India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ ఒప్పుకుంటే అవినాశ్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారన్నారు. కానీ వైసీపీ ఎంపీలు అవసరం లేదని బీజేపీ పెద్దలు చెబుతున్నారని పేర్కొన్నారు. అయినా మిథున్ రెడ్డి లాబీయింగ్ చేస్తున్నారని చెప్పారు.
లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌పై ED పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి నియాయ్ బిందు అన్నారు. నిన్న కేజ్రీవాల్‌కు మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్‌లో పలు విషయాలు వెల్లడించారు. కేజ్రీవాల్ లేదా అతడి ప్రతినిధి విజయ్ నాయర్ నేరుగా అవినీతి పాల్పడ్డట్లు ED ఆధారాలు సమర్పించలేకపోయిందన్నారు. ఇదిలా ఉంటే ఆయనకు మంజూరైన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.
ఏపీలో మద్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని BJP స్టేట్ చీఫ్ పురందీశ్వరి సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. సింథటిక్ కెమికల్స్, ఇతర హానికర రసాయనాలతో తయారుచేసిన లిక్కర్ వల్ల లివర్, కిడ్నీలు తీవ్రంగా దెబ్బతింటాయని తెలిపారు. ఈ ప్రమాదకరమైన మద్యం వల్ల గత ఐదేళ్లలో 5 లక్షల మంది మరణించి ఉండొచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన మద్యం సరఫరా చేయాలని, వైన్ షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ తీసుకురావాలని కోరారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి’ సినిమా నుంచి సాయంత్రం 6 గంటలకు సెకండ్ ట్రైలర్ విడుదలకానుంది. ఈక్రమంలో మరో మూడు గంటల్లో రిలీజ్ ట్రైలర్ రాబోతోందని మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే ఓ ట్రైలర్ విడుదలవగా సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా ‘కల్కి’ థియేటర్లలో రిలీజ్ కానుంది.
క్రికెట్ వరల్డ్ కప్‌లలో అత్యధిక వికెట్లు(52 మ్యాచ్‌లలో 95) తీసిన బౌలర్‌గా మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించారు. ఇతను ODIWCలో 65, T20WCలో 30 వికెట్లు పడగొట్టారు. మలింగ(59M-94W)ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో షకీబ్ అల్ హసన్-బంగ్లాదేశ్(75M- 92W), ట్రెంట్ బౌల్ట్-న్యూజిలాండ్(47M-87W), మురళీధరన్-శ్రీలంక(49M-79W) ఉన్నారు.
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బౌలర్ మహ్మద్ షమీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. ‘అదంతా చెత్త ప్రచారం. అసలు ఇప్పటివరకు షమీని సానియా కలవనే లేదు’ అని స్పష్టం చేశారు. కాగా షోయబ్ మాలిక్-సానియా విడాకులు తీసుకోగా, భార్య హసీన్ జహాన్‌తో షమీ దూరంగా ఉంటున్నారు. దీంతో సానియా, షమీ త్వరలో ఒక్కటవ్వబోతున్నారంటూ నెట్టింట పుకార్లు మొదలయ్యాయి.
వడగాలుల ధాటికి తట్టుకోలేక ఉత్తరాది అవస్థలు పడుతున్న వేళ యూపీలోని కాన్పూర్‌కు చెందిన ఓ అడ్వొకేట్ ఇంద్రుడికి లేఖ రాశాడు. కొన్నిరోజులుగా భానుడి భగభగలు తట్టుకోలేక కాన్పూర్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అతుల్ సన్వారే పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలతో ఊరట కల్పించాలని వరుణుడిని వేడుకున్నాడు. అయితే వడగళ్ల వానను మాత్రం కురిపించొద్దని, అలాగే రోజూ గాలి వీచేలా వాయు దేవుడిని రిక్వెస్ట్ చేయమని కోరాడు.
TG: నూతన హెల్త్ పాలసీ మీద ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రిలో మెడికల్ ఓపీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఆరోగ్య పథకాల అమల్లో ఇబ్బందులను గుర్తిస్తాం. PHCలను బలోపేతం చేస్తాం. ప్రస్తుతం అన్ని చోట్లా ఇన్‌ఛార్జి పోస్టులే ఉన్నాయి. త్వరలో వాటిని పూర్తిస్థాయిలో భర్తీ చేస్తాం’ అని పేర్కొన్నారు.
TG: అరెస్ట్ చేసిన BRS మాజీ MLA బాల్క సుమన్‌ను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ‘BRS శ్రేణులు సీఎం కాన్వాయ్‌పై దాడి చేయలేదు. పోచారం ఇంటికి CM ఎందుకు వచ్చారో తెలుసుకునేందుకు వెళ్లారంతే. అంతమాత్రానికే అరెస్ట్ చేస్తారా?’ అని ప్రశ్నించారు. మరోవైపు బొగ్గు గనులు వేలం వేయడమంటే సింగరేణికి ఉరితాడు వేయడమేనని జగదీశ్ రెడ్డి అభివర్ణించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఓ దశలో 600కుపైగా పాయింట్లు కోల్పోయి కనిష్ఠంగా 76,895కు చేరింది. ప్రస్తుతం 480 పాయింట్ల నష్టంతో 77029 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ సైతం 23,390 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. 120 పాయింట్ల నష్టంతో ప్రస్తుతం 23448 వద్ద కొనసాగుతోంది. అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్, L&T వంటి బడా షేర్లు నష్టాలు నమోదు చేయడం మార్కెట్‌పై ప్రభావం చూపింది.
Sorry, no posts matched your criteria.