News October 28, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 28, 2025

శుభ సమయం (28-10-2025) మంగళవారం

image

✒ తిథి: శుక్ల సప్తమి తె.4.02 వరకు
✒ నక్షత్రం: పూర్వాషాడ మ.12.13
✒ శుభ సమయాలు: సా.5.00-6.00
✒ రాహుకాలం: మ.3.00-సా.4.30
✒ యమగండం: ఉ.9.00-ఉ.10.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-9.12, రా.10.48-11.36
✒ వర్జ్యం: రా.8.39-10.20
✒ అమృత ఘడియలు: ఉ.7.04-8.46
✍️ రోజువారీ పంచాంగం, రాశి ఫలాలు కోసం <<-se_10009>>క్లిక్<<>> చేయండి.

News October 28, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* తుఫాను.. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3వేలు
* రేపు రాత్రి కాకినాడ సమీపంలో తీరం తాకనున్న ‘మొంథా’ తుఫాన్
* జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నాలుగు రోజులు ప్రచారం చేయనున్న సీఎం రేవంత్
* పత్తి తేమ 12% దాటితే మద్దతు ధర రాకపోవచ్చు: తుమ్మల
* రెండో దశలో 12 చోట్ల SIR నిర్వహణ: CEC
* కోలుకుంటున్న టీమ్‌ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్

News October 28, 2025

లోకేశ్ ఆధ్వర్యంలో డేటా సెంటర్ అడ్వైజరీ కౌన్సిల్

image

AP: డేటా సెంటర్ అడ్వైజరీ కౌన్సిల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2030 నాటికి 6వేల MW డేటా సామర్థ్యమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కౌన్సిల్‌ను మంత్రి నారా లోకేశ్ లీడ్ చేయనున్నారు. ఇందులో Microsoft Azure, Jio Platforms వంటి అంతర్జాతీయ కంపెనీలు, IIM విశాఖ, IIT తిరుపతి సంస్థల ప్రతినిధులకు స్థానం కల్పించారు. పెట్టుబడులు, అనుమతులు, నైపుణ్యాభివృద్ధి వంటి వాటిపై కౌన్సిల్ మార్గనిర్దేశం చేయనుంది.

News October 28, 2025

వైద్య చిహ్నం వెనుక అసలు కథ!

image

వైద్య రంగానికి వాడే చిహ్నం వెనుక ఉన్న చరిత్ర గురించి మీకు తెలుసా? ఈ చిహ్నాన్ని ‘రాడ్ ఆఫ్ అస్క్లెపియస్’ అంటారని చరిత్రకారులు చెబుతున్నారు. ఒక్క పాము చుట్టుకొని ఉన్న ఈ కర్ర గ్రీకు వైద్య దేవుడు అస్క్లెపియస్‌కు ప్రతీకగా భావిస్తారు. పాము చర్మం విడిచే విధానం పునర్జన్మ, ఆరోగ్యం & నయం కావడాన్ని సూచిస్తుందని తెలియజేస్తున్నారు. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సింబల్ కూడా ఇదే ఉండటం విశేషం.

News October 28, 2025

నీతులు చెప్పేవారు ఆచరించరు.. ట్రంప్‌పై జైశంకర్ పరోక్ష విమర్శలు

image

రష్యా ఆయిల్ కొనుగోలు విషయంలో US ప్రెసిడెంట్ ట్రంప్ వైఖరిని మంత్రి జైశంకర్ పరోక్షంగా విమర్శించారు. ‘సెలక్టివ్‌గా నిబంధనలు వర్తింపజేస్తున్నారు. నీతులు బోధించే వారు వాటిని ఆచరించరు’ అని మండిపడ్డారు. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నా యూరప్‌పై US టారిఫ్స్ విధించకపోవడాన్ని ఉద్దేశిస్తూ ఆసియాన్ సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంధన వాణిజ్యం పరిమితమవుతోందని, టెక్నాలజీ, సహజ వనరుల కోసం పోటీ పెరిగిపోయిందన్నారు.

News October 27, 2025

కవిత కొత్తగా..

image

TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త వేషధారణలో కనిపిస్తున్నారు. జనం బాట కార్యక్రమం చేపట్టిన ఆమె గతంతో పోలిస్తే సాదాసీదా చీరలు ధరిస్తున్నారు. హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ఉంది. ప్రస్తుతం కవిత నిజామాబాద్ జిల్లాలో రైతులను పరామర్శిస్తున్నారు. 4 నెలల పాటు ఈ యాత్ర సాగనుంది.

News October 27, 2025

రావి చెట్టును ఎందుకు పూజించాలి?

image

రావి వృక్షం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. యజ్ఞాలలో అగ్నిని పుట్టించే ‘అరణి మధనం’లో రావి కర్రలను ఉపయోగిస్తారు. దీని ఔషధ గుణాలు అనారోగ్యాలను దూరం చేస్తాయి. గర్భదోషాలు తొలగించే గుణం ఉన్నందున సంతానం లేనివారు ఈ చెట్టుకు ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతుందని విశ్వాసం. గౌతమ బుద్ధునికి జ్ఞానోదయమైంది కూడా ఈ వృక్షం కిందే. అందుకే ఆలయాల్లో దైవంతో పాటు కచ్చితంగా ఈ రావి వృక్షాలకు కూడా పూజలు నిర్వహిస్తారు.

News October 27, 2025

AP: ‘మొంథా’ తుఫాన్ అలర్ట్స్

image

* ఉత్తర-వాయవ్య దిశగా గంటకు 15km వేగంతో కదులుతున్న తుఫాను
* రేపు సాయంత్రం లేదా రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం
* 44 మున్సిపాలిటీలు, 233 మండలాల్లోని 1,419 గ్రామాలపై ప్రభావం
* 2,194 పునరావాస కేంద్రాలు సిద్ధం చేసిన ప్రభుత్వం
* కమ్యూనికేషన్ కోసం జిల్లాలకు 16 శాటిలైట్ ఫోన్లు, 35 డీఎంఆర్ సెట్లు పంపిణీ
* వీఎంసీ కంట్రోల్ రూమ్‌: 0866-2424172, 0866-2422515, 0866-2427485 ఏర్పాటు

News October 27, 2025

అయ్యప్ప దీక్షలో ఉంటూ లంచం

image

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి తహశీల్దార్ ఆఫీసులో పూసుగూడెం రెవెన్యూ క్లస్టర్ GPO బనావత్ శ్రీనివాస్ రావు లంచం తీసుకుంటూ దొరికాడు. 2 ఎకరాల 30 గుంటల భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.60వేలు లంచం డిమాండ్ చేశాడు. రూ.40వేలు తీసుకున్నాడు. మిగిలిన రూ.20వేలలో రూ.5వేలు తగ్గించి మిగతా రూ.15వేలు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కాడు. అతడు అయ్యప్ప దీక్షలో ఉండి లంచం తీసుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.