India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం సంస్థ పరిధిలోని ఉపరితల గనుల మట్టిదిబ్బలు, కొండలు, గుట్టలపై గాలిమరలు ఏర్పాటు చేయనుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇలాంటి ప్లాంట్లపై అధ్యయనం చేస్తోంది. గాలిమరల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలేవి? వాటిని ఏ దిశలో అమర్చాలి? వాటితో ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు? వంటి అంశాలపై మెస్సర్స్ పీఈసీ(ఢిల్లీ) సంస్థతో రీసెర్చ్ చేయిస్తోంది.
TG: విద్యుత్ కొనుగోళ్లపై ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణలో ఏమాత్రం నిష్పాక్షికత కనిపించట్లేదని మాజీ CM KCR అన్నారు. ‘విచారణ అనేది పవిత్రమైన బాధ్యత. కానీ కమిషన్ ఛైర్మన్ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలని మాట్లాడుతున్నట్లుంది. అందుకే నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు’ అని లేఖలో పేర్కొన్నారు. కమిషన్ ఛైర్మన్‌గా నరసింహారెడ్డి తప్పుకోవాలని KCR సూచించారు.
రొమేనియా వాసి, గణిత మేధావి స్టెఫాన్ మాండెల్ 1950సం.లో ఓ చిరుద్యోగి. జీతం చాలక లాటరీలపై ఫోకస్ చేసి గెలిచే ఛాన్స్ గల టికెట్లు కొనేందుకు ఓ సూత్రం కనిపెట్టాడు. దీంతో 1960-70 మధ్య 14 జాక్‌పాట్‌లతో ₹200Cr పైగా గెలిచాడు. అనంతరం సిండికేషన్ పెట్టి సభ్యులకు ఈ సలహాలిచ్చాడు. కానీ ఈ విధానంపై ప్రభుత్వం, లాటరీ సంస్థలు కోర్టులకెళ్లాయి. దీంతో న్యాయ పోరాటాలకే ఆస్తులన్నీ ఖర్చై మళ్లీ సాధారణ జీవితం గడుపుతున్నాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది నక్సల్స్ హతమయ్యారు. ఈ కాల్పుల్లో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. నారాయణ్‌పుర్, కాంకేర్, దంతేవాడ, కొండగావ్ జిల్లాలకు చెందిన జవాన్లు సంయుక్తంగా ఈ యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
AP: కేబినెట్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సముచిత స్థానం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. ఆయన ఆదేశంతో పలు కార్యాలయాల్లో ఇద్దరి ఫొటోలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
NDA ప్రభుత్వం అనుకోకుండా ఏర్పడిందని, అది ఎప్పుడైనా కూలిపోవచ్చని AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘దేశ ప్రజల బాగు కోసం మేం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇండియా కూటమికి పరస్పరం సహకరించుకుంటూ దేశాన్ని పటిష్ఠం చేయాలని ఉంది. కానీ మేము NDA సర్కార్ కూలిపోవాలని కోరుకోవటం లేదు. ప్రజలకు సుస్థిర పాలన అందాలని ఆశిస్తున్నాం’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
TG: జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు మాజీ సీఎం కేసీఆర్ 12 పేజీలతో కూడిన లేఖ రాశారు. ‘బీఆర్ఎస్ హయాంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాం. కరెంట్ విషయంలో గణనీయమైన మార్పు చూపించాం. కానీ రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. నేను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. కమిషన్ ఛైర్మన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు నన్ను బాధించాయి.’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘కిషన్ రెడ్డి నిబద్ధత, అనుభవం కలిగిన నాయకుడు. అలాంటి నాయకుడితో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది’ అని పెమ్మసాని పేర్కొన్నారు. కాగా కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, ఏపీ నుంచి పెమ్మసానికి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కిన సంగతి తెలిసిందే.
AP: అనంతపురం జిల్లా కనేకల్ మం. తుంబిగనూరులో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. తాగునీటి శుద్ధజల ట్యాంకులో నిన్న రాత్రి పురుగు మందు కలిపి విషప్రయోగానికి కుట్ర చేశారు. ఉదయాన్నే ట్యాంకులో డబ్బా గుర్తించి, ఎవరూ ఆ నీళ్లు తాగకపోవడంతో ముప్పు తప్పింది. టీడీపీ గెలిచిందన్న అక్కసుతోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఎస్సై ఆ గ్రామానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
బిహార్ CM నితీశ్ కుమార్ PM మోదీ కాళ్లను తాకి ఆ రాష్ట్ర ప్రజల్ని అవమానించారని ప్రశాంత్ కిశోర్ అన్నారు. అధికారంలో కొనసాగడం కోసమే ఆయన అలా చేశారని ఆరోపించారు. ‘నేను గతంలో నితీశ్‌తో పనిచేసినప్పుడు ఆయన వ్యక్తిత్వం వేరు. అప్పుడు ఆయన తన మనస్సాక్షిని అమ్మకానికి పెట్టలేదు. ఇప్పుడు NDAలో కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఈ అవకాశాన్ని ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకోవట్లేదు’ అని విమర్శించారు.
Sorry, no posts matched your criteria.