News September 24, 2024

రైతు భరోసా కాదు.. సీఎం కుర్చీకే భరోసా లేదు: కేటీఆర్

image

TG : హైదరాబాద్‌లో సీఎం రేవంత్ సోదరుడికి ఓ న్యాయం, సామాన్యులకు ఓ న్యాయమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే అందరికీ ఒకటే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘త్వరలో 10 చోట్ల ఉప ఎన్నికలు తప్పవు. డ్రామాలతో ఎక్కువ కాలం రాజకీయం నడవదు. మేం నిర్మాణాలు చేస్తే, కాంగ్రెస్ వాటిని కూల్చుతోంది. రైతు భరోసా కాదు.. సీఎం కుర్చీకే భరోసా లేదు’ అని ఆయన సెటైర్లు వేశారు.

News September 24, 2024

అప్పుడు త్యాగాలు.. ఇప్పుడు పదవులు: టీడీపీ శ్రేణులు

image

AP: పార్టీ కోసం కష్టపడ్డ వారికి నామినేటెడ్ <<14181792>>పదవులు<<>> దక్కినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. వారికి సీఎం చంద్రబాబు న్యాయం చేశారని అంటున్నాయి. పొత్తులో భాగంగా తమ స్థానాలను వదులుకోవడం, పార్టీకి ఆర్థికంగా అండగా ఉండడం, పార్టీ వాయిస్‌ను బలంగా వాదించిన వారికి పదవులు దక్కాయని సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. నారాయణ, పీతల సుజాత, దామచర్ల సత్య, దీపక్ రెడ్డి, రామరాజు వంటి వారు ఉన్నారు.

News September 24, 2024

కీచక ప్రిన్సిపల్.. చిన్నారిని చంపి స్కూల్‌లోనే పాతిపెట్టి..

image

గుజరాత్‌లోని దాహోద్‌లో ఘోరం జరిగింది. ప్రిన్సిపల్ గోవింద్ నట్(55) ఓ విద్యార్థిని(6)ని స్కూల్‌కు తీసుకెళ్లేందుకు చిన్నారి ఇంటి వద్ద కారులో ఎక్కించుకున్నాడు. అత్యాచారానికి ప్రయత్నించగా చిన్నారి ప్రతిఘటించింది. దీంతో ఆమెను ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. డెడ్‌బాడీని కారులోనే ఉంచి స్కూల్‌కి వెళ్లాడు. సాయంత్రం పాఠశాల ప్రాంగణంలో పాతిపెట్టాడు. దర్యాప్తులో నేరం ఒప్పుకోకపోయినా ఫోన్ లొకేషన్‌తో నిజం బయటపడింది.

News September 24, 2024

ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ

image

AP: రాష్ట్ర ప్రభుత్వం పలు నామినేటెడ్ <>పోస్టులను <<>>భర్తీ చేసింది. ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణ, వక్ఫ్ బోర్డు ఛైర్మన్- అబ్దుల్ హజీజ్, శాఫ్ ఛైర్మన్‌గా రవి నాయుడు, గృహనిర్మాణ బోర్డు ఛైర్మన్‌-తాతయ్య నాయుడు, మారిటైమ్ బోర్డు ఛైర్మన్-సత్య, 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్-లంకా దినకర్, మార్క్ ఫెడ్ ఛైర్మన్-కర్రోతు బంగార్రాజు, ట్రైకార్ ఛైర్మన్-శ్రీనివాసులు, ఏపీఐఐసీ ఛైర్మన్-మంతెన రామరాజులను నియమించింది.

News September 24, 2024

తెలుగులోకి వ‌చ్చేసిన సూప‌ర్ హిట్ మూవీ

image

బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘కిల్’ మూవీ తెలుగులో ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. లక్ష్య, తాన్య, రాఘవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ థ్రిల్లర్ మూవీ జులై 5న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 6 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఇవాళ్టి నుంచి తెలుగు, తమిళం వెర్షన్లలో కూడా అందుబాటులోకి రావడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.

News September 24, 2024

ఆల్కహాల్ సేవించాక ఇంగ్లిష్‌లో ఎందుకు మాట్లాడతారు?

image

ఈ విషయాన్ని ఎప్పుడైనా గమనించారా? ఇలాంటివి మీకు తెలిసిన వారిలో ఎవరో ఒకరు చేసుంటారు. అయితే, దీని వెనుక సైన్స్ ఉందని సైకోఫార్మాకాలజీ జర్నల్‌లో ప్రచురించారు. ‘మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మాతృభాష కంటే కూడా రెండో భాష, ప్రత్యేకించి ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంటారు. దానిపైనే తక్కువ పట్టు ఉందనే ఆందోళనను దరిచేరనీయరు. అదేవ్యక్తి మత్తు తగ్గాక ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు సంకోచిస్తారు’ అని జర్నల్‌లో ఉంది.

News September 24, 2024

కర్ణాటక CM సిద్దరామయ్యకు షాక్

image

ముడా కుంభకోణం వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది. దర్యాప్తు కోసం గవర్నర్ ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూ కేటాయింపుల విషయంలో ఖరీదైన భూములను తన భార్య పార్వతికి దక్కేలా సిద్దరామయ్య కుట్ర చేశారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై విచారణకు గవర్నర్ ఆదేశించారు.

News September 24, 2024

భారత్, చైనా ఫైట్‌లో సాండ్‌విచ్ అవ్వలేం: దిసనాయకే

image

జియో పొలిటికల్ రైవల్రీకి శ్రీలంకను దూరంగా ఉంచుతానని ప్రెసిడెంట్ దిసనాయకే అన్నారు. పొరుగు దేశాలతో సంబంధాల్లో సమతూకం పాటిస్తానని చెప్పారు. ‘ఆ ఫైట్‌కు మేం దూరంగా ఉంటాం. అలాగే ఏదో ఒక పక్షం వైపు ఉండం. ప్రత్యేకించి భారత్, చైనా మధ్య సాండ్‌విచ్ అవ్వలేం. ఆ 2 మాకు మిత్రదేశాలే. అవి మరింత దగ్గరవ్వాలని కోరుకుంటున్నాం. EU, మిడిల్ఈస్ట్, ఆఫ్రికాతో సంబంధాలు కొనసాగిస్తాం’ అని తన ఫారిన్ పాలసీ గురించి వివరించారు.

News September 24, 2024

మా బౌలర్లు అహంకారులు: పాక్ మాజీ పేసర్

image

తమ దేశ బౌలర్లు తామే గొప్ప అనే భావనలో ఉంటారని పాకిస్థాన్ మాజీ పేసర్ బాసిత్ అలీ అన్నారు. అందుకే మోర్నే మోర్కెల్‌ను చిన్న చూపు చూసి పక్కనపెట్టారని మండిపడ్డారు. ‘భారత్, పాక్ ఆటగాళ్ల మైండ్ సెట్ వేరు. పాక్‌ను వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్‌ను టీమ్ ఇండియా చిత్తు చేసింది. పాక్ ఒత్తిడికి గురైంది. భారత్ కాలేదు. మోర్కెల్ కోచింగ్‌ను టీమ్ ఇండియా బౌలర్లు ఆస్వాదిస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

News September 24, 2024

BISలో 315 ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

ప్రభుత్వ రంగ సంస్థ బ్యూరో స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియాలో 315 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. సీనియర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, పర్సనల్ అసిస్టెంట్ విభాగాల్లో ఖాళీలున్నాయి. అభ్యర్థులు SEP 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. విద్యార్హత, వయో పరిమితి, జీతభత్యాల వివరాల కోసం ఈ <>లింక్‌<<>>పై క్లిక్ చేయండి.