News April 18, 2025

మరోసారి మొబైల్ టారిఫ్స్ పెంపు?

image

టెలికాం కంపెనీలు మరోసారి మొబైల్ టారిఫ్స్ పెంచబోతున్నట్లు మనీకంట్రోల్ తెలిపింది. ఈ ఏడాది చివర్లో 10-20% పెంపు ఉండబోతున్నట్లు పేర్కొంది. నవంబర్-డిసెంబర్ నెలల్లో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు రీఛార్జ్ ధరల పెంపును ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించింది. ARPU వృద్ధి, మూలధనంపై మెరుగైన రాబడి కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా గత జులైలోనే టెలికామ్ సంస్థలు టారిఫ్లను పెంచాయి.

News April 18, 2025

క్రికెటర్లు అసభ్య ఫొటోలు పంపేవారు: అనయా

image

తనకు కొందరు క్రికెటర్లు న్యూడ్ ఫొటోలు పంపేవారని టీమ్ ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ కూతురు అనయా తెలిపారు. ఓ సీనియర్ క్రికెటర్ తనతో బెడ్ పంచుకోవాలని ఒత్తిడి చేసేవాడని చెప్పారు. తోటివారితో ఎన్నో అవమానాలకు గురైనట్లు వెల్లడించారు. కాగా బంగర్ కుమారుడు ఆర్యన్ లింగమార్పిడి చేయించుకుని అనయాగా మారారు. అంతకుముందు యశస్వీ జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్‌లతో కలిసి ఆయన క్రికెట్ ఆడారు.

News April 18, 2025

TCS లే ఆఫ్స్‌పై ఉద్యోగుల ఫిర్యాదు

image

USలోని TCS కంపెనీపై ఆ దేశ ‘సమాన ఉపాధి హక్కుల కమిషన్’ విచారణ చేపట్టింది. ఇండియాకు చెందిన హెచ్1బీ వీసాదారులకు లేఆఫ్స్ ఇవ్వకుండా కేవలం దక్షిణాసియేతర ఉద్యోగులనే పక్షపాతంగా తొలగిస్తున్నారని ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఆరోపణలను TCS ప్రతినిధులు ఖండించారు. మెుదటి నుంచి TCS సంస్థ సమానత్వం, సమగ్రత కల్పించడంతో ముందు స్థానంలో ఉంటుందని తెలిపారు.

News April 18, 2025

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

image

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో వీటికి చోటు దక్కింది. ఇది ప్రపంచంలోని ప్రతీ భారతీయుడికి గర్వకారణమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారతీయ సంస్కృతికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చిందన్నారు. భగవద్గీత, నాట్యశాస్త్రం శతాబ్దాలుగా దేశ నాగరికతను, చైతన్యాన్ని పెంపొందించాయని పేర్కొన్నారు.

News April 18, 2025

ఏసుక్రీస్తు త్యాగాన్ని గుర్తుచేసుకోవాలి: PM మోదీ

image

గుడ్‌ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులనుద్దేశించి ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ పవిత్ర రోజున ఏసుక్రీస్తు త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలన్నారు. ఆయనలోని దయ, కరుణ, క్షమాపణ వంటి సద్గుణాలు మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని చెప్పారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు సైతం క్రీస్తు గొప్పతనాన్ని గుర్తు చేశారు. తన శరీరంలోకి మేకులు దించిన సమయంలో కూడా ఏసుక్రీస్తు శాంతిని ప్రబోధించారన్నారు.

News April 18, 2025

రేపు జేఈఈ మెయిన్ ఫలితాలు: NTA

image

జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఫలితాలను రేపు వెల్లడిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా ప్రకటించింది. ఫైనల్ ఆన్సర్ కీలను ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అధికారిక <>వెబ్‌సైట్‌లో<<>> అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. నిన్న ఫైనల్ ‘కీ’ని రిలీజ్ చేసి, మళ్లీ వెబ్‌సైట్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.

News April 18, 2025

హ్యాపీ బర్త్ డే ఐపీఎల్

image

భారతదేశపు అతిపెద్ద ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నమెంట్ ఐపీఎల్ మొదలై నేటికి 18 ఏళ్లు పూర్తవుతోంది. 2008 ఏప్రిల్ 18న BCCI & లలిత్ మోడీ ఈ టోర్నీని ప్రారంభించారు. ప్రతి ఏటా రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించే ఈ IPLకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ టోర్నమెంట్ ఎంతో మంది టాలెంటెడ్ యంగ్ ప్లేయర్స్‌ను భారత క్రికెట్ జట్టుకు సేవలందించే అవకాశాన్నిచ్చింది. ఇన్నేళ్లలో మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేయండి.

News April 18, 2025

‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ REVIEW

image

సొంతంగా అన్యాయాలను ఎదిరించే కుమారుడు, చట్టప్రకారం వెళ్లే తల్లి మధ్య జరిగే సంఘర్షణే ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ స్టోరీ. కళ్యాణ్ రామ్, విజయశాంతి యాక్షన్ సీన్స్, శ్రీకాంత్ నటన ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్, ఊహకందని క్లైమాక్స్ మూవీకి ప్లస్. అయితే రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, ముందే ఊహించే సీన్లు మైనస్. పాటలు ఆకట్టుకునేలా లేవు. హీరోయిన్ సయీ మంజ్రేకర్ పాత్రకు ప్రాధాన్యత లేదు.
RATING: 2.5/5

News April 18, 2025

మే నుంచి ‘రామాయణ’ పార్ట్-2 షూటింగ్?

image

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా నటిస్తున్న ‘రామాయణ’ సినిమా పార్ట్-1 షూటింగ్ దాదాపుగా పూర్తయింది. పార్ట్-2 షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ షెడ్యూల్‌లో అశోక వాటిక సీన్లు, రెండు పాటలతో పాటు పలు కీలక సీన్లు చిత్రీకరిస్తారని సమాచారం. రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను నితేశ్ తివారీ డైరెక్ట్ చేస్తున్నారు. రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీడియోల్ నటిస్తున్నారు.

News April 18, 2025

సమ్మర్‌లో తలనొప్పి రావొద్దంటే..

image

☞ తరచుగా తాగునీటిని తీసుకోవాలి. దాహం వేయకపోయినా తాగడం మంచిది
☞ బయటకు వెళ్లినప్పుడు సన్ గ్లాసెస్, టోపీ ధరించాలి
☞ 11am-4pm మధ్య నీడపట్టున ఉండాలి. అవసరమైతేనే బయటకు వెళ్లాలి
☞ పుచ్చకాయ, నారింజ, దోసకాయ వంటి నీటిశాతం ఎక్కువ ఉండే వాటిని ఆహారంగా తీసుకోవాలి
☞ స్క్రీన్ టైమ్ తగ్గించాలి
☞ సమయానికి భోజనం చేయాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవడం కూడా తలనొప్పికి దారితీస్తుంది
☞ 5-10min మెడిటేషన్ చేయాలి

error: Content is protected !!