India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. రెట్రో ఫిట్ మెంట్ పాలసీ ద్వారా మార్చేందుకు కేంద్రాన్ని సాయం కోరింది. కొత్త ఎలక్ట్రిక్ బస్సు రూ.1.50 కోట్ల పైనే ఉండటంతో ఈ వైపు ఆలోచనలు చేస్తోంది. పాత బస్సులను మార్చడం ద్వారా సంస్థపై వ్యయ భారం తగ్గే అవకాశం ఉంది. కేంద్రం దీనికి అనుమతిస్తే తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపై తిరగనున్నాయి.

సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బెనిఫిట్ షోల విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పినదానికే కట్టుబడి ఉంటామని, బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం తేల్చి చెప్పారు.

TG: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీకి చిరంజీవి హాజరుకాలేదు. సినీ పెద్దలంతా కలిసి వస్తారని భావించినా సీనియర్ హీరోల్లో కేవలం నాగార్జున, వెంకటేశ్ మాత్రమే కనిపించారు. చెన్నైలో స్నేహితుడి కూతురి పెళ్లికి వెళ్లడం వల్లే ఈ భేటీకి దూరంగా ఉన్నట్లు చిరు టీం తెలిపింది. హీరోల్లో వరుణ్ తేజ్, శివ బాలాజీ, కళ్యాణ్ రామ్, అడివి శేష్, కిరణ్ అబ్బవరం, రామ్, సిద్ధూ జొన్నలగడ్డ, నితిన్, సాయిధరమ్ తేజ్ వచ్చారు.

TG: సీఎం రేవంత్ రెడ్డితో దిల్ రాజు నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం సమావేశమైంది. ఇటీవల జరిగిన పరిణామాలు, టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఇతర అంశాలపై వీరు చర్చించనున్నట్లు తెలుస్తోంది.

TG: సినీ ప్రముఖుల ముందు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు ఉంచనున్నట్లు తెలుస్తోంది. వీటిపై నిర్మాతలు, దర్శకులు, హీరోలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు.
1.సినిమా టికెట్లపై విధించే సెస్సును ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించాలి.
2.డ్రగ్స్‌కు వ్యతిరేకంగా హీరో, హీరోయిన్ ప్రచార కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొనాలి.
3.కులగణన సర్వే ప్రచార కార్యక్రమాలకు సహకరించాలి.

AP: వంగవీటి మోహన రంగా వర్ధంతి రోజున మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ట్వీట్ చేశారు. ‘దీక్షలో ఉన్న ధీరుడిని టీడీపీ గూండాలు హతమార్చి నేటికి 36 సంవత్సరాలు. జోహార్ వంగవీటి మోహన రంగా’ అని Xలో పేర్కొన్నారు. కాగా 1988లో బెజవాడలో జరిగిన అల్లర్లలో మోహన రంగాను ప్రత్యర్థులు హతమార్చారు.

సినీ ప్రముఖులతో భేటీకి ముందు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో సమావేశం అయ్యారు. సినీ పరిశ్రమ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆలోచనలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం పోలీస్ కమాండ్ సెంటర్ (CCC)లో నిర్మాతలు, దర్శకులు, నటులతో సీఎం భేటీ కానున్నారు.

టీమ్ ఇండియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఓపెనర్లు కోన్ట్సస్(60), ఖవాజా(57) అర్ధసెంచరీలతో రాణించారు. టీ విరామం తర్వాత లబుషేన్(61*) కూడా అర్ధసెంచరీ పూర్తి చేశారు. మరో బ్యాటర్ స్మిత్(30*) క్రీజులో ఉన్నారు. బుమ్రా, జడేజా చెరో వికెట్ తీశారు.

TG: నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ, సీనియర్ నేత మంద జగన్నాథం ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొన్ని రోజుల క్రితం గుండె పోటుకు గురవ్వగా నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురు నాయకులు ఆయనను పరామర్శించారు.

తమిళనాడులోని ప్రతిష్ఠాత్మక అన్నా యూనివర్సిటీలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. DEC 23న రాత్రి స్నేహితుడితో మాట్లాడుతుండగా ఇద్దరు దుండగులు వచ్చి అత్యాచారం చేశారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. స్నేహితుడిని దారుణంగా కొట్టి తరిమేసి, రేప్ చేశారని, అనంతరం న్యూడ్ ఫొటోలు తీశారని తెలిపింది. TNలో మహిళలకు సేఫ్టీ లేదని BJP నేత అన్నామలై మండిపడ్డారు.
Sorry, no posts matched your criteria.