India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఇటీవల పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ వేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
31 MQ-9B ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు సిద్ధమైన భారత్‌ను అమెరికా స్వాగతించింది. $3.9 బిలియన్ల విలువైన ఈ అగ్రిమెంట్‌పై అక్టోబర్ లోపు 2 దేశాలూ సంతకాలు చేస్తాయని అంచనా. అధునాతన ఆయుధ వ్యవస్థల కో-ప్రొడక్షన్, ఇంటెలిజెన్స్, టెక్నాలజీ షేరింగ్ ఇందులో భాగం. చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు వీటిని వాడతారని తెలిసింది. నేవీకి 15 సీ గార్డియన్స్, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కు 16 స్కై గార్డియన్స్ డ్రోన్లు అందిస్తారు.
ఇండియాలో జరగబోయే కోల్డ్‌ప్లే కన్సర్ట్ టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంది. టికెట్లు రిలీజయ్యే సమయంలో 1.3 కోట్ల మంది లాగిన్ అవ్వడంతో బుక్ మై షో వెబ్‌సైట్ క్రాష్ అయింది. దీంతో టికెట్స్ అందించేందుకు వెబ్‌సైట్ క్యూ సిస్టమ్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం 10 లక్షల మంది క్యూ సిస్టమ్‌లో టికెట్ల కోసం వేచి చూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 18,19 తేదీల్లో ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో ఈ కన్సర్ట్ ఉండనుంది.
TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. అటు రాష్ట్రంలో నేడు, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, NLG, MHBD, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, ఉమ్మడి MBNR జిల్లాల్లో ఈ రోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది.
TG: ఆస్పత్రుల్లో వైద్య, ఆరోగ్య సేవలపై అధ్యయనం చేసేందుకు వెళ్లకుండా తమ నేతలను పోలీసులు అడ్డుకోవడాన్ని కేటీఆర్ ఖండించారు. ‘సమస్యలు తెలుసుకునేందుకు మా నేతలు వెళ్తున్నారు. వెంటనే వారిని విడుదల చేయాలి. రాజకీయాలకు అతీతంగా మా నేతలు ఆస్పత్రులను పరిశీలిస్తారు. ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా లోపాలు ఎత్తి చూపుతాం’ అని KTR స్పష్టం చేశారు.
UPలోని బాఘ్‌పట్‌లో ఓ కోతుల గుంపు ఆరేళ్ల బాలికను అత్యాచారం నుంచి కాపాడింది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని దుండగుడు ఓ పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి దుస్తులు తొలగించాడు. అత్యాచారం చేయబోతుండగా కోతుల గుంపు వచ్చి అతడిని తరిమి వేసింది. దీంతో అతడు ఆ బాలికను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.
AP: నీళ్లు అనుకుని యాసిడ్ తాగి ఏడాదిన్నర పాప చనిపోయిన ఘటన కలిచివేసింది. మచిలీపట్నంకు చెందిన అబ్బాస్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఈ నెల 19న విజయవాడలోని అత్తగారింటికి వచ్చారు. చిన్నకూతురు ఆఫియా(18 నెలలు) ఆడుకుంటూ స్నానాల గదిలోకి వెళ్లి అక్కడి యాసిడ్ సీసా మూత తీసి తాగింది. వాంతులు చేసుకుంటున్న పాపను గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గత రాత్రి ఆఫియా కన్నుమూసింది.
AP: తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని రాజ్యసభ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని జంతువుల మాంసం, ఇతర కుళ్లిపోయిన వస్తువులతో కల్తీ చేశారని CBN చేసిన ఆరోపణలు భక్తులను గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు. చంద్రబాబు ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని ఆయన సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఆస్కార్స్-2025కు భారత్ నుంచి హిందీ సినిమా ‘లాపతా లేడీస్’ను పంపనున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో ఈ సినిమా పోటీ పడనుంది. కిరణ్ రావు డైరెక్ట్ చేసిన ఈ మూవీని అమీర్ ఖాన్, జ్యోతి దేశ్‌పాండ్ నిర్మించారు. మార్చిలో విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఆగకుండా 45 నిమిషాల పాటు నడవగలిగితే మీ గుండె ఆరోగ్యంగా ఉన్నట్లేనని ముంబై లీలావతి హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డా.రవీందర్ తెలిపారు. అయితే వయసు, లింగాన్ని బట్టి కొన్ని మార్పులుంటాయన్నారు. ‘కొందరు గంటలో 6KMS నడిస్తే, మరికొందరు అంతకంటే తక్కువగా నడుస్తారు. కానీ ఆగకుండా నడుస్తున్నారంటే వారి గుండె ఆరోగ్యంగా ఉన్నట్లే. అందుకే చెడు అలవాట్లను వదిలి, రోజూ నడవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది’ అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.