India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD యాచారం(మ) మేడిపల్లి వద్ద గ్రీన్ ఫార్మాసిటీ కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రద్దు అంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదని హైకోర్టులో ప్రభుత్వం తరఫున రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిత్తల్ కౌంటర్ దాఖలు చేశారు. ఫార్మా సిటీ భూమి విషయంలో తన 10 ఎకరాలపై లావాదేవీలు చేసుకునేలా అనుమతి కోరుతూ సత్య చౌదరి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణలో భాగంగా ప్రభుత్వం ఇలా స్పందించింది.
ఢిల్లీకి 8వ ముఖ్యమంత్రిగా ఆప్ నేత ఆతిశీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం తన గురువు, పార్టీ అధినేత కేజ్రీవాల్‌కు ఆమె పాదాభివందనం చేశారు. 43 ఏళ్ల ఆతిశీ ప్రస్తుతం దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన సీఎం కావడం విశేషం. ఇక ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగానూ ఆమె చరిత్రకెక్కారు. అంతకుముందు షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ దేశ రాజధానికి సీఎంగా పనిచేశారు.
AP: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు ఈ నెల 25న పరిహారం పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరదలకు ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి రూ.25వేలు, మొదటి, ఆపై అంతస్తు వారికి రూ.10వేలు నేరుగా అకౌంట్లలో జమ చేయనున్నారు. చనిపోయిన పశువులు, నష్టపోయిన వ్యాపారులు, వాహనాలు దెబ్బతిన్న వారికి, పంటలు నష్టపోయిన వారికి కూడా బుధవారం రోజునే అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని CM సూచించారు.
TG: రెవెన్యూ ఉద్యోగుల పనితీరు మెరుగుపడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. రెవెన్యూ ఉద్యోగులతో ఆయన భేటీ అయ్యారు. ‘రాష్ట్రంలో గజం ప్రభుత్వ భూమి కూడా కబ్జా కావొద్దు. ఇందులో రాజీ పడొద్దు. ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారిని పునరుద్ధరిస్తాం. దీనికి సంబంధించి ఈ నెల 29న MRO స్థాయి, అక్టోబర్ 6న RDO, అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లతో చర్చిస్తాం’ అని మంత్రి తెలిపారు.
AP: పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో భేటీ అయ్యారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆమె గవర్నర్‌ను కోరారు. ఈ కేసును సీబీఐతో విచారణ చేయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లడ్డూ కల్తీ బాధ్యులు ఎవరో తేల్చాలని కోరారు.
పుణేలో ఓ CA ఒత్తిడితో సూసైడ్ చేసుకున్న ఘటన మరువక ముందే చెన్నైలో కార్తికేయన్ అనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(38) ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెనీ ప్రాంతానికి చెందిన ఆయన కుటుంబంతో సహా చెన్నైలో ఉంటున్నారు. వృత్తిపరమైన ఒత్తిడి, డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా కుటుంబీకులెవరూ ఇంట్లోలేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
TG: అమృత్ టెండర్ల పంపిణీలో అవినీతి జరిగిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ <<14158364>>వ్యాఖ్యలపై<<>> పరువు నష్టం దావా వేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. రూ.8,888 కోట్ల టెండర్లు ఎవరు దక్కించుకున్నారో కేటీఆర్ చెప్పాలన్నారు. తెల్లారితే పోలింగ్ ఉండగా గత ప్రభుత్వమే ప్రత్యేక అనుమతులతో 3 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచి పీఎల్ఆర్, మేఘా, గజా కన్‌స్ట్రక్షన్స్‌కు కట్టబెట్టిందన్నారు.
AP: ఈ నెల 26న వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య తమ పార్టీలో చేరుతున్నట్లు జనసేన ప్రకటించింది. వీరితోపాటు విజయనగరం జిల్లాకు చెందిన అవనపు విక్రమ్, భావన, ప్రకాశం జిల్లాకు చెందిన యాదాల అశోక్, రత్నభారతి కూడా పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ ట్వీట్ చేసింది.
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది. 2022 ఆర్థిక సంక్షోభం తరువాత తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసే సమయానికి 70% ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘె, విపక్ష నేత సంజిత్ ప్రేమదాస, అనూర దిస్సనాయకే మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. పోలింగ్ పూర్తైన వెంటనే కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సిందే.
తెలంగాణలోని 8 మెడికల్ కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే 3 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. వీటితో పాటు ఏటూరు నాగారం ఫైర్ స్టేషన్‌కు 34 సిబ్బంది మంజూరు, కోస్గిలో ఇంజినీరింగ్ కాలేజీ, హకీంపేటలో జూనియర్ కాలేజీ మంజూరుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రెండేళ్లలో SLBC టన్నెల్ పనులు పూర్తి చేసేలా రూ.4637 కోట్లు మంజూరు చేసింది.
Sorry, no posts matched your criteria.