India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: సీఎం అయ్యాక తొలిసారి చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ఇక నుంచి ప్రతి శనివారం పార్టీ ఆఫీస్‌కు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
ఇన్‌కమింగ్ కాల్ వచ్చినప్పుడు ఫోన్‌లో డిస్ప్లే అయ్యే కాలర్ ఐడీపై టెలికం కంపెనీలు ట్రయల్స్‌కు సిద్ధమయ్యాయి. ఇటీవల స్పామ్, మోసపూరిత కాల్స్ పెరగడంతో కాలింగ్ నేమ్ ప్రజంటేషన్ తీసుకురావాలని ట్రాయ్ ప్రతిపాదించింది. తొలుత వ్యతిరేకించిన టెలికం కంపెనీలు.. GOVT, TRAI ఒత్తిడితో త్వరలో కొన్ని నగరాల్లో ట్రయల్స్ చేపట్టనున్నాయి. పరిశీలన అనంతరం ఈ సేవలు సాధ్యమా? లేదా? అనే దానిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాయి.
రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతుందంటూ మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇదేరోజున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ కూడా విడుదలవుతుందని గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే, షూటింగ్ పూర్తవకపోవడంతో విడుదల వాయిదా పడినట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఢిల్లీ-ఛత్తీస్‌గఢ్ రైలులో ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె బెర్త్ పైన సీట్లో ప్రయాణించిన ఆర్మీకి చెందిన వ్యక్తి మద్యం మత్తులో మూత్రవిసర్జన చేశాడు. అది కింద సీట్లో నిద్రిస్తున్న మహిళపై పడింది. దీంతో ఆమె భర్త రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా నిందితుడిపై చర్యలు తీసుకోలేదని ఆగ్రహించిన సదరు మహిళ ఘటనపై PM కార్యాలయానికి, రైల్వే మంత్రికి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసింది.
AP: ప్రభుత్వ స్కూళ్లలో ఏడాదిలోగా పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. విద్యాశాఖపై ఆయన అధికారులతో సమీక్షించారు. ‘కొత్త పనులు, నిలిచిన పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలి. ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేట్ బడులకు విద్యార్థులు మారేందుకు గల కారణాలను విశ్లేషించి నివేదిక ఇవ్వాలి. గత ఐదేళ్లలో ఎన్ని బడులు మూతపడ్డాయి? దానికి కారణాలు ఏంటి?’ అనే వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
పీఎం కిసాన్ స్కీమ్ 17వ విడత నిధులు ఈ నెల 18వ తేదీన విడుదల కానున్నాయి. రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వారణాసి పర్యటనలో PM మోదీ ఈ నిధులను విడుదల చేస్తారని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ తొలి సంతకం ఈ నిధుల విడుదల దస్త్రంపైనే పెట్టారు. ఈ స్కీమ్ కింద ఏటా రూ.6వేలను(3 విడతల్లో రూ.2వేలు) రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం అందిస్తోంది.
AP: గత ఐదేళ్లలో వైసీపీ నేతలు తిన్న సొమ్మంతా కక్కించే వరకు వదిలిపెట్టమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని ఆ పార్టీ నేతలు దోచుకున్నారని విమర్శించారు. వారు ఎక్కడ దాచినా బయటికి తీసుకొస్తామని పేర్కొన్నారు. కాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
మైక్రోసాఫ్ట్ సాధించిన విజయం వెనుక భారతీయుల కృషి ఎంతగానో ఉందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. భారత్ నుంచి నైపుణ్యమున్న గ్రాడ్యుయేట్లను అమెరికా తీసుకెళ్లామని, వారే తిరిగి భారత్‌కు వచ్చి డెవలప్‌మెంట్ సెంటర్లను నెలకొల్పారని వెల్లడించారు. తమ విజయంలో భాగస్వాములైన చాలామంది భారతీయులేనని, ప్రస్తుతం ఇండియాలో 25వేలమంది సంస్థలో పనిచేస్తున్నారని గేట్స్ వివరించారు.
FY06 నుంచి ఐటీ రిటర్న్స్‌కు ఫైల్ చేసే వారికి 26AS ఫారం ముఖ్యమైనది. ఇందులో లావాదేవీలు, పన్ను చెల్లింపుల వివరాలన్నీ ఉంటాయి. A, B, C అని మూడు భాగాలుగా ఉండే ఈ ఫారం కోసం incometaxindiaefiling.gov.inలో లాగిన్ అవ్వాలి. మై అకౌంట్ > వ్యూ ఫార్మ్ 26AS > కన్ఫామ్ క్లిక్ చేస్తే TRACES సైట్‌కు రీడైరెక్ట్ అవుతుంది. అందులో వ్యూ ట్యాక్స్ క్రెడిట్ క్లిక్ చేసి ఫారం పొందొచ్చు. FY24 ITR ఫైలింగ్‌కు జులై 31 లాస్ట్ డేట్.
ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానున్న టీమ్ఇండియా-కెనడా మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. ఫ్లోరిడాలో భారీ వర్షాలు పడుతుండటంతో ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని weather.com పేర్కొంది. మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం 50 శాతంగా ఉందని తెలిపింది. ఈ మైదానంలో నిన్న అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్ కూడా వర్షార్పణమైంది. కాగా గ్రూప్-ఏలో ఇండియా, అమెరికా ఇప్పటికే సూపర్-8కి అర్హత సాధించాయి.
Sorry, no posts matched your criteria.