News September 21, 2024

భద్రతామండలిలో చేరేందుకు భారత్‌కు ఉన్న అడ్డంకులివే

image

ఐరాస భద్రతామండలి(UNSC)లో US, ఫ్రాన్స్, రష్యా, UK, చైనాలు శాశ్వత సభ్యదేశాలు. భారత్‌కు అన్ని అర్హతలూ ఉన్నా సభ్యత్వం మాత్రం దక్కడం లేదు. వీటో అధికారంతో చైనా మోకాలడ్డుతుండటం, ‘వీటో పవర్ లేకుండానే సభ్యత్వం’ అనే ప్రతిపాదనకు భారత్ నిరాకరణ, తాము చెప్పిన మాట భారత్ వినదేమోనన్న పశ్చిమ దేశాల అనుమానాలు, పొరుగు దేశాలపై భారత్‌కు నియంత్రణ లేకపోవడం కారణాలుగా ప్రపంచ రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

News September 21, 2024

నేను ఏసీ వ్యాన్‌లో.. రజనీ నేలమీద: అమితాబ్

image

రజనీకాంత్ వెట్టయాన్ మూవీలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చెన్నైలో జరిగిన ఆడియో ఫంక్షన్‌కు ఆయన తన వీడియో మెసేజ్‌ను పంపించారు. ‘ఇది నా తొలి తమిళ సినిమా. 1991లో వచ్చిన హమ్ సినిమాలో నేను, రజనీ కలిసి నటించాం. ఆ షూటింగ్‌లో నేను ఏసీ కారవ్యాన్‌లో పడుకుంటే తను మాత్రం సెట్‌లో నేలపై నిద్రించేవారు. ఆ సింప్లిసిటీ చూశాక నేనూ బయటే పడుకునేవాడిని’ అని గుర్తుచేసుకున్నారు.

News September 21, 2024

ప్ర‌తి అంశంలో బీజేపీని టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్‌

image

BJPని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ అవినీతి వల్లే శివాజీ విగ్రహం కూలిందని, గురుగ్రామ్‌లో బైక‌ర్ మృతికి కార‌ణ‌మైన కారుపై BJP స్టిక్క‌ర్ ఉండ‌డం వ‌ల్లే ఆ డ్రైవ‌ర్‌కు ఒక్కరోజులోనే బెయిల్ వచ్చింద‌ని విమ‌ర్శించింది. పుణేలో పేవ్‌మెంట్‌కు గుంత‌ప‌డి ట్ర‌క్కు ఇరుక్కోవడంతో కొత్త ఎక్స్‌ప్రెస్ వే ద్వారా సెకెన్ల‌లో పాతాళానికి చేరుకోవ‌చ్చంటూ BJPని టార్గెట్ చేస్తోంది.

News September 21, 2024

Learning English: Synonyms

image

✒ Important: Necessary, Vital
✒ Interesting: Bright, Intelligent
✒ Keep: Hold, Maintain, Sustain
✒ Kill: Slay, Execute, Assassinate
✒ Lazy: Indolent, Slothful, Idle
✒ Little: Dinky, Puny, Diminutive
✒ Look: Inspect, Survey, Study
✒ Love: Like, Admire, Esteem
✒ Make: Design, Fabricate

News September 21, 2024

తిరుమల లడ్డూ వివాదం.. కేరళ కాంగ్రెస్ సెటైరికల్ ట్వీట్

image

తిరుమల లడ్డూపై వివాదం కొనసాగుతున్న వేళ వేలాది ALT అకౌంట్లలో ఒకే తరహా ట్వీట్లు రావడంపై కేరళ కాంగ్రెస్ సెటైరికల్ ట్వీట్ చేసింది. ‘2-3 ఏళ్లుగా శ్రీవారి లడ్డూ రుచి చూడగానే మా అమ్మ అనారోగ్యం పాలయ్యేది. దాన్ని ఎక్కువగా తినొద్దని మాకు చెప్పేది. అందులో ఏదో తప్పుగా జరుగుతోందని ఇప్పుడు అర్థమైంది’ అంటూ ట్వీట్లు వచ్చాయి. దీంతో అందరికీ ఒకే అమ్మ ఉందా అనే అర్థంలో ‘వన్ నేషన్.. వన్ మామ్’ అని INC రాసుకొచ్చింది.

News September 21, 2024

వేమన నీతి పద్యం- తాత్పర్యం

image

చిక్కియున్నవేళ సింహంబునైనను
బక్కకుక్కకఱచి బాధ చేయు
బలిమి లేని వేళబంతంబు చెల్లదు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: బలం తగ్గిపోయి చిక్కిపోయినప్పుడు సింహాన్ని కూడా కుక్క కరవగలదు. అందువల్ల మనకు బలం లేనప్పుడు పంతానికి పోవడం మంచిది కాదు.

News September 21, 2024

హెజ్‌బొల్లా టాప్ కమాండర్ హతం

image

ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మిలిటెంట్ల మధ్య భీకర వార్‌తో మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. తాజాగా ఇజ్రాయెల్ చేసిన అటాక్‌లో హెబ్‌బొల్లా ఆపరేషన్స్ కమాండర్ ఇబ్రహీం అకిల్ హతమయ్యాడు. 1983లో లెబనాన్ రాజధాని బీరుట్‌లోని US రాయబార కార్యాలయంపై బాంబు దాడిలో ఇతనిదే కీలక పాత్ర. అదే ఏడాది US మెరైన్ బ్యారక్స్‌పై అటాక్ చేశాడు. ఇతని ఆచూకీ చెబితే 70 లక్షల డాలర్ల రివార్డు ఇస్తామని గత ఏడాది అమెరికా ప్రకటించింది.

News September 21, 2024

రజనీకాంత్ మాటలతో నా జీవితంలో మార్పు: రానా

image

కష్టకాలంలో ఉన్నప్పుడు రజనీకాంత్ అండగా నిలిచారని హీరో రానా తెలిపారు. ‘వేట్టయాన్’ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ సూపర్ స్టార్‌పై ప్రశంసలు కురిపించారు. ‘నేను గతంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యా. మళ్లీ నటిస్తానని అనుకోలేదు. ఆ టైమ్‌లో రజనీ సార్ నాతో గంటపాటు మాట్లాడి స్ఫూర్తి నింపారు. దీంతో నా జీవితంలో మార్పు వచ్చింది. అందరికీ క్లాస్‌మేట్స్, కాలేజ్‌మేట్స్ ఉంటే నాకు రజనీ హాస్పిటల్ మేట్’ అని చెప్పారు.

News September 21, 2024

సెప్టెంబర్ 21: చరిత్రలో ఈ రోజు

image

✒ 1862: తెలుగు మహాకవి గురజాడ అప్పారావు జయంతి
✒ 1931: దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు జననం
✒ 1979: వెస్టీండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ జననం
✒ 1939: రచయిత్రి రంగనాయకమ్మ జననం
✒ 2003: సినీ నటి కృతి శెట్టి జననం
✒ 2012: తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ మరణం
✒ అంతర్జాతీయ శాంతి దినోత్సవం
✒ ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం

News September 21, 2024

సంచలనం.. SAపై అఫ్గాన్ భారీ విజయం

image

సౌతాఫ్రికాపై రెండో ODIలో అఫ్గాన్ 177 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. దీంతో తొలిసారి ఆ జట్టుపై 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. అఫ్గాన్ 311/4 స్కోర్ చేయగా, SA 34.2 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. రషీద్ 5, ఖరోటే 4 వికెట్లు తీశారు. బవుమా 38, జోర్జి 31, మార్‌క్రమ్ 21, హెండ్రిక్స్ 17 మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. అఫ్గాన్ బ్యాటర్లలో గుర్బాజ్ 105, అజ్మతుల్లా 86, రహ్మత్ 50 అదరగొట్టారు.