India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
BJP-RSS దేశంలో విద్వేషాన్ని, హింసను వ్యాప్తి చేస్తున్నాయని రాహుల్ గాంధీ మండిపడ్డారు. వారు ఎక్కడికి వెళ్లినా కులాలు, మతాలు, రాష్ట్రాలు, భాషల మధ్య విభేదాలు సృష్టించి, సంఘర్షణను ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. పూంచ్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ద్వేషాన్ని ప్రేమతో మాత్రమే అధిగమించవచ్చని, ఒకవైపు ద్వేషం పెంచేవారు(BJP-RSS), మరోవైపు ప్రేమను పంచేవారు(కాంగ్రెస్) ఉన్నారని రాహుల్ అన్నారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డు పొందడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నేనెప్పుడూ ఊహించలేదు. నాకు అవకాశాలు ఇచ్చిన నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, కొరియోగ్రాఫర్‌లు, నా డాన్స్ మెచ్చిన సినీ ప్రేక్షకుల వల్లనే ఇది సాధ్యమైంది. నాకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. నా డాన్స్ ఇష్టపడిన ప్రతి ఒక్కరికీ ఇది అంకితం’ అని ట్వీట్ చేశారు.
AP: ముంబై నటి జెత్వానీని వేధించిన కేసులో పోలీసులు ఐదుగురిని నిందితులుగా చేర్చారు. వీరిలో ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. ఏ1 కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో ఏ2గా పీఎస్ఆర్ ఆంజనేయులు, ఏ3గా కాంతిరాణా, ఏ4గా అప్పటి వెస్ట్ జోన్ ఏసీపీ హనుమంతురావు పేర్లను నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పటికే వీరిని ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి PM మోదీ నిబద్ధతను పంచుకుంటానని శ్రీలంక కొత్త ప్రెసిడెంట్ దిసనాయకే అన్నారు. తనకు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు చెప్పారు. ‘మీ మంచి మాటలు, మద్దతుకు థాంక్స్. మన 2 దేశాల బంధం బలోపేతానికి కృషిచేస్తాను. మన ప్రజలు, మన ప్రాంత ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దాం’ అని పేర్కొన్నారు. భారత నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ, సాగర్ విజన్లో శ్రీలంకది ప్రత్యేక స్థానమని మోదీ ట్వీట్ చేశారు.
ట్రైన్‌లోకి ఎక్కిన ఓ ఉడత వల్ల ఏకంగా రైలు రద్దయింది. బ్రిటన్‌లోని గోమ్‌షాల్ స్టేషన్‌లో 2 ఉడతలు రైలు ఎక్కాయి. అటుఇటు పరిగెత్తడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. ‘టికెట్ లేకుండా రైలెక్కి నిబంధనలు ఉల్లంఘించాయి. రైలు నుంచి దింపేందుకు ఎంత ప్రయత్నించినా అందులో ఒకటి దిగలేదు. దీంతో రైలును నిలిపివేశాం’ అని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటన సెప్టెంబర్ 14న జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది.
AP: దేవుడితోనూ గత ప్రభుత్వం వ్యాపారం చేసిందని హోంమంత్రి అనిత మండిపడ్డారు. స్వామి విషయంలో తప్పుగా వ్యవహరించిన వారికి పుట్టగతులు ఉండవని చెప్పారు. ధర్మవరంలో నిర్వహించిన ప్రజావేదికలో ఆమె మాట్లాడారు. ఎంతో విశిష్టత ఉన్న లడ్డూ తయారీలో కల్తీ పదార్థాలు వాడారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వంలో లడ్డూ నాణ్యత పెరిగిందని చెప్పారు.
జస్ప్రీత్ బుమ్రా అన్ని ఫార్మాట్లలోనూ బెస్ట్ ఫాస్ట్ బౌలరని ఆసీస్ ప్లేయర్ స్టీవ్‌స్మిత్ పొగిడారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమ్ఇండియా గెలవాలంటే ఆయనే కీలకమన్నారు. ‘కొత్త, పాత, మరీ పాత బంతుల్లో నేనెలాంటివి ఆడినా బుమ్రా ఓ అద్భుత బౌలర్. కొత్త, పాత బంతితో నైపుణ్యం ప్రదర్శిస్తారు. టెస్టు, వన్డే, టీ20ల్లో ఆయనే బెస్ట్ ఫాస్ట్ బౌలర్. ఆయన్ను ఎదుర్కోవడం సవాలే’ అని చెప్పారు. NOV 22 నుంచి BGT మొదలవుతుంది.
AP: తిరుమల నెయ్యి వివాదంపై CBI లేదా జుడీషియల్ కమిషన్ ద్వారా విచారణ జరిపించాలని జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ లక్ష్మీ నారాయణ అన్నారు. ‘కిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి తయారీకి రూ.1500-2100 ఖర్చవుతుంది. ఇంత కంటే తక్కువ రేటుకు వచ్చే ఏ నెయ్యిలోనైనా కూరగాయల/జంతువుల కొవ్వులు/రసాయనాలను కలుపుతారు. అందుకే ఆలయాల్లో గోశాలలు ఏర్పాటు చేయాలి. వాటి ద్వారా స్వచ్ఛమైన నెయ్యి పొందవచ్చు’ అని ట్వీట్ చేశారు.
TG: హైదరాబాద్‌లోని దుర్గం చెరువు పరిసర నివాసితులకు హైకోర్టులో ఊరట లభించింది. అక్కడ హైడ్రా కూల్చివేతలు చేపట్టవద్దని కోర్టు స్టే ఇచ్చింది. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నివాసితులు హాజరు కావాలని ఆదేశించింది. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని అక్టోబర్ 4 నుంచి 6 వారాల్లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పింది.
శ్రీసింహా కోడూరి, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘మత్తు వదలరా-2’ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. దీంతో సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. పదిరోజుల్లో ఈ సినిమాకు రూ.30.1 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతోపాటు అమెరికాలోనూ $1 మిలియన్ దాటేసినట్లు తెలిపారు. ఈ సినిమాను రితేశ్ రాణా తెరకెక్కించారు.
Sorry, no posts matched your criteria.