India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగ్లాదేశ్ బ్యాటర్ మహ్మదుల్లా క్రికెట్‌లో చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. అత్యధిక హ్యాట్రిక్‌లలో భాగమైన క్రికెటర్‌గా ఆయన నిలిచారు. మహ్మదుల్లా ఏకంగా 6 హ్యాట్రిక్‌లలో భాగమయ్యారు. మరే ఇతర బ్యాటర్ ఇలా ఇన్నిసార్లు హ్యాట్రిక్‌లలో భాగం కాలేదు. T20ల్లో 3, వన్డేల్లో 2, టెస్టుల్లో ఒకసారి హ్యాట్రిక్‌లో వికెట్ పారేసుకున్నారు. దీంతో ఇంతటి దురదృష్టవంతుడు ఇంకెవరైనా ఉంటారా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: జూన్ 22, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4:21 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:43 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:18 గంటలకు
అసర్: సాయంత్రం 4:55 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:53 గంటలకు
ఇష: రాత్రి 8.15 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
BJP పాలనలో పరీక్షల పేపర్ లీకేజీలు జాతీయ సమస్యగా మారాయని INC నేత ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. ఐదేళ్లలో ఏకంగా 43 పేర్లు లీకయ్యాయని ఆరోపించారు. కోట్లాది మంది యువత భవిష్యత్తును కమలం పార్టీ నాశనం చేసిందని విమర్శించారు. ‘వివిధ రకాల పరీక్షల కోసం రేయింబవళ్లు యువత కష్టపడుతోంది. తల్లిదండ్రులు అన్నీ త్యాగం చేసి వారి కోసమే బతుకుతున్నారు. పరీక్షల్లో అవకతవకలతో విద్యార్థుల శ్రమ వృథా అవుతోంది’ అని ఫైరయ్యారు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: జూన్ 22, శనివారం జ్యేష్ఠమాసం
శు.పౌర్ణమి: ఉ.06:37 గంటలకు
బ.పాడ్యమి: ఉ.05:13 గంటలకు
మూల: సా.05:54 గంటలకు
దుర్ముహూర్తం: ఉ.05:36-07:21 గంటల వరకు
వర్జ్యం: సా.04:20-05:54 గంటల వరకు
✒ CSIR UGC-నెట్ వాయిదా: NTA
✒ కేజ్రీవాల్ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే
✒ AP: MLAలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల ప్రమాణస్వీకారం
✒ AP: స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం
✒ AP: ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై పవన్ నిలదీత
✒ AP: మద్యంపై CBI విచారణ జరిపించాలి: పురందీశ్వరి
✒ TG: గనుల వేలంపై CM ఎందుకు ప్రశ్నించరు?: KTR
✒ రూ.2 లక్షల రైతు రుణమాఫీకి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
✒ INCలో చేరిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి
అప్పట్లో ఓ స్టార్ హీరో తనను డ్రైవర్ లేకుండా ఒంటరిగా కలవమని చెప్పినట్లు హీరోయిన్ ఇషా కొప్పికర్ తెలిపారు. కానీ తాను ఆయన విజ్ఞప్తిని తిరస్కరించానని చెప్పారు. ‘18 ఏళ్ల వయసులోనే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డా. నన్ను చాలా మంది అసభ్యంగా తాకేవారు. పని కావాలంటే హీరోలతో సన్నిహితంగా ఉండాలని కొందరు సలహాలిచ్చేవారు’ అంటూ ఆమె వాపోయారు. కాగా చంద్రలేఖ, ప్రేమతో రా, కేశవ సినిమాల్లో ఇషా నటించారు.
T20WC సూపర్-8లో ఇంగ్లండ్‌కు దక్షిణాఫ్రికా షాకిచ్చింది. సఫారీ బౌలర్లు చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన SA 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 163 పరుగులు చేసింది. సఫారీ బ్యాటర్లలో డికాక్(65), మిల్లర్(43) అదరగొట్టారు. ఛేదనలో ఇంగ్లండ్ 61కే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్రూక్(53), లివింగ్‌స్టోన్(33) పోరాడినా ఫలితం లేకపోయింది.
మరోసారి అఫ్గానిస్థాన్‌కు బీసీసీఐ అండగా నిలిచింది. బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌ను ఆ జట్టు భారత్‌లో ఆడేందుకు బీసీసీఐ అనుమతినిచ్చింది. అన్ని మ్యాచ్‌లూ నోయిడా స్టేడియం కాంప్లెక్స్‌లో జరగనున్నాయి. జులై 25 నుంచి ఆగస్టు 6 వరకు ఇరు జట్ల మధ్య 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా 2017లో ఐర్లాండ్-అఫ్గాన్ సిరీస్ కూడా ఇదే వేదికలో జరిగిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.