News December 26, 2024

ఏపీలోకి జోరుగా పొరుగు రాష్ట్రాల మద్యం

image

AP: ప్రభుత్వం నూతన లిక్కర్ పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత కూడా APలోకి పొరుగు రాష్ట్రాల మద్యం ఎక్కువగా వస్తోంది. ఈ ఏడాది NOV వరకు 1.89 లక్షల లీటర్ల మద్యాన్ని ఎక్సైజ్, పోలీస్ శాఖలు సీజ్ చేశాయి. ఈ నెలలో అనంతపురంలో పట్టుబడిన 30వేల బాటిళ్లనూ కలుపుకుంటే 2 లక్షల లీటర్లు దాటనుంది. ఇంకా కొన్ని బ్రాండ్ల ధరలు ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. గతేడాది ఇదే సమయానికి 71,365 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు.

News December 26, 2024

8 రోజులు.. రెండు డబుల్ సెంచరీలు, 2 శతకాలు

image

దేశవాళీ క్రికెట్‌లో సమీర్ రిజ్వీ విధ్వంసం సృష్టిస్తున్నారు. యూపీ తరఫున ఆడుతున్న అతను 8 రోజుల వ్యవధిలోనే రెండు డబుల్ సెంచరీలు, రెండు శతకాలు బాదారు. విదర్భపై 105 బంతుల్లో 202*, త్రిపురపై 97 బాల్స్‌లో 201*(ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ), హిమాచల్‌పై 153, పుదుచ్చేరిపై 137* పరుగులు చేశారు. కాగా ఐపీఎల్ వేలంలో అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం రూ.95 లక్షలకు సొంతం చేసుకుంది.

News December 26, 2024

ఇకపై అల్ట్రాటెక్ అనుబంధ సంస్థగా ICL

image

ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్(ICL)లో ప్రమోటర్లకున్న 32.72 శాతం వాటాను అల్ట్రాటెక్ సొంతం చేసుకుని కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసింది. దీంతో అల్ట్రాటెక్ వాటా 55.49 శాతానికి చేరుకుంది. దీంతో ఇండియా సిమెంట్స్ ఎండీ శ్రీనివాసన్, భార్య చిత్ర, కుమార్తె రూప, ఇతర ప్రమోటర్లు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఇకపై సదరు సంస్థ తమకు అనుబంధంగా కొనసాగుతుందని అల్ట్రాటెక్ వెల్లడించింది.

News December 26, 2024

ఇవాళ టెట్ హాల్‌టికెట్లు విడుదల

image

TG: జనవరి 2 నుంచి 20 వరకు జరగనున్న టెట్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను నేడు అధికారులు విడుదల చేయనున్నారు. అభ్యర్థులు https://tgtet2024.aptonline.in/tgtet/లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్స్‌కు 2,48,172 మంది అప్లై చేసుకున్నారు. వీరికి ఉ.9 నుంచి 11.30 వరకు, మ.2 నుంచి 4.30 వరకు రెండు సెషన్లుగా పరీక్షలు ఉండనున్నాయి. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో టెట్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.

News December 26, 2024

నేడు సీఎంతో సినీ ప్రముఖుల భేటీ.. విజయశాంతి ఏమన్నారంటే?

image

TG: ఇవాళ సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖులు భేటీ కానుండటంపై విజయశాంతి స్పందించారు. ‘ఈ సమావేశంలో సినీ ఇండస్ట్రీపై విశ్లేషణాత్మక చర్చ జరగాలి. ఇకపై టికెట్ రేట్ల పెంపు ఉండదన్న సీఎం, మంత్రి వ్యాఖ్యలు, సంక్రాంతికి స్పెషల్ షోల అనుమతి, తెలంగాణ సినిమా, సంస్కృతి, చిన్నస్థాయి కళాకారులు, తక్కువ బడ్జెట్ మూవీలకు థియేటర్ల కేటాయింపుపైనా చర్చించాలి. వీటన్నిటిపై ఏకాభిప్రాయం వస్తుందని ఆశిద్దాం’ అని ట్వీట్ చేశారు.

News December 26, 2024

నాన్నకు క్యాన్సర్ సర్జరీ సక్సెస్: శివరాజ్ కూతురు నివేదిత

image

కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌కు USలో క్యాన్సర్ సర్జరీ విజయవంతంగా పూర్తయ్యింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చిన్న కుమార్తె నివేదిత ఇన్‌స్టాలో వెల్లడించారు. ‘ఈ కష్టకాలంలో నాన్న చూపిన స్థైర్యం మాలో ధైర్యాన్ని నింపింది. అభిమానులు, ఫ్రెండ్స్ ప్రేమ, ప్రార్థనలు, ఆశీర్వాదాలు మాకెంతో బలాన్ని ఇచ్చాయి. వారికి మా ధన్యవాదాలు. ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేస్తాం’ అని పోస్టు చేశారు.

News December 26, 2024

టాస్ గెలిచిన ఆసీస్.. భారత జట్టులో కీలక మార్పులు

image

మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. గిల్ స్థానంలో సుందర్ భారత జట్టులోకి వచ్చారు. రోహిత్ మళ్లీ ఓపెనింగ్ చేయనున్నారు.
IND: జైస్వాల్, రోహిత్, రాహుల్, కోహ్లీ, పంత్, జడేజా, నితీశ్, సుందర్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్
AUS: ఖవాజా, కోన్ట్సస్, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్, క్యారీ, స్టార్క్, కమిన్స్, లయన్, బోలాండ్

News December 26, 2024

ఏ వయసులో తండ్రి కావాలంటే?

image

ప్రస్తుత ఉరుకుల పరుగుల ప్రపంచంలో కొందరు పెళ్లైనా పిల్లల గురించి ఆలోచించడం లేదు. కానీ 22 నుంచి 30 ఏళ్ల మధ్యలోనే తండ్రి కావడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వయసులో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి అత్యధికంగా ఉంటుంది. స్పెర్మ్ చురుకుగా, అధిక నాణ్యతతో ఉంటుంది. 30 ఏళ్లు దాటితే వీర్యంలో నాణ్యత తగ్గి గర్భస్రావం కావచ్చు. 35 ఏళ్ల తర్వాత తండ్రి అయినా పుట్టే బిడ్డ లోపాలతో జన్మించవచ్చు.

News December 26, 2024

English Learning: Antonyms

image

✒ Defile× Purify, sanctity
✒ Demolish× Repair, construct
✒ Deliberate× Rash, Sudden
✒ Deride× Inspire, Encourage
✒ Deprive× Restore, Renew
✒ Dissuade× Insite, Persuade
✒ Disdain× Approve, praise
✒ Dense× Sparse, brainy
✒ Denounce× Defend

News December 26, 2024

బౌన్సర్ల కల్చర్ తీసుకొచ్చింది రేవంత్ రెడ్డే: రఘునందన్

image

TG: బౌన్సర్లపై కాంగ్రెస్ నేతలు, పోలీసులు చేస్తున్న విమర్శలకు BJP MP రఘునందన్ కౌంటరిచ్చారు. ప్రైవేటు బౌన్సర్లతో ప్రజలను పక్కకు తోసేసే సంస్కృతిని తీసుకొచ్చింది CM రేవంతేనని ఆరోపించారు. PCC చీఫ్‌గా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని ఆయన మొదలుపెట్టారన్నారు. HYD CP ఆనంద్‌కు చిత్తశుద్ధి ఉంటే బౌన్సర్ల వ్యవస్థనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బన్నీ వివాదంలో బౌన్సర్లను ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు.