India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రైతు పక్షపాతిగా సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న మంచి పనులను మెచ్చి ఆయనను తన ఇంటికి ఆహ్వానించానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ‘రాజకీయంగా ఇంకా నేను ఆశించేది ఏం లేదు. నేను ఆశించేది రైతు సంక్షేమం మాత్రమే. ప్రభుత్వానికి అండగా ఉండి రైతు సంక్షేమం కోసం కృషి చేస్తా’ అని పోచారం వెల్లడించారు. పార్టీ మార్పుపై స్పందిస్తూ తన రాజకీయ ప్రయాణం కాంగ్రెస్‌తోనే మొదలైందన్నారు.
TG: పోచారం శ్రీనివాస్ రెడ్డి సలహాలు, సూచనలు ప్రభుత్వానికి అవసరమని CM రేవంత్ రెడ్డి తెలిపారు. ‘ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో రైతు సమస్యలపై తీసుకోనున్న కీలక నిర్ణయాల గురించి ఆయనతో చర్చించాం. మాకు అండగా ఉంటామని చెప్పారు. పార్టీలోని సీనియర్ల మాదిరే శ్రీనివాస్ రెడ్డికి ప్రాధాన్యం ఇస్తాం. ప్రభుత్వం చేపట్టే రైతు సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తారు’ అని సీఎం వివరించారు.
టీమ్‌ఇండియా పేస్ గన్ బుమ్రా విషయంలో బౌలింగ్ కోచ్ కూడా పెద్దగా జోక్యం చేసుకోరని సహచర బౌలర్ అక్షర్ పటేల్ వెల్లడించారు. బుమ్రాకు మ్యాచ్‌పై స్పష్టమైన అవగాహన ఉంటుందని.. ఎప్పుడు ఏం చేయాలో అతడికి బాగా తెలుసని అన్నారు. బౌలింగ్ కోచ్ కూడా ఎక్కువ ఇన్‌పుట్స్ ఇచ్చి అతడిని అనవసరంగా గందరగోళానికి గురిచేయరని పేర్కొన్నారు. బుమ్రాను తన వ్యూహాలకు అనుగుణంగానే బౌలింగ్ చేయమని ప్రోత్సహిస్తారని చెప్పుకొచ్చారు.
వాట్సాప్ ద్వారా జరుగుతున్న స్టాక్ మార్కెట్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ముంబైకి చెందిన ఓ 71ఏళ్ల వ్యక్తి ఈ వాట్సాప్ మోసాల ఉచ్చులో పడి రూ.2కోట్లు కోల్పోయారు. వాట్సాప్ ద్వారా ఫోన్ చేసి స్టాక్స్‌లో లాభాలు తెప్పిస్తామని ఆశచూపి గ్రూప్స్‌లో యాడ్ చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. బాధితుల్లో మాజీ బ్యాంక్ ఉద్యోగులు, సీఏలు సైతం ఉండటం గమనార్హం.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు మంజూరు చేసిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. నిన్న కేజ్రీవాల్‌కు బెయిల్ ఇస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పిచ్చింది. ఇవాళ ఆయన జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. ఈక్రమంలోనే దీన్ని సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. కాసేపట్లో పూర్తి వాదనలు విననుంది. అనంతరం తుది తీర్పు వెలువరించనుంది.
TG: తమిళనాడులో కల్తీ సారా తాగి 38మంది మరణించిన ఘటనపై మాజీ మంత్రి KTR స్పందించారు. రాష్ట్రంలో అలాంటి ఘటనలు జరగవని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం చీప్ లిక్కర్ బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టదని భావిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. మరోవైపు కల్తీ సారా ఘటన తమిళనాడు అసెంబ్లీని కుదిపేసింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ సభలో అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు.
విదేశాల్లోని భారతీయులు పెద్ద మొత్తంలో NRI డిపాజిట్ స్కీమ్స్‌లో మదుపు చేస్తున్నారు. ఏప్రిల్‌లో $1.08 బిలియన్లు డిపాజిట్ కావడంతో ఆ మొత్తం $152 బిలియన్లకు చేరినట్లు RBI వెల్లడించింది. ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ (బ్యాంక్స్)లో $26 బిలియన్లు, నాన్ రెసిడెంట్ ఎక్స్‌టెర్నల్ రూపీ అకౌంట్‌లో $99 బిలియన్లు, నాన్ రెసిడెంట్ ఆర్డినరీ డిపాజిట్ స్కీమ్స్‌లో $27 బిలియన్లు వెచ్చించినట్లు తెలిపింది.
AP: అటవీ సంపద పరిరక్షణ కోసం ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మడ అడవుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, వాటిని ధ్వంసం చేసే వారిని ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. అటు ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం కాకుండా పక్కాగా పరిరక్షించాలన్నారు. గ్రామాల్లో మరింత విస్తృతంగా అభివృద్ధి జరిగేలా ఈ పథకం వినియోగించుకోవాలని సూచించారు.
UGC నెట్ పశ్నపత్రం లీకైనట్లు గుర్తించిన కేంద్రం పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం పరీక్ష జరగ్గా సోమవారమే క్వశ్చన్ పేపర్లు డార్క్‌వెబ్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఒక్కో పేపర్‌ను రూ.5లక్షల నుంచి రూ.6లక్షలకు బేరానికి పెట్టారు. దీన్ని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గుర్తించి కేంద్ర విద్యాశాఖను అలెర్ట్ చేసింది. అసలు ప్రశ్నపత్రాలతో అవి సరిపోలడంతో పరీక్షను రద్దు చేశారు.
TG: గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సీతక్క తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల విద్యార్థుల దుస్తులు మహిళా సంఘాలే సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 15నాటికి విద్యార్థులకు రెండో జత స్కూల్ యూనిఫాంలు పంపిణీ చేస్తామని ఆమె వెల్లడించారు. అటు రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న మహిళాశక్తి క్యాంటీన్లు సైతం స్వయం సహాయక సంఘాలే నిర్వహిస్తాయని మంత్రి అన్నారు.
Sorry, no posts matched your criteria.