్‌లోనే ముగిశాయి. అదానీ పోర్ట్స్ అత్యధికంగా 5% లాభపడింది. Titan, Asian Paints టాప్ లూజర్స్.

News December 26, 2024

FLASH: వర్షం

image

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లోని కొన్ని ఏరియాలతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో వాన పడుతోంది. కాగా నిన్నటి నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. మబ్బులు ఏర్పడి వెదర్ చల్లగా మారింది. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరి మీ ప్రాంతంలోనూ వర్షం కురుస్తోందా?

News December 26, 2024

కొత్త ఏడాదిలో చైనా, అమెరికాకు ప్రధాని మోదీ?

image

కొత్త సంవత్సరంలో PM మోదీ పర్యటనల క్యాలెండర్‌ను విదేశీ వ్యవహారాల శాఖ సిద్ధం చేస్తోంది. ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం.. ట్రంప్‌ అధ్యక్షుడిగా అధికారం స్వీకరించిన అనంతరం ఆయనతో భేటీ అయ్యేందుకు మోదీ US వెళ్లే అవకాశం ఉంది. ఇక బ్రెజిల్‌లో బ్రిక్స్, చైనాలో SCO సదస్సుకు ప్రధాని హాజరుకానున్నారు. ఈక్రమంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఆయన ప్రత్యేకంగా ద్వైపాక్షిక భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

News December 26, 2024

భాగ‌వ‌త్‌తో విభేదించిన RSS మ్యాగ‌జైన్‌

image

మసీదు-మందిర్ వివాదాల‌పై RSS చీఫ్ మోహ‌న్ భాగ‌వ‌త్‌తో ఆ శాఖ అనుబంధ మ్యాగ‌జైన్ విభేదించింది. ఈ త‌ర‌హా వివాదాలు అధిక‌మ‌వుతుండ‌డంపై భాగ‌వ‌త్ గ‌తంలో ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. భార‌తీయులు క‌లిసి ఉండ‌గ‌ల‌ర‌న్న ఐక్య‌త చాటాల‌ని పిలుపునిచ్చారు. అయితే RSSకు చెందిన ఓ మ్యాగ‌జైన్ మాత్రం సివిలైజేష‌న్ జ‌స్టిస్ కోసం వివాదాస్పద స్థలాలు, నిర్మాణాల వాస్తవ చరిత్రను తెలుసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొనడం గమనార్హం.

News December 26, 2024

ముఖ్యమంత్రి పదవినే వద్దనుకున్నా: సోనూ సూద్

image

తనకు రాజకీయాల్లో చాలా ఆఫర్లు వచ్చాయని సినీ నటుడు సోనూ సూద్ తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడు వంటి పదవుల ఆఫర్లు వచ్చాయని చెప్పారు. ‘కొందరు బడా నేతలు నన్ను సీఎంగా బాధ్యతలు తీసుకోవాలన్నారు. కానీ నేను దానికి అంగీకరించలేదు. నేను రాజకీయాల్లోకి వస్తే జవాబుదారీతనంతో ఉండాలి. కానీ అది నాకు నచ్చదు. ఇప్పుడు నేను స్వేచ్ఛగా సేవ చేస్తున్నా. ఇకపై కూడా ఇలాగే ఉంటా’ అని ఆయన చెప్పుకొచ్చారు.

News December 26, 2024

ఇండియన్స్‌కు తక్కువ జీతం ఇవ్వొచ్చు : అమెరికా కంపెనీ ఫౌండర్

image

భారత ఉద్యోగులపై నియర్ కో ఫౌండర్ ఫ్రాంకో పెరేరా చేసిన వ్యాఖ్యలపై విమర్శలొస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని US వారికంటే భారతీయులకు తక్కువ వేతనం ఇవ్వడం తప్పుకాదని ఆయన linkedinలో పోస్ట్ చేశారు. ఇండియా, లాటిన్ అమెరికా, ఫిలిప్పీన్స్‌‌ గురించి ఇలా చెప్పారు. సమానమైన పని చేస్తున్నప్పటికీ ఇండియన్స్ ఇలా పనిదోపిడీకి గురవుతున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News December 26, 2024

కాంగ్రెస్‌ను తొల‌గించాల‌ని కోరుతాం: ఆప్‌

image

INDIA కూట‌మి నుంచి కాంగ్రెస్‌ని తొల‌గించాల‌ని మిత్రపక్షాల్ని కోరుతామ‌ని ఆప్ తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తమను ఓడించ‌డానికి BJPతో కాంగ్రెస్ చేతులు క‌లిపింద‌ని ఆప్ నేత సంజ‌య్ సింగ్‌ ఆరోపించారు. BJP గెలుపు కోసం కాంగ్రెస్ పనిచేస్తోంద‌న్నారు. కేజ్రీవాల్‌ను యాంటీ నేష‌నల్ అని విమ‌ర్శించిన అజ‌య్ మాకన్‌పై కాంగ్రెస్ చ‌ర్య‌లు తీసుకోక‌పోతే కూట‌మి నుంచి ఆ పార్టీని తొల‌గించాల‌ని కోర‌తామ‌న్నారు.

News December 26, 2024

ఉగ్రవాది మసూద్ అజార్‌కు గుండెపోటు

image

జైషే మహమ్మద్ ఫౌండర్, టెర్రరిస్ట్ మౌలానా మసూద్ అజార్ హార్ట్ ఎటాక్‌కు గురైనట్లు వార్తలొస్తున్నాయి. అఫ్గాన్‌లోని ఖోస్త్ ప్రావిన్స్‌లో ఉండగా గుండెనొప్పి రావడంతో చికిత్స కోసం పాక్‌లోని కరాచీకి తరలించారని సమాచారం. ప్రత్యేక వైద్యనిపుణులు ఇస్లామాబాద్ నుంచి కరాచీకి చేరుకొని ట్రీట్‌మెంట్ చేస్తున్నారని తెలుస్తోంది. 1999లో IC-814 విమానాన్ని హైజాక్ చేయడంతో భారత ప్రభుత్వం మసూద్‌ను జైలు నుంచి విడుదల చేసింది.