India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: బఫర్ జోన్, FTL పరిధిలో అక్రమ నిర్మాణాల కట్టడికి హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ఇక నుంచి అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇవ్వొద్దని ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులకు లేఖ రాసింది. రెండు రోజుల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ బ్యాంకర్లతో సమావేశమై సూచనలు చేయనున్నారు. దీని కోసం ఒక లీగల్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఇటీవల కూల్చిన అక్రమ కట్టడాలకు లోన్లు ఇచ్చిన బ్యాంకుల లిస్టును సిద్ధం చేశారు.
హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్‌పై 2 రోజులుగా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో మృతుల సంఖ్య 558కి పెరిగింది. ఈ మేరకు లెబనీస్ ఆరోగ్య శాఖ తెలిపింది. లెబనాన్ సరిహద్దుల నుంచి హెజ్బొల్లాను తరిమేందుకు అవసరమైనదంతా చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై జరిపిన దాడుల్లో ఏడుగురు మృతిచెందారు. వరుస దాడులతో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ అదృశ్యమయ్యాడు. అతని జాడ కోసం ఇజ్రాయెల్ వెతుకుతోంది.
AP: రాష్ట్రంలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది. గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని సవరించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రేపటిలోగా ఆర్టినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశముంది. దీంతో మొత్తం 3,736 మద్యం షాపుల కేటాయింపులకు రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసే ఛాన్స్ ఉంది.
దక్షిణ కొరియా జియోంగ్‌సాంగ్ ప్రావిన్స్‌లోని టోంగ్‌డోసా టెంపుల్ హుండీలో లెటర్‌తో పాటు 2 మిలియన్ వోన్ దర్శనమిచ్చాయి. లెటర్‌లో ఇలా రాసి ఉంది. ‘నా చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందులతో 1997లో ఆలయంలోని హుండీ నుంచి 30,000 వోన్ దొంగిలించా. దీనికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా. ఆ దేవుడికి క్షమాపణ చెప్పడంతో పాటు 2 మిలియన్ల వోన్‌ను (₹1.25 లక్షలు) విరాళమిస్తున్నా’ అని లేఖలో ఉంది.
AP: తిరుమల లడ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయడంపై ఆయన సోదరుడు, జనసేన నేత నాగబాబు ట్వీట్ చేశారు. ‘జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాన్ని పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్తం చేసి కడిగేస్తున్నాడు’ అని పేర్కొన్నారు.
అతిపెద్ద రెయిన్‌ఫారెస్ట్ ‘అమెజాన్’ తరిగిపోతోంది. గత నాలుగు దశాబ్దాల్లో అటవీ నిర్మూలనతో ఏకంగా జర్మనీ & ఫ్రాన్స్‌ల పరిమాణమంత అడవిని కోల్పోయిందని ఓ అధ్యయనం తెలిపింది. ప్రధానంగా మైనింగ్ & వ్యవసాయం కోసం 1985- 2023 మధ్య అటవీ నిర్మూలన జరిగింది. 88 మిలియన్ హెక్టార్ల అడవిని కోల్పోవడం ఆందోళనకరం. అమెజాన్‌లో వృక్షసంపద కోల్పోతే అనేక దక్షిణ అమెరికా దేశాల్లో కరవు ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
AP: తొలి విడత నామినేటెడ్ పోస్టుల భర్తీతో టీడీపీలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇద్దరు పార్టీ అధికార ప్రతినిధులు రాజీనామా చేసే అవకాశముందని సమాచారం. వారికి పదవులు ఇవ్వకపోవడంతో పాటు భవిష్యత్‌పై హైకమాండ్ భరోసా ఇవ్వకపోవడంతో నిరాశకు గురైనట్లు వార్తలొస్తున్నాయి. కాగా మొత్తం 99 నామినేటెడ్ పోస్టులకు గాను తొలి విడతలో 20 మంది పేర్లను ప్రభుత్వం ప్రకటించింది.
AP: తిరుమల లడ్డూ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి IPS ఆఫీసర్ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠిని చీఫ్‌గా నియమించింది. ప్రస్తుతం ఆయన గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్నారు. సిట్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. ఈ నెల 27న థియేటర్లలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లో బుకింగ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. నిమిషాల వ్యవధిలోనే కొన్ని థియేటర్లలో టికెట్లు అయిపోగా పలు చోట్ల టికెట్లు ఉన్నా బుక్ అవట్లేదని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమాను మొదటి రోజే చూడాలని వెయిట్ చేస్తున్నామని అంటున్నారు.
AP: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. కామన్ వెరైటీ ధాన్యానికి రూ.2,300, గ్రేడ్ ఏ రకానికి రూ.2,320 కనీస మద్దతు ధర చెల్లించాలని పేర్కొంది. రైతు సేవా, ధాన్యం సేకరణ కేంద్రాలు, ఈకేవైసీ వంటి వాటి ద్వారా కొనుగోళ్లు చేయాలని ఆదేశించింది. ఈ సీజన్‌లో 37 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.
Sorry, no posts matched your criteria.