India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బేర్స్ దెబ్బకు గత సెషన్‌లో US మార్కెట్లు కుదేలయ్యాయి. S&P500 2.9%, Dow Jones 2.6%, Nasdaq 3.6% నష్టపోయాయి. 2025లో వడ్డీ రేట్ల కోత నాలుగుసార్లకు బదులుగా 2 సార్లే ఉండొచ్చన్న ఫెడ్ అంచనా ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశపరచడం నష్టాలకు కారణమైంది. అటు దేశీయ సూచీలు 3 రోజుల నుంచి వరుసగా నష్టపోతున్నాయి. సూచీల కదలికలపై ప్రీమార్కెట్ బిజినెస్ ప్రభావం చూపనుంది. Gift Nifty -318 ప్రతికూలాంశం.

AP అరసం గౌరవ సలహాదారు, కథ, నవలా రచయిత కాటూరి రవీంద్ర త్రివిక్రమ్(80) విజయవాడలో గుండెపోటుతో నిన్న కన్నుమూశారు. సాహిత్యంపై ఆసక్తితో 11 ఏళ్లకే రచనా ప్రస్థానం ప్రారంభించారు. 1974లో తొలి కథ ప్రచురితమైంది. 600కు పైగా కథ, కథానిక, నవల, నవలిక, హరికథ, నాటకాలు, 400కు పైగా వ్యాసాలు రాశారు. సైనికుడిగా 1965, 1971లో భారత్-పాక్ యుద్ధాల్లో పాల్గొన్నారు. హైకోర్టు లాయరుగా, బార్ అసోసియేషన్ జీవితకాల సభ్యుడిగా ఉన్నారు.

AP: కానిస్టేబుల్ స్టేజ్-2 PMT/PET పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. నిన్న రాత్రి పోలీస్ నియామక మండలి అందుబాటులో ఉంచింది. 29వ తేదీ మ. 3గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. DEC 30 నుంచి FEB 1 వరకు ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లను ఆఫీసు(ఉ.10-సా.6) సమయంలో సంప్రదించండి. హాల్‌టికెట్ల కోసం ఇక్కడ <

AP: సీఎం చంద్రబాబు రేపు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గంగూరు, ఈడ్పుగల్లులో రైతు, రెవెన్యూ సదస్సుల్లో పాల్గొననున్నారు. తొలుత గంగూరులో రైతు సేవా కేంద్రం సందర్శన, రైతు సదస్సు, రైతుల నుంచి ధాన్యం సేకరణను పరిశీలించనున్నారు. ఈడ్పుగల్లు బీసీ కాలనీలో రెవెన్యూ సదస్సులో పాల్గొంటారు.

తెలంగాణను చలి వణికిస్తోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్‌లో ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు వణుకుతున్నారు. ASF(D) సిర్పూర్(U)లో 5.9 డిగ్రీలు, HYDలో 11.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 2 రోజుల్లో చలితీవ్రత మరింత పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD సూచించింది.

ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణను 2024 ఏడాదికి గాను కేంద్ర సాహిత్య పురస్కారం వరించింది. ఆయన రచించిన ‘దీపిక’ అనే సాహిత్య విమర్శా సంపుటికి ఈ గౌరవం దక్కింది. తెలుగుతో సహా 21 భారతీయ భాషల్లో సాహిత్య అకాడమీ పురస్కార విజేతల పేర్లను అకాడమీ ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 8న ఈ పురస్కారాలను అందజేయనున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.

HYDలోని ఎన్టీఆర్ స్టేడియంలో నేటి నుంచి 29వ తేదీ వరకు 37వ బుక్ ఫెయిర్(HBF) నిర్వహించనున్నారు. దీన్ని CM రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని HBF అధ్యక్షుడు డా.యాకూబ్ తెలిపారు. 350 స్టాళ్లలో 200 మందికి పైగా డిస్ట్రిబ్యూటర్లు, పబ్లిషర్స్ పుస్తకాలు ప్రదర్శించనున్నట్లు చెప్పారు. అలాగే తెలంగాణ రుచులతో ఫుడ్ స్టాల్స్, పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలూ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోందని APSDMA తెలిపింది. రానున్న 24 గంటల్లో ఉ.తమిళనాడు, ద.కోస్తా తీరం వైపు, ఆ తర్వాత ఉత్తరం దిశగా AP తీరం వెంబడి పయనిస్తుందని తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, VZM, అల్లూరి, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏలూరు, కృష్ణా, NTR, GNT, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, TRPT జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.

TG: రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇందుకోసం USకు చెందిన ఐటీ సర్వ్ అలయన్స్‌తో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. తొలి విడతలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలకు విస్తరిస్తామన్నారు. ఆయా జిల్లాల్లో స్థానికులకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి, 30 వేల ఐటీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్‌లో 2025 జనవరి నుంచి యూనిఫామ్ సివిల్ కోడ్(UCC)ను అమలు చేయబోతున్నట్లు ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ ధామీ ప్రకటించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ నిర్ణయంతో దేశంలో స్వాతంత్య్రం తర్వాత UCC అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. మతంతో సంబంధం లేకుండా పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత వంటి విషయాల్లో దేశంలోని ప్రజలందరికీ ఒకే విధమైన చట్టాన్ని అమలు చేయడమే UCC ముఖ్య ఉద్దేశం.
Sorry, no posts matched your criteria.