India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: రాష్ట్రంలో చైనా తరహా విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ ప్లాంట్లు చెత్త ఆధారంగా పనిచేస్తాయని చెప్పారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మూడేళ్లలో రాజధాని అమరావతి పనులు పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం నిధులను దారి మళ్లించింది. విపరీతంగా పన్నులు పెంచి ప్రజలను దోపిడీ చేసింది. తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నాం’ అని ఆయన తెలిపారు.

జమిలి బిల్లును కేంద్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)కి పంపనున్న విషయం తెలిసిందే. కమిటీకి అధికార, విపక్షాల నుంచి సభ్యులను ఎంపిక చేస్తారు. INC తరఫున ప్రియాంక గాంధీ, మనీశ్ తివారీకి చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. TDP నుంచి హరీశ్ బాలయోగి, DMK-విల్సన్, సెల్వ గణపతి, JDU-సంజయ్ ఝా, SP-ధర్మేంద్ర యాదవ్, శివసేన(శిండే)-శ్రీకాంత్ శిండే, TMC నుంచి కళ్యాణ్ బెనర్జీ, సాకేత్ గోఖలేకు అవకాశం దక్కుతుందని సమాచారం.

రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు జవాన్లు మరణించారు. ట్రైనింగ్‌లో భాగంగా ఓ ట్రక్కులో మందుగుండు సామగ్రి లోడ్ చేస్తుండగా పేలుడు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరొకరికి గాయాలు అయ్యాయని తెలిపారు. మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ఈ ప్రమాదం జరిగింది.

ఉద్యోగ వేటలో ఉన్న తెలుగు రాష్ట్రాల యువకులు దేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ, కొన్ని కంపెనీలు దక్షిణ భారతదేశానికి చెందిన వారిని అణచివేస్తున్నాయి. నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగాల్లోకి తీసుకోకుండా ప్రాంతీయతను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. తాజాగా యూపీలోని నోయిడాకు చెందిన ఓ కన్సల్టింగ్ కంపెనీ ఇచ్చిన నోటిఫికేషన్‌లో సౌత్ఇండియన్స్ అర్హులు కాదని పేర్కొంది. దీనిపై విమర్శలొస్తున్నాయి.

రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం తనను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందని టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నారు. అతనో గొప్ప బౌలర్, లెజెండ్ అని కొనియాడారు. ఇండియా కోసం చాలా వికెట్లు తీశారని చెప్పారు. తన గొప్ప ప్రదర్శనతో ఎన్నోసార్లు ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించారని వివరించారు. తను ప్రారంభించబోయే కొత్త జీవితంలో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు హర్భజన్ తెలిపారు.

జట్టు కష్టాల్లో ఉంటే అశ్విన్ ఎంత రిస్క్ అయినా తీసుకొనేవారు. అలసిన తన దేహాన్ని అస్సలు పట్టించుకొనేవారు కాదు. వరుసగా 5 సెషన్లు బౌలింగ్ చేసి నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన సందర్భాలెన్నో. 2021 BGT సిడ్నీ టెస్టులో అతడి పట్టుదలను ఎంత పొగిడినా తక్కువే. 49 ఓవర్లు వేసి అతడి కాళ్లు తిమ్మిరెక్కాయి. నడుం నొప్పితో దేహం సహకరించకున్నా ఆఖరి రోజు విహారితో కలిసి క్రీజులో నిలబడ్డారు. ఓడిపోయే మ్యాచును డ్రాగా మలిచారు.

సర్వే నౌక ఐఎన్ఎస్ నిర్దేశక్‌ను కేంద్ర మంత్రి సంజయ్ సేథ్ జాతికి అంకితం చేశారు. ఇవాళ విశాఖపట్నం నేవల్ డాక్ యార్డులో ఇది జలప్రవేశం చేసింది. దీనిని హైడ్రోగ్రఫీ సర్వేలు, నేవిగేషన్ అవసరాల కోసం రూపొందించారు. అత్యాధునిక హైడ్రో, ఓషనోగ్రాఫిక్ పరికరాలతో దీనిని నిర్మించారు. ఇది 18 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. 110 మీటర్ల పొడవు ఉండే ఈ నౌక రెండు డీజిల్ ఇంజిన్ల సహకారంతో నడుస్తుంది.

రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ తన చివరి మ్యాచ్ వరకు భారత జట్టుకు అండగా ఉన్నారు. బాల్‌తోనే కాకుండా అవసరమైనప్పుడు బ్యాట్‌తోనూ రాణించి నిజమైన ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందారు. బ్యాటర్లు విఫలమైనప్పుడు ‘ఇంకా అశ్విన్ ఉన్నాడులే’ అన్న అభిమానుల ధైర్యం అతడు. మన్కడింగ్, బౌలింగ్ వేస్తూ ఆగిపోవడం వంటి ట్రిక్స్‌తో ప్రత్యర్థి బ్యాటర్ల ఏకాగ్రతను దెబ్బతీయడం అశ్విన్‌కే చెల్లింది.

మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో 2011 వన్డే వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టులో ఒక్కరు మినహా మిగిలిన ప్లేయర్లంతా క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. నిన్నటి వరకు ఆల్‌రౌండర్ అశ్విన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మాత్రమే యాక్టివ్ ప్లేయర్ల జాబితాలో ఉండేవారు. అయితే, ఇవాళ అశ్విన్ వీడ్కోలు పలకడంతో కేవలం కోహ్లీ ఒక్కడే మిగిలారు. ఈక్రమంలో అప్పటి WC ఫొటోలో కోహ్లీని హైలైట్ చేసిన ఫొటో వైరలవుతోంది.

బాబా సాహెబ్‌ను కాంగ్రెస్ అవమానించిన చీకటి చరిత్రను HM అమిత్‌షా బయటపెట్టారని PM మోదీ అన్నారు. రాజ్యసభలో ఆయన అన్నీ నిజాలే చెప్పారన్నారు. అంబేడ్కర్ వారసత్వాన్ని తుడిచేసేందుకు కాంగ్రెస్ ప్రతి ట్రిక్కును వాడిందని Xలో విమర్శించారు. ‘ఏళ్లతరబడి అంబేడ్కర్‌ను మీరు అవమానించిన తీరు, చెప్పిన అబద్ధాలు, చేసిన తప్పులను కాంగ్రెస్, దాని కుళ్లిన ఎకోసిస్టమ్ దాచాలనుకుంటే అది పెద్ద మిస్టేకే అవుతుంది’ అని అన్నారు.
Sorry, no posts matched your criteria.