India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్రంలో దివ్యాంగులకు రిజర్వ్ చేసిన బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులను మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు. జిల్లా స్థాయి దివ్యాంగ కమిటీలు 3 నెలలకోసారి నిర్వహించాలన్నారు. ప్రభుత్వ సంస్థల్లోని ఉద్యోగాల్లో 4%, ఉన్నత విద్యాసంస్థల్లో 5% సీట్లు వారికి కేటాయిస్తున్నారా? లేదా వివరాలను సేకరించాలన్నారు. హిజ్రాల జీవనోపాధికి స్వయం సహాయక బృందాల ఏర్పాటును ప్రోత్సహించాలన్నారు.
AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేడ్కర్ కొనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో వానలు పడొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
తెలంగాణలో నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని TJS అధ్యక్షుడు ప్రొ.కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. ‘NCERT ముద్రించిన పాఠ్య పుస్తకాలకు బదులు సొంత పుస్తకాలను ముద్రించి విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లు విక్రయిస్తున్నాయి. ఆయా స్కూళ్ల గుర్తింపు రద్దు చేయవచ్చు. సొంత పుస్తకాలను రూ.10వేల నుంచి రూ.15వేలకు బలవంతంగా విద్యార్థులకు విక్రయిస్తున్నాయి’ అని విద్యాశాఖకు ఆయన లేఖ రాశారు.
AP: ‘జనసేన పార్టీ పెట్టి పదేళ్లు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయావ్. ప్రజలు నిన్ను నమ్మలేదు. అసెంబ్లీ గేటు కూడా తాకలేవు’ ఇలా వాగిన నోళ్లన్నీ మూతబడేలా పవన్ కళ్యాణ్ గ్రాండ్ విక్టరీ కొట్టారు. పార్టీ పోటీ చేసిన 21 చోట్లా గెలిచి రికార్డు సృష్టించారు. డిప్యూటీ సీఎం హోదాలో CM తర్వాత నేడు అసెంబ్లీలో MLAగా ప్రమాణం చేయనున్నారు. ఈ క్షణం కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నామంటూ జనసైనికులు ఎమోషనల్ అవుతున్నారు.
TG: రాష్ట్రంలో SC, ST, BC వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 16 కార్పొరేషన్లు, బోర్డుల కార్యకలాపాల ప్రారంభానికి కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం వివిధ కార్పొరేషన్లలో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులను కొత్తవాటిలో సర్దుబాటు చేసి, మిగిలిన పోస్టుల్లో సుమారు 300 కొత్త ఉద్యోగాల మంజూరుకు ప్రభుత్వానికి సంక్షేమ శాఖలు ప్రతిపాదనలు పంపనున్నాయి. బడ్జెట్ సమావేశాల్లోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని చూస్తున్నాయి.
TG: జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. స్టైఫండ్ సహా వివిధ సమస్యలను పరిష్కరించాలని నల్ల బ్యాడ్జీలు ధరించి నిన్నటి నుంచి నిరసనలు మొదలుపెట్టారు. తమ నిరసనలపై ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 24 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. ఉస్మానియా జనరల్ ఆస్పత్రి కోసం కొత్త భవనం, వైద్యుల కోసం కొత్త హాస్టల్ నిర్మించాలని, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
విదేశాల్లో యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని PM మోదీ అన్నారు. యోగా డే సందర్భంగా ఆయన శ్రీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నట్లు చెప్పారు. దీన్ని నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయని, ఓ మహిళకు పద్మశ్రీ పురస్కారం కూడా దక్కిందని గుర్తుచేశారు. యోగా ఇవాళ కోట్లమందికి దైనందిన కార్యక్రమం అయిందని వెల్లడించారు.
అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ నిలిచారు. అఫ్గాన్‌తో నిన్నటి మ్యాచులో ఈ ఘనత అందుకున్నారు. హిట్ మ్యాన్ 155 మ్యాచుల్లో 4,050 పరుగులు చేయగా, కింగ్ 121 మ్యాచుల్లోనే 4,066 పరుగులు చేశారు. ఓవరాల్‌గా పాక్ ప్లేయర్ బాబర్ ఆజమ్(4,145) తొలి స్థానంలో ఉన్నారు.
TG: పరిపాలన సౌలభ్యం దృష్ట్యా 15 రెవెన్యూ డివిజన్లలో RDOలకు బదులుగా IAS కేడర్ అధికారులను ప్రభుత్వం త్వరలోనే నియమించనుంది. ఉట్నూర్, భద్రాచలం, కాటారం, కామారెడ్డి, బాన్సువాడ, కల్లూరు, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, అచ్చంపేట, మిర్యాలగూడ, దేవరకొండ, భైంసా, బోధన్, నారాయణఖేడ్, తాండూరు రెవెన్యూ డివిజన్లలో త్వరలో IASలతో పాలన సాగనుంది. ఈ రెవెన్యూ డివిజన్‌లో ఎక్కువగా గిరిజన ప్రాంతాలే ఉన్నాయి.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా కేరళలోని త్రిసూర్(D) కలెక్టర్ కృష్ణతేజ రానున్నారు. పరిపాలనలో తనదైన మార్క్ చూపించాలనుకుంటున్న పవన్ ఏరికోరి ఆయనను నియమించుకుంటున్నారు. కృష్ణతేజను డిప్యుటేషన్‌పై పంపాలని CBN కేంద్రానికి లేఖ రాశారు. 2015 బ్యాచ్‌కి చెందిన కృష్ణతేజది పల్నాడు(D) చిలకలూరిపేట. కేరళలో పర్యాటకాభివృద్ధి, అలప్పుజ కలెక్టర్‌గా అద్భుత పనితీరుతో కేంద్ర అవార్డులు పొందారు.
Sorry, no posts matched your criteria.