News June 23, 2024

అన్న అబ్బాయిల్ని.. తమ్ముడు అమ్మాయిల్ని..!

image

మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబ గౌరవం మసకబారుతోంది. ఆయన కొడుకు HD రేవణ్ణ కుమారులు <<13495776>>సూరజ్<<>>(అన్న), <<13415105>>ప్రజ్వల్<<>>(తమ్ముడు) లైంగిక వేధింపుల కేసుల్లో కటకటాలపాలయ్యారు. మహిళలను అత్యాచారం చేసిన కేసులో ప్రజ్వల్‌, పార్టీ కార్యకర్తపై అసహజ శృంగారానికి పాల్పడిన కేసులో సూరజ్‌ అరెస్ట్ అయ్యారు. ఇక ప్రజ్వల్‌కు తల్లి భవానీ సహకరించారని విచారణలో తేలగా, గతంలో HD రేవణ్ణపైనా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.

News June 23, 2024

రూ.వెయ్యి లీజుతో చంద్రబాబు కట్టుకున్న పూరి గుడిసె ఇదే: వైసీపీ

image

AP: చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులు కడితే జగన్ ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ప్యాలెస్‌లు నిర్మించుకున్నారని TDP <>విమర్శించింది<<>>. దీనికి వైసీపీ Xలో కౌంటరిచ్చింది. ‘రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని TDP హయాంలో రూ.1,000కి లీజుకి తీసుకుని CBN కట్టుకున్న పూరి గుడిసె ఇదే! ఈ స్థలం 99ఏళ్లు TDPకే సొంతం అనేలా చట్టవిరుద్ధంగా రాయించుకున్నారు. ఇలాంటి భూములు ప్రతి జిల్లాలో కాజేశారు’ అని ఆరోపించింది.

News June 23, 2024

T20 WC: అలా అయితే ఆస్ట్రేలియా ఇంటికే!

image

టీ20 WCలో అఫ్గాన్‌పై ఓటమితో ఆస్ట్రేలియా సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. రేపు భారత్‌తో మ్యాచులో ఆ జట్టు ఓడిపోయి, బంగ్లాదేశ్‌‌పై అఫ్గాన్ గెలిస్తే ఆస్ట్రేలియా టోర్నీ నుంచి ఎలిమినేట్ అవుతుంది. ఇలా జరిగితే సూపర్-8లో గ్రూప్-1 నుంచి IND 6, AFG 4 పాయింట్లతో సెమీస్ చేరుతాయి. ఒకవేళ INDపై AUS, AFGపై BAN గెలిస్తే IND, AUS సెమీస్‌కు వెళ్తాయి. ప్రస్తుతం IND 4, AUS 2, AFG 2, BAN 0 పాయింట్లతో ఉన్నాయి.

News June 23, 2024

లండన్‌లో పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్ మాల్యా

image

విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యా వివాహం లండన్ సమీపంలోని లేడీ వాక్ ఎస్టేట్‌లో నిన్న ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. సిద్ధార్థ్, అతని స్నేహితురాలు జాస్మిన్ రింగ్స్ మార్చుకుని ఒక్కటయ్యారు. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగినట్లు సమాచారం. హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లో 30 ఎకరాల్లో విస్తరించి ఉన్న లేడీ వాక్ ఎస్టేట్‌ను విజయ్ మాల్యా 2015లో కొనుగోలు చేశారు.

News June 23, 2024

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్.. కీలక అంశాలపై చర్చ!

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు లోక్‌సభలో ప్రమాణస్వీకారం చేయనున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం కానున్నారు. అనంతరం నామినేటెడ్ పోస్టులు, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రి వర్గ విస్తరణ తదితర అంశాలపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చిస్తారని సమాచారం. అలాగే ఎంపీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి గల కారణాలపైనా పార్టీ పెద్దలు ఆరా తీస్తారని తెలుస్తోంది.

News June 23, 2024

గౌతమ్ తొలి స్టేజ్ ప్రదర్శన.. గర్వంగా ఉందన్న నమ్రత

image

మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ లండన్‌లో యాక్టింగ్ నేర్చుకుంటున్నారు. తాజాగా ఆయన అక్కడ మొదటిసారి థియేటర్ స్టేజ్ ప్రదర్శన ఇచ్చారు. ఈ విషయాన్ని తల్లి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో వెల్లడించారు. కొడుకును చూస్తే గర్వంగా ఉందన్నారు. ప్రదర్శన చూసిన వారంతా ఎంజాయ్ చేశారని తెలిపారు. స్నేహితులు, కుటుంబంతో కలిసి ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఫ్యామిలీతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు.

News June 23, 2024

BIG BREAKING: నీట్ స్కామ్‌పై FIR నమోదు చేసిన సీబీఐ

image

నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో సీబీఐ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ వ్యవహారంపై ఇవాళ FIR నమోదు చేశారు. పరీక్షలో అవకతవకలకు పాల్పడిన వ్యక్తులు, బిహార్‌లో పేపర్ లీక్‌తోపాటు గ్రేస్ మార్కులు కలపడంపైనా పూర్తి స్థాయిలో విచారణ చేయనున్నారు.

News June 23, 2024

ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ అరెస్ట్

image

ఓ అబ్బాయిపై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, MLC సూరజ్ రేవణ్ణను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. సూరజ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని JDU కార్యకర్త ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘ఇది మొదటిసారే.. తర్వాతిసారి బాగుంటుంది. సహకరిస్తే ఉద్యోగం ఇప్పిస్తా, లేదంటే చంపేస్తా’ అని బెదిరించినట్లు పేర్కొన్నాడు. కాగా మహిళలను లైంగికంగా వేధించిన కేసులో ఇప్పటికే ప్రజ్వల్‌ అరెస్టయ్యారు.

News June 23, 2024

అఫ్గానిస్థాన్‌కు చరిత్రాత్మక విజయం

image

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్ తొలి విజయాన్ని నమోదు చేసింది. టీ20 WCలో ఇవాళ జరిగిన మ్యాచులో గెలిచి చరిత్రాత్మక గెలుపును అందుకుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 6 సార్లు తలపడగా, ఆసీస్ తొలిసారి ఓడింది. గత టీ20 WCలో ఇంగ్లండ్, పాక్, శ్రీలంకను ఓడించిన AFG, ఈసారి గ్రూప్ స్టేజీలో NZపై, సూపర్-8లో AUSపై గెలుపొందింది. ఆ జట్టు త్వరలోనే టాప్ జట్లలో ఒకటిగా నిలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

News June 23, 2024

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో స్థానిక విద్యార్థులకు నష్టం: BRS

image

TG: MBBS మెడికల్ సీట్లను స్థానిక విద్యార్థులకు మాత్రమే రిజర్వ్ చేయాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని BRS ఆరోపించింది. దీని వల్ల TG విద్యార్థులు 500-800 UG సీట్లు, దాదాపు 200 PG సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని ట్వీట్ చేసింది. ‘రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరి ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తోంది? ఏపీ విద్యార్థులకు అనుకూలంగా వ్యవహరించాలని అనుకుంటోందా?’ అని ప్రశ్నించింది.