News June 22, 2024

జులై 6 నుంచి సీపీగెట్

image

TG: ఎంఏ, ఎంకాం, MSc, ఎంఈడీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు జులై 6 నుంచి 15 వరకు సీపీగెట్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 45 సబ్జెక్టులకు రోజుకు 3 విడతల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. సీట్ల కంటే తక్కువ దరఖాస్తులు రావడంతో ఎంఏ అరబిక్, కన్నడ, మరాఠీ, పర్షియన్, థియేటర్ ఆర్ట్స్, MSc ఎలక్ట్రానిక్స్‌కు పరీక్షలు ఉండవన్నారు. అభ్యర్థులు జులై 3 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.

News June 22, 2024

నేడు స్పీకర్‌గా అయ్యన్న బాధ్యతలు స్వీకరణ

image

AP: అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమైంది. దీనిపై నేడు సభలో అధికారిక ప్రకటన చేయనున్నారు. అనంతరం ఆయన సభాపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 1983లో టీడీపీ అవిర్భావంతో రాజకీయ ప్రవేశం చేసిన అయ్యన్న ఒకసారి ఎంపీగా, ఏడుసార్లు నర్సీపట్నం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయనకు మంత్రిగానూ పనిచేసిన అనుభవం ఉంది.

News June 22, 2024

మధ్యప్రదేశ్‌కు ఆడేందుకు ‘నో’ చెప్పిన విహారి

image

దేశవాళీ మ్యాచుల్లో మధ్యప్రదేశ్ తరఫున ఆడేందుకు భారత క్రికెటర్ హనుమ విహారి నో చెప్పారు. కోచ్ చంద్రకాంత్‌కు తన నిర్ణయాన్ని వెల్లడించి క్యాంపును వీడారు. గతంలో ACAతో వివాదం నెలకొనగా MP తరఫున ఆడాలని విహారి నిర్ణయించుకున్నారు. ఇప్పుడు అనూహ్యంగా తన డెసిషన్‌ను మార్చుకున్నారు. దీనిపై కోచ్ పండిత్ అసహనం వ్యక్తం చేశారు. కాగా విహారి తిరిగి ఆంధ్రా జట్టుతో చేరతారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

News June 22, 2024

డీఎస్సీకి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే?

image

TG: డీఎస్సీకి మొత్తం 2,79,956 దరఖాస్తులు వచ్చాయని విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో వచ్చిన దరఖాస్తులకు అదనంగా మరో లక్ష మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొంది. కాగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గురువారంతో అప్లికేషన్ ప్రక్రియ ముగిసింది. వచ్చే నెల 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

News June 22, 2024

బిల్ గేట్స్ హెల్త్ సీక్రెట్ ఇదే..

image

ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తానని మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్‌గేట్స్ ఓ పాడ్ కాస్ట్‌ ఇంటర్వ్యూలో తెలిపారు. విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటానన్నారు. పనిలో నిమగ్నమై ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దని, తరచూ పరీక్షలు చేయించుకోవాలని యువ వ్యాపారవేత్తలకు సూచించారు. దీంతో శరీరంలో ఏవైనా సమస్యలు తలెత్తితే ముందుగానే గుర్తించే వీలుంటుందన్నారు. రోజుకు 7-8 గంటలు నిద్ర పోవాలని తెలిపారు.

News June 22, 2024

కేటీఆర్‌కు సీఎం రేవంత్ కౌంటర్

image

TS: కేసీఆర్ సీఎంగా ఉండగానే కేంద్ర ప్రభుత్వం సింగరేణి గనులను తొలిసారి వేలం వేసిందని సీఎం రేవంత్ దుయ్యబట్టారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది కాంగ్రెస్ మాత్రమేనని <<13485306>>KTR<<>>కు కౌంటర్ ఇచ్చారు. పదేళ్లుగా తెలంగాణ ప్రజల మాటలను BRS పట్టించుకోలేదని ఆయన ట్వీట్ చేశారు. ORR, సింగరేణిని అమ్మేసిన వ్యక్తి ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బొగ్గు గనులను కాపాడి తీరుతామని సీఎం స్పష్టం చేశారు.

News June 22, 2024

పోలాండ్‌పై ఆస్ట్రియా ఘన విజయం

image

యూరో ఛాంపియన్‌షిప్ 2024లో పోలాండ్‌కు ఆస్ట్రియా షాకిచ్చింది. 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. తొలి అర్థభాగంలో ఇరు జట్లు చెరో గోల్ చేయగా, ద్వితీయార్థంలో ఆస్ట్రియా ప్లేయర్లు రెచ్చిపోయి మరో రెండు గోల్స్ చేశారు. మరోవైపు స్లొవేకియాతో జరిగిన మ్యాచులో ఉక్రెయిన్ 2-1తో గెలుపొందింది. ఇక టైటిల్ ఫేవరెట్లుగా ఉన్న ఫ్రాన్స్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది.

News June 22, 2024

హిందుజా కుటుంబంలోని నలుగురికి జైలు శిక్ష

image

భారత సంతతికి చెందిన బ్రిటన్ సంపన్న హిందుజా కుటుంబంలోని నలుగురికి శ్రమదోపిడి కేసులో జైలు శిక్ష పడింది. స్విట్జర్లాండ్‌లోని విల్లాలో పనిచేసే సిబ్బందిపై శ్రమదోపిడీకి పాల్పడ్డారనే కేసులో ప్రకాశ్ హిందుజా, ఆయన భార్య కమల్‌కు నాలుగున్నరేళ్లు, కుమారుడు అజయ్, కోడలు నమ్రతకు స్విస్ కోర్టు నాలుగేళ్ల చొప్పున జైలు శిక్ష ఖరారు చేసింది. కాగా కోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని హిందుజా తరఫు న్యాయవాది తెలిపారు.

News June 22, 2024

పరీక్షల్లో అక్రమాల నియంత్రణకు చట్టం: కేంద్రం

image

ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్(అక్రమాల నియంత్రణ)చట్టం 2024’ను కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. గత పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లుకు ఆమోదం పొందినట్లు పేర్కొంది. దీని ప్రకారం ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కనిష్ఠంగా 3-5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తుంది. వ్యవస్థీకృత మోసాలకు పాల్పడితే 5-10 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹కోటి జరిమానా విధించనుంది.

News June 22, 2024

జూన్ 22: చరిత్రలో ఈరోజు

image

1932: సినీ నటుడు అమ్రీష్ పురి జననం
1945: నాటక, సినీ రచయిత గణేష్ పాత్రో జననం
1952: చరిత్రకారుడు, సంస్కృతాంధ్ర పండితుడు చిలుకూరి నారాయణరావు మరణం
1972: తమిళ హీరో విజయ్ జననం
1974: నటి దేవయాని జననం
1994: తెలుగు సినీనిర్మాత, దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ మరణం
2016: రంగస్థల, సినిమా నటుడు J.V.రమణమూర్తి మరణం
* వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే