India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్రం రూ.80.10 కోట్లను విడుదల చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. దీనికి అదనంగా రాష్ట్రప్రభుత్వం రూ.53.40 కోట్ల ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 59,261 ఎకరాలలో కొత్తగా ఆయిల్ పామ్ సాగులోకి వచ్చినట్లు చెప్పారు. పలు కారణాలతో పెండింగ్‌లో ఉన్న రూ.100.76 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు.
ఈ నెల 21న ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీనగర్‌లో జరిగే కార్యక్రమంలో 9వేల మందితో కలిసి యోగా చేస్తారని మీడియాకు తెలిపారు. 20 జిల్లాల నుంచి 2వేల మంది చొప్పున వర్చువల్‌గా పాల్గొనేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది జమ్మూకశ్మీర్‌వ్యాప్తంగా మంచి ప్రభావం చూపిస్తుందని ఆకాంక్షించారు.
యూరో ఛాంపియన్ షిప్-2024లో క్రిస్టియన్ రొనాల్డో టీమ్ పోర్చుగల్ ఖాతా తెరిచింది. చెక్ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచులో 2-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. తొలి అర్థభాగంలో ఇరు జట్లు ఒక్క గోల్ నమోదు చేయలేదు. ద్వితీయార్ధంలో రెచ్చిపోయిన పోర్చుగల్ ప్లేయర్లు రెండు గోల్స్ చేశారు. మరో మ్యాచులో జార్జియాపై 3-1తో తుర్కియే గెలుపొందింది.
బిహార్‌లో ప్రారంభించక ముందే కుప్పకూలిన బ్రిడ్జి <<13463723>>ఘటన<<>>పై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయం స్పందించింది. ఆ బ్రిడ్జి నిర్మాణం కేంద్ర ప్రభుత్వం పరిధిలో లేదని, బిహార్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్మించిందని స్పష్టం చేసింది. దీంతో పలువురు కేంద్ర మంత్రిపై విమర్శలకు దిగారు. ఆ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉందని గుర్తు లేదా అని కామెంట్లు చేస్తున్నారు.
హరియాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, MLA కిరణ్ చౌదరి కూతురు శృతితో కలిసి పార్టీకి రాజీనామా చేశారు. కుమార్తెకు లోక్‌సభ సీటు ఇవ్వలేదని పార్టీపై కొంతకాలంగా కిరణ్ అసంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రంలో పార్టీ నేతల దౌర్జన్యం ఎక్కువైందని రాజీనామా లేఖలో ఆరోపించారు. ఇవాళ కూతురితో సహా ఆమె బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా హరియాణా లోక్‌సభ ఎన్నికల్లో 9 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 5చోట్ల గెలిచింది.
అభిమానిని కొట్టబోయిన <<13462747>>ఘటన<<>>లో పాక్ బౌలర్ హారిస్ రవూఫ్‌కు తోటి ఆటగాళ్లు రిజ్వాన్, హసన్ అలీ మద్దతుగా నిలిచారు. అభిమాని పాకిస్థానీనా భారతీయుడా అన్నది అప్రస్తుతమని రిజ్వాన్ ట్వీట్ చేశారు. అసలు విషయం ఏంటంటే ఆ అభిమానికి ఇతరుల పట్ల ఎలాంటి మర్యాద లేదన్నారు. ఒక వ్యక్తిని, అతని కుటుంబాన్ని అగౌరవపరిచే హక్కు ఎవ్వరికీ లేదని చెప్పారు. ఇలాంటి ప్రవర్తనను మానుకోవాలని హితవు పలికారు.
కల్కి ట్రైలర్‌ను హాలీవుడ్ చిత్రాలతో పోలుస్తూ ఓ యూట్యూబర్ ఇచ్చిన రివ్యూపై హీరో విశ్వక్ సేన్ మండిపడ్డారు. ఇలాంటి వారు పైరసీ కన్నా డేంజర్ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. సినిమా రిలీజ్ అవ్వకముందే ఆదాయం కోసం యూట్యూబ్‌లో సమీక్షలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి అభిప్రాయాలు చెప్పేవారు ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలని సవాల్ చేశారు. అప్పుడైనా సినీ కార్మికుల కష్టాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. రాజీనామాను స్పీకర్ ఆమోదించారని లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటన విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచిన రాహుల్ వయనాడ్ నుంచి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నట్లు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.
1945 : మయన్మార్ మాజీ అధ్యక్షురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అంగ్ సాన్ సూకీ జననం
1970: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ జననం
1985: ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ జననం
2001: తెలుగు సినిమా దర్శకుడు, మాటల రచయిత జంధ్యాల మరణం
2018: మిమిక్రీ కళాకారుడు, పద్మశ్రీ గ్రహీత నేరెళ్ళ వేణుమాధవ్ మరణం
కన్నడ హీరో దర్శన్ తన అభిమాని రేణుకా స్వామిని హత్య చేసిన అనంతరం పబ్‌కు వెళ్లి ఎంజాయ్ చేసినట్లు పోలీసుల సీన్ రీక్రియేషన్‌లో తెలిసింది. హత్య తర్వాత తన స్నేహితులతో కలిసి ట్రెండ్స్‌లో కొత్త బట్టలు కొని, రక్తంతో తడిచిన బట్టలు తీసేసి అవి ధరించారు. ఆ తర్వాత ఆయన పబ్‌కు వెళ్లి పార్టీ చేసుకున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
Sorry, no posts matched your criteria.