India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు ఢిల్లీ బయలుదేరారు. ఎన్డీయే సీఎంల సమావేశంతో పాటు వాజ్‌పేయి శతజయంతి కార్యక్రమంలోనూ ఆయన పాల్గొననున్నారు. ఢిల్లీలోని నడ్డా నివాసంలో రేపు ఎన్డీయే కూటమి నేతలు సమావేశం కానున్న సంగతి తెలిసిందే. ఇటీవల వివాదాస్పదమైన పలు అంశాలు, బిల్లులపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది.

కూటమి ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ‘కూటమి పార్టీలు అనేక హామీలు ఇచ్చాయి. ఛార్జీలు తగ్గిస్తామంటూ ప్రచారం చేసి ఇప్పుడు రూ.15,485 కోట్ల భారాన్ని ప్రజలపై మోపాయి. ప్రభుత్వం అమరావతి కోసం రూ.30 వేల కోట్ల అప్పు చేసింది. ఆదాయం గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం అప్పులతోనే నడుస్తోంది. చంద్రబాబు ప్రజలమీద కసి తీర్చుకుంటున్నారు’ అని మండిపడ్డారు.

భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వెంకట దత్తసాయితో ఏడడుగులు నడిచిన ఆమె లవ్ సింబల్‌తో నాలుగు ఫొటోలను పంచుకున్నారు. దీంతో ఈ జంటకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆదివారం రాత్రి రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్‌లో వీరి వివాహం జరిగింది. ఇవాళ HYDలో రిసెప్షన్ జరగనుంది.

భారత్‌కు కెప్టెన్సీ చేయలేదన్న బెంగ తనకేమాత్రం లేదని భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపారు. ‘నాకు ఏది వర్కవుట్ అవుతుందో, ఏది కాదో తెలుసుకునేంత తెలివి నాకుంది. కెరీర్ ఆరంభంలోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కెప్టెన్సీ అవకాశం దక్కింది. కొన్ని టోర్నమెంట్లు గెలిపించాను. నాకు ఆ సామర్థ్యం ఉంది. కానీ భారత కెప్టెన్సీ అనేది నా చేతిలో లేని విషయం. అందుకే దాని గురించిన చింత లేదు’ అని స్పష్టం చేశారు.

క్రిస్మస్ వేడుకల ముంగిట ప్రయాణాలు పెట్టుకున్న అమెరికా పౌరులకు అమెరికన్ ఎయిర్‌లైన్స్ సంస్థ షాకిచ్చింది. తమ విమానాలన్నింటినీ ప్రస్తుతానికి నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. సాంకేతిక లోపమే దీనిక్కారణమని, సరిచేస్తున్నామని వివరించింది. అయితే.. సమస్య ఏమిటో, ఎప్పటిలోపు పరిష్కరిస్తారో సంస్థ అధికారులు చెప్పకపోవడంతో ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకున్న ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

క్యాన్సర్‌తో పోరాడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ డిశ్చార్జ్ అయ్యారు. ట్రీట్మెంట్‌కు అయిన బిల్‌ను పూర్తిగా చెల్లించలేకపోవడంతో డిశ్చార్జ్ చేయట్లేదని నిన్న అతని తల్లి సరస్వతి మీడియా ఎదుట వాపోయారు. ఈక్రమంలో NTR టీమ్ ఆ మొత్తాన్ని చెల్లించినట్లు తెలుస్తోంది. దీంతో కౌశిక్ డిశ్చార్జ్ అయినట్లు ఎన్టీఆర్ అభిమానులు Xలో పోస్టులు చేస్తున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఫిబ్రవరి 19న PAK vs NZ, 20న BAN vs IND, 21న AFG vs SA, 22న AUS vs ENG, 23న PAK vs IND, 24న BAN vs NZ, 25న AUS vs SA, 26న AFG vs ENG, 27న PAK vs BAN, 28న AFG vs AUS, మార్చి 1న SA vs ENG, 2న NZ vs IND, 4న సెమీఫైనల్-1, 5న సెమీఫైనల్-2, 9న ఫైనల్, 10న రిజర్వ్‌డ్ డేగా ప్రకటించారు.

ఢిల్లీలోని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో రేపు ఎన్డీయే నేతలు సమావేశం కానున్నారు. అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యల వివాదంపై ప్రధానంగా చర్చించనున్నారు. దాంతో పాటు జమిలి, వక్ఫ్ బిల్లులు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ షేరింగ్‌పైనా మాట్లాడుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కూటమిలోని సీనియర్లందరూ ఈ సమావేశానికి హాజరవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

స్విగ్గీ 2024కు సంబంధించిన నివేదికను విడుదల చేసింది. జనవరి 1 నుంచి నవంబర్ 22 వరకు 83 మిలియన్ల ఆర్డర్‌లతో బిర్యానీ అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకంగా నిలిచింది. అందులోనూ హైదరాబాద్‌లో అత్యధికంగా 9.7 మిలియన్లు, బెంగళూరులో 7.7Mn ఆర్డర్స్ వచ్చాయి. ఇక 23Mn ఆర్డర్లతో దోశ రెండో డిష్‌గా నిలిచింది. కాగా అర్ధరాత్రి 12-2 మధ్యలో అధికంగా బిర్యానీలే బుక్ అయ్యాయి. ఇంతకీ మీరేం ఆర్డర్ చేశారు?

శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన సేవల్ని అందిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హామీ ఇచ్చారు. ఈరోజు జరిగిన TTD ధర్మకర్తల మండలి సమావేశంలో ‘స్విమ్స్‌కు జాతీయ హోదాకు సిఫార్సు, అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీనివాసుడి ఆలయాల నిర్మాణం, ఒంటిమిట్ట కోదండ రామాలయ విమాన గోపురానికి రూ.43 లక్షలతో బంగారు కలశం, తిరుమలలో ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ విభాగం’ నిర్ణయాలను తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
Sorry, no posts matched your criteria.