News June 21, 2024

TODAY HEADLINES

image

✒ NEET పేపర్ రూ.30 లక్షలకు అమ్మకం
✒ NEET లీక్‌పై ఉన్నతస్థాయి కమిటీ: ధర్మేంద్ర ప్రధాన్
✒ తమిళనాడులో కల్తీ సారా తాగి 37 మంది మృతి
✒ AP: అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో మోకాళ్లపై CM
✒ AP: CM పదవికి అర్హత లేని వ్యక్తి జగన్: చంద్రబాబు
✒ AP: ఓటమి జస్ట్ ఇంటర్వెల్ మాత్రమే: జగన్
✒ తెలంగాణ గుండెల్లో జయశంకర్: CM రేవంత్
✒ TGకి విద్యాశాఖ మంత్రి కావలెను: BRS
✒ సింగరేణిని నాశనం చేసింది కేసీఆరే: భట్టి

News June 21, 2024

కర్ణాటకలో ఉండేవాళ్లు కన్నడ నేర్చుకోవాలి: CM సిద్ధరామయ్య

image

కర్ణాటకలో నివసించేవాళ్లంతా కన్నడ నేర్చుకోవాలని సీఎం సిద్ధరామయ్య సూచించారు. రాష్ట్రంలో కన్నడ సంస్కృతి ప్రతిబింబించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వారు మాతృభాషలోనే మాట్లాడుతారని ఆయన అన్నారు. విధాన సౌధలో నాదాదేవీ భువనేశ్వరి మాత కంచు విగ్రహ నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

News June 21, 2024

అఫ్గానిస్థాన్‌పై భారత్ విజయం

image

T20WC సూపర్-8లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచులో భారత్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఛేదనలో అఫ్గాన్ 134 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా, అర్ష్‌దీప్ తలో 3 వికెట్లు తీశారు.

News June 20, 2024

విరాట్ కోహ్లీ స్వార్థపరుడు: పాక్ మాజీ క్రికెటర్

image

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్వార్థపరుడని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ హఫీజ్ ఆరోపించారు. వ్యక్తిగత రికార్డుల కోసం కోహ్లీ జట్టు ప్రయోజనాలను తాకట్టు పెడతారని చెప్పారు. ‘2023 వన్డే WCలో SAపై కోహ్లీ సెంచరీ కోసమే ఆడారు. ఉద్దేశపూర్వకంగా పెద్ద షాట్లు ఆడలేదు. 90లలో ఉన్నప్పుడు ఎవరైనా బంతులు వృథా చేస్తే నేను అంగీకరించను. ఎప్పుడూ జట్టు గెలుపు దిశగానే ఆలోచించాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News June 20, 2024

కేజ్రీవాల్‌కు బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టుకు ఈడీ?

image

లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కాసేపటి క్రితం కేజ్రీవాల్‌కు రూ.లక్ష పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తూ వస్తోంది.

News June 20, 2024

యశస్విని మళ్లీ స్కూల్‌కు వెళ్లాలి: బీఆర్ఎస్ శ్రేణులు

image

TG: పాలకుర్తి MLA యశస్వినిరెడ్డి కశ్మీర్ లేని ఇండియా మ్యాప్ షేర్ చేశారని BRS శ్రేణులు ఆరోపిస్తున్నాయి. రాహుల్ గాంధీ‌కి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్‌ను ఆమె ట్విటర్‌లో షేర్ చేశారు. ఆ పోస్టర్‌లోని ఇండియా మ్యాప్‌లో కశ్మీర్ లేదని గ్రహించి ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి మరో పోస్ట్ చేశారని విమర్శలకు దిగాయి. దీంతో అసెంబ్లీ కన్నా ముందు ఆమె స్కూల్‌కు వెళ్లాలని సెటైర్లు వేస్తున్నాయి.

News June 20, 2024

భారత హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్?

image

జింబాబ్వే పర్యటనలో టీమ్ ఇండియా తాత్కాలిక హెడ్ కోచ్‌గా VVS లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జరిగే శ్రీలంక టూర్‌లో గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా ఛార్జ్ తీసుకోనున్నట్లు సమాచారం. దీనిపై BCCI నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా జింబాబ్వే టూర్‌కు IPL స్టార్లు సెలక్ట్ కానున్నట్లు టాక్. అభిషేక్, నితీశ్, పరాగ్, మయాంక్, యశ్ దయాల్, హర్షిత్ రాణాకు జట్టులో చోటు ఖాయమైనట్లు తెలుస్తోంది.

News June 20, 2024

YELLOW ALERT: రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

TG: ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 25 వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News June 20, 2024

బుమ్రాకు అభిమానినని గర్వంగా చెబుతా: ఆంబ్రోస్

image

బుమ్రా అసాధారణమైన బౌలర్ అని, అత్యంత ప్రభావం చూపించగల క్రికెటర్ అని విండీస్ దిగ్గజం కర్ట్‌లీ ఆంబ్రోస్ కొనియాడారు. అతనికి తాను పెద్ద అభిమానిననే విషయాన్ని గర్వంగా చెబుతానన్నారు. సాధారణ ఫాస్ట్ బౌలర్లతో పోలిస్తే బుమ్రా విభిన్నంగా ఉంటాడని చెప్పారు. టీమ్ ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడని పేర్కొన్నారు. గాయాల బారిన పడనంత వరకు అతను తన విలక్షణమైన బౌలింగ్ శైలిని మార్చుకోవద్దని సూచించారు.

News June 20, 2024

నెలరోజులపాటు బోనాల పండుగ: పొన్నం

image

TG: ఈ సారి నెలరోజులపాటు బోనాల పండుగ నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బోనాల సందర్భంగా ఆలయాలకు ఇచ్చే నిధులు పెంచనున్నట్లు చెప్పారు. ‘హైదరాబాద్ పరిధిలో 2400కుపైగా ఆలయాలు ఉన్నాయి. వాటన్నింటికీ నిధుల సహాయం చేస్తాం. అలాగే 28 ప్రముఖ ఆలయాలకు స్థానిక ప్రజాప్రతినిధులే పట్టు వస్త్రాలు సమర్పిస్తారు’ అని ఆయన పేర్కొన్నారు.