India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు. దీపావళి నుంచి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసేందుకు వారికి రూ.5-10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. అటు అన్న క్యాంటీన్ల ద్వారా ఆకలి కేకలు లేకుండా పేదలకు మూడు పూటలా ఆహారం అందుతుందన్నారు.
పండుగల సమయాల్లో టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించే వారిపై రైల్వేశాఖ ఫోకస్ పెట్టింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువగా పోలీసులే ఉన్నట్లు గుర్తించిన రైల్వే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అలాంటి వారిపై రైల్వే యాక్ట్ 1989 ప్రకారం చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం వచ్చే నెల 1 నుంచి 15 వరకు, 25 నుంచి నవంబర్ 10 వరకు తనిఖీలు నిర్వహించనుంది.
TG: గోండిలిపి పండితుడు కోట్నాక్ జంగు(86) అనారోగ్యంతో మృతి చెందారు. ఆదిలాబాద్(D) నార్నూర్(మ) గుంజాల గ్రామంలో తుదిశ్వాస విడిచారు. పూర్వీకుల నుంచి గోండిలిపి నేర్చుకున్న ఆయన లిపికి సంబంధించిన ప్రతులు దాచారు. గోండు చిన్నారుల కోసం గోండి-తెలుగు వాచకాలను ప్రచురించి విద్యాబోధన చేశారు. 2014లో గుంజాలలో గోండిలిపి అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయడంలో జంగు ప్రముఖుడు. ఆయన మృతిపై గోండు పెద్దలు సంతాపం వ్యక్తం చేశారు.
న్యూయార్క్‌లో జరుగుతున్న సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్ సందర్భంగా పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. గాజాలో మానవతా సంక్షోభం, క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనా ప్రజలకు భారత్ మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. పాలస్తీనాను గుర్తించిన మొదటి దేశాల్లో భారత్ ఒకటని గుర్తుచేసిన మోదీ, UNలో ఆ దేశ సభ్యత్వానికి మద్దతు తెలియజేశారు.
ప్రశాంతమైన HYDలో మళ్లీ ఉగ్రమూలాలు బయటపడ్డాయి. ఐసిస్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది రిజ్వాన్ అలీ సైదాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో గతంలో అద్దెకున్నాడని తెలిసి, NIA నిన్న సోదాలు చేసింది. అద్దెకిచ్చిన యజమానిని ప్రశ్నించింది. ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ సాయంతో రిజ్వాన్ HYD వచ్చి కేరళ, UPలకు రాకపోకలు సాగించాడు. AUG 15న దేశంలో భారీ విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేసి ఢిల్లీ పోలీసులకు దొరికిపోయాడు.
AP: విజయవాడలో ఆపరేషన్ బుడమేరును చేపట్టేందుకు అధికారులు ముమ్మరంగా అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఆక్రమణల వివరాలు సేకరిస్తున్నారు. ఎ.కొండూరు నుంచి విజయవాడ వరకు 40 గ్రామాల పరిధిలో 2,700 ఎకరాల్లో బుడమేరు ప్రవహిస్తోంది. ఇందులో 270 ఎకరాల మేర ఆక్రమణలకు గురైనట్లు కలెక్టర్ సృజన తెలిపారు. 3వేల గృహాలు, 80 నిర్మాణాలను గుర్తించామన్నారు. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఆపరేషన్ చేపడతామన్నారు.
TG: అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, మరో తీపికబురు అందించింది. రేషన్ కార్డు ఉన్న వారు రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా సరకులు తీసుకోవచ్చని CLP సమావేశంలో CM రేవంత్ ప్రకటించారు. త్వరలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకొస్తున్నామని, ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు అందిస్తామన్నారు. ఇన్‌ఛార్జి మంత్రులు వారంలో రెండుసార్లు జిల్లాల్లో పర్యటించాలని సీఎం సూచించారు.
శ్రీలంక అధ్యక్షునిగా ఎన్నికైన మార్క్సిస్ట్ నేత అనురకుమార దిసనాయకేకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్) అభినందనలు తెలిపింది. శ్రీలంక చరిత్రలో తొలిసారి ఓ కమ్యూనిస్ట్ నేత అధ్యక్ష పీఠంపై కూర్చోనున్న ఈ సందర్భం ఎంతో మహత్తరమైనదని పేర్కొంది. శ్రీలంకను దిసనాయకే ప్రగతి పథంలో నడిపిస్తారనే విశ్వాసం తమకు ఉందని చెప్పింది.
AP: లడ్డూ అపవిత్రతకు దోష పరిహారం కోసం ఇవాళ తిరుమలలో అర్చకులు శాంతియాగం నిర్వహించనున్నారు. విమాన ప్రాకారం వద్ద మూడు హోమ గుండాలతో మహా క్రతువు చేపట్టనున్నారు. హోమం అనంతరం పంచగవ్య ప్రోక్షణ నిర్వహిస్తారు. ప్రసాదం పోటు, ద్రవ్యశాల, ఆలయ ప్రాంగణంతో పాటు గర్భాలయంలో సంప్రోక్షణ చేయనున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ఖాన్ సూపర్ హిట్ మూవీ పఠాన్‌కి సీక్వెల్ రాబోతోంది. చిత్ర రచయితగా పని చేసిన అబ్బాస్ టైరేవాలా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. పఠాన్-2కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని తెలిపారు. కొద్ది రోజుల్లో మూవీపై అధికారిక ప్రకటన వస్తుందని వెల్లడించారు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో తెరకెక్కిన పఠాన్ మూవీ 2023లో విడుదలైంది. ఇందులో ‘రా’ ఏజెంట్‌గా షారుఖ్ కనిపించారు.
Sorry, no posts matched your criteria.